కాశీలో సప్తఋషి హారతి ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ఇస్తారు..
సోమవారం పరమేశ్వరుడి పూజ చాలా ప్రాముఖ్యత సంతరించుకుని ఉంటుంది. శివ భక్తులు సోమవారం శివుడిని భక్తిగా పూజించడమే కాకుండా ఉపవాసం కూడా ఉంటారు. శివుడి అద్భుతమైన క్షేత్రంగా కాశీ పిలవబడుతుంది. కాశీ దేవదేవుడు అయిన పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిత్యం జరుగుతూ ఉంటాయి. అయితే కాశీ క్షేత్రంలో సప్తఋషి హారతి ఇస్తారు. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ఇస్తారో చాలా మందికి తెలియదు. చాలా మంది దీని గురించి తెలుసుకోకుండానే కాశీకి వెళ్లి వస్తుంటారు. సప్రఋషి హారతి గురించి తెలుసుకుంటే..
కాశీ విశ్వనాథ ఆలయం..
కాశీ విశ్వనాథ ఆలయంలో పరమేశ్వరుడు ప్రధాన దైవం. ఈ ఆలయం గంగా నది ఒడ్డున ఉంది. కాశీని విశ్వనాథనగరం అని ముక్తిభూమి అని, తపస్థలి అని ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. హిందూ పురాణ గ్రంథాలలో కూడా ఈ పేర్లు ఉన్నాయి. సరళంగా చెప్పాలంటే కాశీ ఆ విశ్వేశ్వరుడి నివాస నగరం. దైవిక కాలంలో విష్ణువు కూడా కాశీలో నివసించాడని పురాణ కథనాలు ఉన్నాయి. ఈ నగరంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో విశ్వనాథ జ్యోతిర్లింగం ఒకటి. అందుకే ఈ ఆలయాన్ని కాశీ విశ్వనాథ ఆలయం అని పిలుస్తారు.
సప్తఋషి హారతి..
కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రతిరోజూ సాయంత్రం 7:00 గంటల నుండి 8:15 గంటల వరకు సప్తఋషి హారతి నిర్వహిస్తారు. అంతేకాకుండా పౌర్ణమి తేదీన సప్తఋషి హారతి ఒక గంట ముందుగా అంటే సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. సప్తఋషి హారతిలో పాల్గొనడానికి భక్తులకు సాయంత్రం 6:30 గంటల వరకు ప్రవేశం ఉంటుంది. పౌర్ణమి తేదీన సాయంత్రం 5:30 గంటలలోపు ప్రవేశించడం మంచిది.
సప్తఋషి హారతి ఎవరు చేస్తారు?
ప్రతిరోజూ సాయంత్రం 7 గంటలకు ఏడుగురు ఋషులు కాశీ విశ్వనాథ ఆలయానికి వచ్చి దేవతల దేవుడు మహాదేవు ఆరతి చేస్తారని ఒక మత విశ్వాసం ఉంది . ఈ నమ్మకం ఆధారంగా సప్తఋషి హారతిని ప్రతిరోజూ నిర్వహిస్తారు. ఈ హారతిలో ఏడు వేర్వేరు గోత్రాలకు చెందిన పండితులు కలిసి హారతిని నిర్వహిస్తారు.
*రూపశ్రీ.
