గ్రహాల్లో లోహ గుణాలు
(Planets and Five Metals)
దేవుడిపై ధ్యాస కుదిరి, ధ్యానం చేసుకోడానికి విగ్రహం ప్రతిష్టించుకుంటాం. .png)
వినాయకుడు, మహాశివుడు తదితర దేవతా విగ్రహాలను, నవగ్రహాలను బంగారం, వెండి, ఇత్తడి, రాగి, కంచు, చెక్క, శిలలతో రూపొందిస్తారు. లోహాల మిశ్రమంతో కూడా విగ్రహాలను తయారుచేస్తారు. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, కంచు - ఈ అయిదు లోహాలనూ కలిపి చేసిన విగ్రహాన్ని పంచలోహ విగ్రహం అంటారు.
బంగారం ఖరీదైంది కనుక ఎక్కువమంది బంగారు విగ్రహాల జోలికి వెళ్లరు. కొద్దిమంది చేయించుకున్నప్పటికీ, చాలా చిన్న విగ్రహాలను చేయించుకుంటారు. కొందరు వెండి విగ్రహాలను కొనుక్కుని పూజిస్తారు. అలాగే పంచ లోహ విగ్రహాలను ఆరాధించేవారు ఎందరో ఉన్నారు. పంచ లోహాల్లో ఎంతో మహిమ ఉంటుంది. ఔషధ గుణాలు ఉన్నాయి. దేవాలయాల్లో శిలా విగ్రహాలు, వెండి,కంచు విగ్రహాలు అధికంగా ఉంటాయి. కొన్ని లోహ విగ్రహాలకు బంగారు పైపూత వేస్తారు.
మనం ఆరాధించే దేవతా, నవగ్రహాల విగ్రహాల సంగతి అలా ఉంటే, నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికీ ఒక్కో లోహపు గుణం ఉంది. అదేంటో తెలుసుకుందాం.
కుజ గ్రహానికి బంగారంలో ఉండే సుగుణాలు ఉన్నాయి.
గురు గ్రహానికి వెండిలో ఉండే లక్షణాలు ఉన్నాయి.
రవి గ్రహానికి రాగి లోహంలో ఉండే గుణాలున్నాయి.
బుధ గ్రహానికి ఇత్తడి లోహ లక్షణాలు ఉన్నాయి.
శని గ్రహానికి ఇనుములో ఉండే గుణాలు ఉన్నాయి.
ఆయా గ్రహ దోషాలు ఉన్నవారు ఆర్ధిక ఇబ్బందులు, ఇతర సమస్యల బారిన పడటమే కాకుండా అనేక అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉంది. ఉదాహరణకు -
శని దోషం ఉన్నవారికి రక్తం తగ్గి నీరసపడతారు. నరాల బలహీనట, ఎముకల జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
కుజ దోషం ఉన్నవారికి ఆకలి తగ్గుతుంది. బుద్ధి మాంద్యం ఏర్పడుతుంది. పైత్యం, కళ్ళ జబ్బులు లాంటి అనేక అనారోగ్యాలు కలుగుతాయి.
రవి దోషం ఉన్నవారికి శారీరక బలహీనతలు ఏర్పడతాయి. గుండె జబ్బులు వస్తాయి.
Navagrahs, Kuja Graha, Budha Graha, Shani Graha, Planets and Five Metals



