రోజూ జుట్టు విషయంలో చేసే ఈ పని రాహువు గ్రహ ఆగ్రహానికి కారణం అవుతుందట!

నవగ్రహాలలో రాహువు గ్రహం కూడా ఒకటి. రాహువు గ్రహాన్ని ఛాయా గ్రహం అని కూడా అంటారు.  గ్రహాలు బలంగా అనుకూలంగా ఉంటేనే జీవితం బాగుంటుందని జ్యోతిష్య శాస్ర్తం చెబుతుంది.  అదే గ్రహాలు బలహీనంగా ఉన్నా, గ్రహాలు చాలా ప్రభావంగా ఉన్నా.. దాని ఫలితాలు జీవితంలో చాలా నష్టాలు చేకూరుస్తాయి.   నవగ్రాహాలలో ఒకటైన రాహు గ్రహానికి కోపం తెప్పించే రోజువారీ అలవాటు ఒకటి ఉంది.  ఈ అలవాటు చాలా సాధారణం అనిపిస్తుంది. కానీ అది రాహువుకు చాలా కోపం తెప్పిస్తుందట. దీని వల్ల జీవితంలో సమస్యలు కూడా పెరుగుతాయట.  అదేంటో  తెలుసుకుంటే..

జుట్టు అలవాట్లు..

జుట్టుకు సంబంధించిన ఒక  అలవాటు రాహువుకు చాలా కోపం తెప్పిస్తుందట. జాతకంలో  రాహువు ఇప్పటికే బలహీనంగా ఉన్నప్పుడు.. జుట్టులోకి వెళ్లు జొప్పించి జుట్టును  ఎప్పుడూ నిమురుకుంటూ ఉండటం,  పదే పదే జుట్టును సవరించుకోవడం వంటివి రాహువుకు అస్సలు గిట్టవట. ఇలా జుట్టులో వేళ్లు పెట్టుకోవడం,  జుట్టును పదే పదే సవరించుకోవడం రాహువుకు కోపం తెప్పిస్తుందట. దీని వల్ల చాలా సమస్యలు ఏర్పడతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

రాహువు ప్రభావాలు..

జాతకంలో రాహువు గ్రహం బలహీనంగా  ఉన్నప్పుడు మనిషిలో కొన్ని అలవాట్లు, ప్రవర్తనలు కనిపిస్తాయి.

అతి ఆలోచనలు..

ఏదైనా విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటారు.  కానీ దాని గురించి ఎలాంటి చర్య తీసుకోవడం లేదా పరిష్కారం చూసుకోవడం చేయరు.  దీని వల్ల ఒత్తిడి ఎక్కువై గందరగోళంలోకి జారిపోతారు.

వింత కలలు..

రాత్రి సమయంలో సరిగా నిద్రపట్టకపోవడం, భయపెట్టే లేదా గందరగోళం పెంచే కలలు రావడం, పీడకలలు పదే పదే రావడం.. రాత్రి అంతా బాగా నిద్రపోయినా కూడా ఉదయం లేవగానే ఇంకా శరీరం అలసటగా ఉన్నట్టు అనిపించడం వంటివి జరుగుతూ ఉంటాయి.

పనులు పూర్తీకాకపోవడం..

రాహువు బలహీనంగా ఉన్నా లేదా అశుభ స్థానంలో ఉన్నా చేపట్టిన పనులు పూర్తీ కావట.  పనులలో ఆటంకాలు లేదా వాయిదా పడటం వంటివి జరుగుతూనే ఉంటుంది. పనులు పూర్తీ చేయడం చాలా కష్టంగా లేదా అసలు పనులు చేయకుండా మధ్యలో ఆగిపోవడం వంటివి జరుగుతాయి.

అశాంతి..

నేటికాలంలో చాలామంది మనఃశాంతి దొరకక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతా బాగున్నా కూడా కొందరు అశాంతి ఫీలవుతూ ఉంటారు. ఎలాంటి కారణం ఉండదు,   అసలు స్పష్టత ఉండదు.. ఏం చేయాలో అర్థం కాదు.. కానీ మనసంతా అశాంతితో ఉంటుంది. ఇది రాహువు బలహీనంగా, అశుభ స్థితిలో ఉండటం వల్ల జరుగుతుంది.

పోలిక..

సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలను ఇతరులతో పోలుస్తూ ఉంటారు. కానీ వ్యక్తి తనను తాను ఇతరులతో పోల్చుకోవడం చేస్తుంటే వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. జీవితంలో ఎదుగుదల, ఏదైనా పని చేయాలంటే దానికి తగ్గ దైర్యం, ఆత్మవిశ్వాసం ఉండవు.  

పరధ్యానం..

రాహువు బలహీనంగా ఉన్నా, అశుభ స్థితిలో ఉన్నా.. వారి పైన రాహువు ప్రభావం ఉంటుంది.  ఏ పని మీద ఆసక్తి ఉండదు,  ఎప్పుడూ పరధ్యానంగా ఉంటారు, ఏదైనా పని మొదలు పెట్టడానికి అన్నీ అనుకూలంగా ఉంటాయి. కానీ మొదలుపెట్టలేరు. మనసు ఇతర విషయాల పైకి మళ్లుతుంది. ఇవన్నీ రాహువు ప్రభావాలే.  ఇలాంటి వ్యక్తులు జుట్టుతో ఆడుకోవడం, పదే పదే చేతి వేళ్లను జుట్టులో జొప్పించడం వంటివి చేయకూడదు.

                                               *రూపశ్రీ. 


More Enduku-Emiti