తిల చతుర్థిరోజు నువ్వులు ఎందుకు తినాలి

 

 

మాఘమాసం లో వచ్చే ముఖ్యమైన  రోజులలో తిల చతుర్థి కి ఒక ప్రత్యేక  స్థానం ఉంది. తిలలు అంటే నువ్వులు కదా.ఈ రోజు నువ్వులతో చేసిన పదార్థాలు తినాలని చెపుతోంది మాఘపురాణం. నువ్వులు అనగానే మనకి వంటల్లో వాడే పదార్థాలతో పాటు, పర్వదినాల్లో వదిలే పితృ తర్పణాలు కూడా గుర్తొస్తాయి. ఈ తిల చతుర్థి రోజు నువ్వులతో చేసిన వంటకాలు తినటమే కాదు,నువ్వుల ఉండలు చేసి పంచుతారు,నువ్వులని బ్రాహ్మలకు దానమిస్తారు.మాఘమాసం మొదలయ్యకా వచ్చే ఈ తిథినాడు నువ్వులు తినటం వెనక ఒక శాస్త్రీయ రహస్యం కూడా దాగి ఉంది. చలికాలం వెళ్లి ఎండాకాలం వచ్చే ఇలాంటి సమయంలో వచ్చే ఎండలకి ఆరోగ్యంలో మార్పులు చోటుచేసుకుంటాయి. సూర్య కిరణాలు  చర్మంపై పడి  చర్మ కణాలు ప్రమాదాలకి గురవుతాయి, నువ్వులను తినటం వలన చర్మ కణాలకు కలిగే సమస్యలను తగ్గిస్తుంది. U.V కిరణలకు బహిర్గతమైనపుడు చర్మ కణాలకు కలిగే మరకలను, మచ్చలను నువ్వులలో ఉండే మూలకాలు శక్తి వంతంగా తగ్గిస్తాయి.

నువ్వులతో ఉపయోగాలు:

 

 

ఎముకల బలహీనతతో బాధ పడే  వారు చెంచాడు నువ్వుల్ని నానబెట్టి ఉదయాన్నే పాలలో కలిపి సేవిస్తే ఈ రుగ్మతల నుంచి బయట పడవచ్చు. పిల్లలకిగానీ, పెద్దవారికి గానీ, రక్త హీనత తగ్గి రక్తం బాగా వృద్ధిచెందాలంటే, టీస్పూన్‌ నువ్వులు నానబెట్టి నిత్యం మూడునెలలపాటు తీసుకుంటే రక్తం వృద్ధిచెందడమే కాకుండా ఉదర సంబంధవ్యాధుల్ని నిర్మూలిస్తుంది.నువ్వుల నూనెలో క్యాల్షియం అధికంగా ఉండటంవల్ల  కీళ్ళ ను కాపాడుతుంది. కొబ్బరినూనె లేదా మస్టర్డ్ వంటి ఇతర నూనెలతో పోల్చినప్పుడు , నువ్వులు నూనె చాలా తేలికగా జీర్ణం అవుతుంది. ఈ నూనె మీ పెద్దప్రేగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అంతేకాదు నువ్వుల నూనెలో ఉన్న మెగ్నీషియం ఆస్తమా, లో బ్లడ్  ప్రెషర్ వంటి వాటిని తగ్గిస్తుంది.మధుమేహగ్రస్తుల్లో హైబ్లడ్ ప్రెజర్ ఉన్నప్పుడు నువ్వుల నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.  నువ్వులు దంత క్షయాన్ని పోగొడుతుంది. దంత సమస్యలు, చిగుళ్ళ సమస్యలను, చిగుళ్ళ నుండి రక్తం కారటాన్ని తగ్గిస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షణ్ తొలగించి, పళ్ళకు బలాన్ని చేకూర్చుతుంది . నువ్వుల నూనెతో ఆయిల్ పుల్లింగ్ కూడా చెయ్యొచ్చు.

ఇన్ని గుణాలు ఉన్నాయి కాబట్టె  తిల చతుర్థి అని నువ్వులకి కూడా ఒక ప్రత్యేక రోజుని కేటాయించారు మన పెద్దవాళ్ళు .

 

...కళ్యాణి
 


More Enduku-Emiti