నవ నారసింహక్షేత్రం

 

Information on sri Ahobila nava narasimha kshetram nava narasimha temple in ahobila in india

 

ఆంధ్ర దేశం లోని అత్యంత ప్రాచీనమైన నారసింహ క్షేత్రాల్లో మిక్కిలి  ప్రాచుర్యాన్ని పొందిన నవ నారసింహ క్షేత్రం అహోబిలం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి 25 కి.మీ ల దూరంలోను, నంద్యాల నుండి  65 కి.మీ, దూరంలోను నల్లమల అడవుల్లో ప్ర కృతి రామణీయకత మధ్య వెలసిన నరసింహుని దివ్య ధామమిది.

 

Information on sri Ahobila nava narasimha kshetram nava narasimha temple in ahobila in india

 

 

ఎగువ అహోబిల రాజ గోపురం
స్థలపురాణం : ఇందుగల డందు లేడని సందేహము వలదని,  హితవు పలికి – చక్రి సర్వోప గతుండని  ప్రకటించిన  ప్రహ్లాదుని  విశ్వాసాన్ని నిజం చేసి, ఆస్తికత్వాన్ని సజీవంగా  ఉంచడానకి,   స్ధంభం నుండి ఆవిర్భవించి హిరణ్య కశిపుని మట్టుపెట్టిన ఉగ్ర  నరసింహుడు కొలువు దీరిన ప్రదేశమిది.    ఇచ్చట హిరణ్యకశిపుని  గోళ్ల తోచీల్చి  సంహరించిన సమయం లో స్వామిని దర్శించిన ఇంద్రాది దేవతలు ----
                 "అహోవీర్య అహోశౌర్య అహోబహుపరాక్రమః !
                  నారసింహ పరః దైవం ఆహోబిలః ఆహోబిలః !!"

 అని కీర్తించారట. అప్పటి నుంచి ఈ  క్షేత్రం” అహోబలం “అని పిలువబడుతోందని స్ధల పురాణం.  ఎగువ అహోబిలం లోని గుహ లో స్వయం భువు గా వెలసిన    ఉగ్ర నర సింహు ని ఆరాధించి సాక్షాత్కరింపజేసుకొని దివ్యాను భూతికి లో నైన గరుడుడు  స్వామి కొలువు తీరిన గుహను చూసి అహో! బిలం ,  అన్నాడట. ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రాన్ని అహోబిలమని పిలుస్తున్నారని ఒక ఐతిహ్యం.   హిరణ్య కశిపుని సంహరించిన అనంతరం  ఇంకా చల్లారని ప్రతాపం తో  నరసింహుడు అరణ్యం లో  గర్జిస్తూ, క్ష్వేళిస్తూ,పలు ప్రదేశాల్లో   సంచరించాడని, అలా సంచరిస్తున్నప్పుడు ఆయన లో విరిసిన వివిధ భావాలకు రూపాలే నవ నారసింహ రూపాలని  భావించబడుతోంది.

 

Information on sri Ahobila nava narasimha kshetram nava narasimha temple in ahobila in india

 

 

ఎగువ అహోబిలం స్వామి వారి కళ్యణ మండపం
వీర రసావతారరూపుడైన తన నాధుని శాంతింప జేయడానికి శ్రీ మహాలక్ష్మి చెంచు లక్ష్మి గా అవతరించి స్వామిని ప్రసన్నుని చేసుకోవడానికి చాల శ్రమించ వలసి వచ్చింది. ఆ సమయం లో ఆ చెంచెతకు స్వామి నవరూపాల్లో దర్శనమిచ్చి, అలరించారని, ఆరూపాలే నవ నారసింహులు గా వెలసి స్వామి ఇప్పుడు  భక్తులను అను గ్రహిస్తున్నాడని భక్తులు సంతోష పారవశ్యం తో చెంచులక్ష్మీ నరసింహుల కథలను చెప్పు కుంటుంటారు.  జానపద గీతాలు పాడుకుంటుంటారు. ఇచ్చటి గిరిజనులు  చెంచెతను మహాలక్ష్మి గా పూజిస్తూ, లక్ష్మీనరసింహ కళ్యాణాన్ని చాల గొప్పగా జరిపిస్తారు.

 

 

Information on sri Ahobila nava narasimha kshetram nava narasimha temple in ahobila in india

 

రాజగోపుర దృశ్యం
నరసింహుడు హిరణ్యకశిపుని సంహరణానంతరం  అరణ్యం లో సంచరిస్తూ భక్తులను అనుగ్రహించడానకే స్వామి నవరూపాల్లో  దర్శనమిచ్చాడు. మరొక కథ ను అనుసరించి గరుత్మంతుడు విష్ణువు ను  నరసింహ రూపుని గా    దర్శన మీయ వేడుకున్నాడు.  ఆనాడు  గరుడునికి స్వామి  సాక్షాత్కరించిన తొమ్మిది రూపాలే నవ నారసింహ రూపాలు. అందుకే ఈ పర్వతాన్ని గరుడాద్రి అని,గరుడాచలం అని, గరుడశైలం అని కూడ పిలుస్తారట.
          "జ్వాలాహోబిల మాలోల క్రోండ గరంజ్ భార్గవ !
           యోగానంద చత్రవట పావన నవమూర్తయః !!''

