పంచవటి

 


నాసిక్ పట్టణంలో గోదావరి ఒడ్డున ఎన్నో ఆలయాలు కొలువుతీరి  వున్నాయి .  అందులో  పంచవటి ముఖ్యమైనది.  యాత్రికులు నాసిక్ లో  చూడదగిన  ప్రదేశాలలో ఇది కూదా ఒకటి.

 

 

స్థల పురాణం :  నాసిక్  అంటే  లక్ష్మణుడు శూర్పణక ముక్కు చెవులు  కోసిన  ప్రదేశం అని కధనం. అంతేకాదు  ఇక్కడ ఐదు పెద్ద పెద్ద మర్రి  చెట్లు  వున్నాయి. వీటినే  పంచవటి గా పిలుస్తారు.  ఆ   చెట్లకి  1,2,3,4,5 అని నంబర్లు  కూడా  వేసి  వుంచారు. ఈ  ఐదు  చెట్లకి  చుట్టూ  ఫెన్సింగ్ లాగా  కట్టారు.  ఒక పక్క కాలారం  మందిరం  వుంది. ఇది  చాలా పురాతనమైన  ఆలయం.

 

 

సీతారామలక్ష్మణులు  తండ్రి ఆజ్ఞ మేరకు  వనవాస  సమయంలో  గోదావరీ  తీరానికి  చేరుకొని  ఇక్కడ పర్ణ కుటీరం నిర్మించుకుని,   నివసించారు. వారికి అగస్త్య  మహాముని ఈ ప్రాంతాన్ని  సూచించాడని అంటారు.
సీతా గుంఫా (సీతాదేవి  గుహ)

 

 

శ్రీ రాముని జీవితంతో ముడివడ్డ సంఘటనలు  ఇక్కడే  జరిగాయంటారు. కాలారాం  మందిరానికి పక్కనే  సీతాదేవి గుహ  వుంది.  .  ఈ గుహ లోపలి వెళ్ళే దారి చాలా  చిన్నగా ఇరుకుగా  వుంటుంది. కూర్చుని వెళ్ళాల్సిందే ! లోపల సీతారాముల  విగ్రహాలు వున్నాయి. పక్కనే సీతాదేవి  పూజించిన శివుని  విగ్రహం  వుంది.  లావుగా  వున్న వాళ్ళు  లోపలి  వెళ్ళలేరు.  ఆ  విషయం  బయటే ఒక బోర్డు మీద  రాసి వుంచారు. బయటి నుంచి  చూస్తె  చాలా  సాధారణమైన  ఇల్లు లాగా వుంటుంది. లోపల  20 అడుగులు పైనే కిందికి వెళ్ళాలి
.      

 



 

ఈ గుడి ఎదుగుగానే  రావణుడు  సీతను ఎత్తుకెళ్ళిన ప్రదేశం వుంది.  మారేచుని  వధని  తెలిపే  చిత్రాలు, కూడా  కనిపిస్తాయి. 

 

 

రామకుండ్ : పంచవటి నుంచి   ముందుకెడితే  రామకుండ్ వుంది . ఇక్కడే  అతి  ప్రాచీనమైన  గోదావరి మాత ఆలయం వుంది. ఇక్కడే గోదావరి పుట్టిన  ప్రదేశం.  కుంభ మేళా కూడా ఇక్కడే  జరుగుతుంది.  మేము  వెళ్ళినపుడు రామకుండ్ లో నీళ్ళు  లేవు.  వేసవి కాలం.  గోదావరి  ప్రవహించే  స్నాన ఘట్టాలను  రామకుండ్  అనే పేరుతొ  పిలుస్తారు. శ్రీరాముడు దశరధుని  శ్రాద్ద కర్మలు  ఇక్కడే  చేశాడుట. ఇక్కడే  సీతారామ లక్ష్మణులు  స్నానం చేసేవారుట.  వీరు ముగ్గురూ  విడి విడిగా  స్నానమాచరిం చిన చోటుని  సీత rama లక్ష్మణ కుండ్  అనే పేర్లతో పిలుస్తారు. ఈ నదీ ఒడ్డునే శ్రీ గోదావరి మాత ఆలయం వుంది.ఇది చాలా ప్రాచీనమైనది. ఈ గోదావరి మాత ఆలయాన్ని  ఒక్క కుంభమేళా  జరిగే సమయంలో  మాత్రమే  తెరుస్తారుట.

 

 

కపాలేశ్వర్ మందిర్ :  రామకుండ్  ఎదురుగా  రోడ్డుకి  అవలివేపు చిన్న గుట్టపైన  కపాలేశ్వర్ ఆలయం  వుంది.  శివుడు బ్రహ్మహత్యా  పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఈ పవిత్ర గోదావరిలో  స్నానమాచరించి శ్రీ కపాలేశ్వరుడుగా లింగ రూపంలో  ఇక్కడ  కొలువు తీరాడుట.  ఇది చాలా పురాతన మైనది.  నల్ల రాతితో  కట్టబడింది.

 

ఎన్నో పవిత్ర ఆలయాలున్న  ఈ పంచవటి  నాసిక్ రోడ్  రైల్వే  స్టేషన్  నుంచి 8 కి.మి. వుంది.  కానీ  నాసిక్  పట్టణానికి  అతి  దగ్గరలోనే  వుంది. షిర్డీ, వెళ్ళే  యాత్రికులు తప్పకుండా  నాసిక్, త్రయంబకేశ్వర్ దర్శిస్తారు.

 

..mani


More Punya Kshetralu