లక్ష కోట్ల అనంత పద్మనాభ స్వామి టెంపుల్

Richest Anantha Padmanabha Swamy Temple

కేరళ రాజధాని నగరం తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం, లక్ష కోట్ల విలువైన బంగారంతో దేశంలో అత్యంత ఖరీదైన ఆలయం అనిపించుకుంది.

 

తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని అపూర్వ కళాఖండాలను వెలకట్టడం సాధ్యం కాదు. అవి అమూల్యమైనవి. అదలా ఉండగా ఇక్కడి బంగారు రాశులను చూసి అటు అధికారులు, ఇటు భక్తజనానీకమూ కూడా ఆశ్చర్యపోతున్నారు.

 

అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ''A '' నుండి ''F'' వరకు ఉన్న ఆరు సెల్లార్లలో బంగారు నాణాలను, ఆభరణాలను లెక్కించగా లక్ష కోట్ల విలువైనదిగా తేలింది. అందులో 530 కిలోల బంగారు నాణాలు, అసంఖ్యాకమైన ఆభరణాలు ఉన్నాయి.18 అడుగుల బంగారు ఆభరణం ఏకంగా 35 కిలోల బరువుంది. ఇక బియ్యపు గింజల ఆకృతిలో ఉన్న గొలుసులు, విలువైన వజ్రాలు, రత్నాలతో కూడిన ఆభరణాలు అనేకం ఉన్నాయి.ఈస్ట్ ఇండియా కంపెనీ, నెపోలియన్ కాలం నాటి బంగారు నాణాలు డబ్బు రూపంలోనే గాక ప్రాచీనత పరంగానూ మహా విలువైనవి. ఆ అపురూపమైన నాణాలు, ఆభరణాల విలువ లక్ష కోట్లు. అమెరికన్ డాలర్లలో చూస్తే 22 బిలియన్ డాలర్లు.

 

తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం అతి ప్రాచీనమైంది. దీనికి వెయ్యేళ్ళ చరిత్ర ఉంది. 9వ శతాబ్దం నాటికే ఇదెంతో ప్రాచుర్యం పొందింది. ఆనాటి గ్రంధాల్లో ఈ ఆలయ ప్రస్తావన కనిపిస్తుంది. ట్రావన్కోర్ గంధపు చెక్కలు, ఏనుగు దంతాలు మొదలైన సంపదలతో మహా సుసంపన్నమైంది. నాటి స్థానిక రాజు మార్తాండ వర్మ విలువైన సంపదలు ఎన్నో స్వామివారికి సమర్పించాడు.

 

అనేక శతాబ్దాలుగా మహారాజులు సమర్పించిన బంగారు విగ్రహాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. వజ్రం, గోమేధికం, పుష్యరాగం లాంటి అమూల్య రత్నాలు పొదిగిన స్వర్ణ విగ్రహాలు, ఆ విగ్రహాలకు అలంకరించిన కిరీటాలు, హారాలు మొదలైనవి కళ్ళు జిగేల్మనిపించేలా ఉన్నాయి.

 

ఎప్పుడూ భక్తులతో కళకళలాడుతుండే తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇప్పుడు దేశం నలుమూలల నుండీ తరలివస్తోన్న భక్తులతో మరింత రద్దీగా మారింది. దేశంలోనే కాదు, ప్రపంచవాసులంతా ఈ ఖరీదైన పద్మనాభస్వామి గురించి మాట్లాడుతున్నారు.


Richest Anantha Padmanabhaswamy Temple gold, Trivandrum  Anantha Padmanabha Swamy Teple, Kerala  Anantha Padmanabha Swamy Temple, Richest God  Anantha Padmanabha Swamy, 1 lakh crore Anantha Padmanabha Swamy Temple 


More Punya Kshetralu