Information about story of  pacha karpuram lord venkateswara on the Lord's chin.

 

స్వామివారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు

పెడతారు

తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలోని మూలవిరాట్టు గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు. దీనివెనుక ఉన్న వృత్తాంతం ఏమిటో మీకు తెలుసా అయితే ఈ కథనం చదవండి. స్వామి అలంకరణ కోసం పుష్పనందన వనాన్ని పెంచాలని రామానుజాచార్యుల వారు తన శిష్యుడు అనంతాళ్వార్‌ను ఆదేశించారు. ఈ పనిలో అనంతాళ్వార్ సతీమణి కూడా పాలుపంచుకుంది. గర్భవతిగా ఉన్న ఆమె.. తవ్విన మట్టిని గంపలో తీసుకెళుతూ అలసి కింద పడిపోతుంది. దీన్ని గుర్తించిన శ్రీనివాసుడు బాలుని రూపంలో ఆమెకు సాయపడతాడు. దైవకార్యంలో ఇతరులెవరూ జోక్యం చేసుకోకూడదంటూ ఆ బాలుడిని అనంతాళ్వార్ కొడతాడు. గడ్డంపై దెబ్బ తగలడంతో బాలుడు అదృశ్యమై పోతాడు. తర్వాత అనంతాళ్వార్ ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటాడు. గడ్డంపై నుంచి రక్తం కారడం చూసిన అనంతాళ్వార్ ఆ బాలుడు శ్రీహరేనని గ్రహించి రక్తం కారకుండా పచ్చకర్పూరం పెడతాడు. అందుకే నేటికీ మూలవిరాట్ గడ్డం కింద పచ్చకర్పూరం పెడుతున్నారు.


More Venkateswara Swamy