జ్వాల, అహోబిల,మాలోల, క్రోడ,కరంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన   నార సింహ  అను  తొమ్మిది రూపాలు గా స్వామి అహోబిలం మీద  కొలువు తీరి ఉన్నాడు. ఎగువ అహోబిలం లో ఉగ్రనరసింహుడు కొలువు తీరగా. దిగువ అహోబిలం లో  లక్ష్మీనరసింహుడు శాంత మూర్తి యై  భక్తులను అనుగ్రహిస్తున్నారు. చుట్టూ 5 కి.మీ పరిధి లో మిగిలిన ఆలయాలను కూడ మనం దర్శించవచ్చు. నవరూపులుగా వెలసిన ఈ దివ్య మూర్తులను దర్శించడం  వలన వాని  ఫలితాలు కూడ  వేరు వేరు గా ఉంటాయని స్థలపురాణం చెపుతోంది.  అంటే భక్తులు ఏ ఫలితాన్నికోరుకుంటున్నారో   ఆ స్వామి రూపాన్ని ప్రత్యేకంగా ఆరాథించుకొని, సఫలీకృత మనోరధులు కావచ్చు నన్నమాట. ఇది నారసింహ తత్త్వము. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని గురించి కూర్మ పురాణం, పద్మపురాణం, విష్ణుపురాణా లలో ఫ్రస్తావించబడింది. హిరణ్యకశిపుని వృత్తాంతం బ్రహ్మండ పురాణం లో కన్పిస్తుంది.
ఆలయప్రత్యేకత : 
శ్రీ భార్గవ  నరసింహ స్వామి : దిగువ  అహోబిలానికి  2.5 కి మీ దూరం లో కొండపై ఈ స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడే” అక్షయ తీర్థం” ఉంది. ఈ అక్షయ తీర్థంలో స్నానం చేస్తే అనంత సంపదలు ప్రాప్తిస్తాయని ఛెప్పబడుతోంది. పరశు రాముడు ఈ ప్రదేశం లోనే తపస్సు చేశాడు. అందువలన ఈ అక్షయ తీర్థాన్నే''భార్గవ తీర్థమని” కూడ పిలుస్తారు.
శ్రీ యోగానంద నరసింహ స్వామి :  వీరు దిగువ అహోబిలానికి  తూర్పు దక్షిణం గా 2 కి.మీ దూరం లో వేంచేసియున్నారు.  స్వామి  ప్రహ్లాదునకు ఇక్కడ ఎన్నోయోగ శాస్త్ర మెళకువ లను  నేర్పారని. అందువలన స్వామి కి ఆపేరు వచ్చిందని చెపుతారు. ఈ ప్రదేశం తపస్సునకు అత్యంత అనువైన ప్రదేశంగా పేరెన్నికగన్నది. కష్టాల్లో ఉన్న భక్తులు ఈ స్వామి ని సేవిస్తే   స్వామి కష్టాలను కడతేర్చి, సౌ భాగ్యాన్ని కల్గిస్తాడని ప్రహ్లాదుడు చెప్పాడు.
శ్రీ  ఛత్రవట నరసింహస్వామి :  ఈ స్వామి దిగువ అహోబిలానికి 3కి.మీ దూరం లో  వట వృక్షచ్ఛాయ లో కొలువుతీరి ఉంటాడు. ఈ స్వామిని సేవిస్తే కేతుగ్రహ బాధలు నశిస్తా యని చెపుతారు. లలితకళలను  అభ్యసించేవారు ఈ  స్వామిని సేవిస్తే సత్ఫలితాలను పొంద  గలుగుతారు .

 

Information on sri Ahobila nava narasimha kshetram nava narasimha temple in ahobila in india

 

శ్రీ  అహోబిల నరసింహస్వామి : నవ నరసింహులలో ఈయన ప్రధాన దైవం. ఈయననే ఉగ్ర నరసింహమని కూడ పిలుస్తారు. ఎగువ అహోబిలం లో చెంచులక్ష్మీ సమేతుడై ఈ స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. శతృభయాలు. గ్రహపీడలు  మతిమాంద్యాలు, ఈ స్వామిని  సేవించడం వలన పటాపంచలౌతాయి.
శ్రీ వరాహ నరసింహస్వామి: ఎగువ అహోబిలానికి 1 కి .మీ పైన లక్ష్మీ దేవి తో కొలువు తీరి ఉన్నాడు. ఈ స్వామిని సేవిస్తే ఆటంకాలు తొలగి,కార్య సాఫల్యత కల్గుతుంది. ఈయన నే  క్రోడ నరసింహ స్వామి  అని కూడ పిలుస్తారు.
శ్రీ మాలోల నరసింహస్వామి : ఈస్వామి ఎగువ అహోబిలానికి 2.కి మీ ఎగువున ఉన్నాడు.ఈఆలయం ఉన్న ప్రాంతాన్ని లక్ష్మీపర్వతం గా పిలుస్తారు. మా- అనగా లక్ష్మి  మా –లోలుడు అనగా లక్ష్మీప్రియుడు అని అర్థము .ఆయనే లక్ష్మీ సమేత నరసింహుడు. ఈయనను సేవిస్తే ఇహ,పరలోకాలలో సైతం బ్రహ్మానందం లభిస్తుంది.

 

Information on sri Ahobila nava narasimha kshetram nava narasimha temple in ahobila in india

 

శ్రీ జ్వాలా నరసింహస్వామి: ఈ స్వామి  ఎగువ అహోబిలానికి 4 కి.మీ దూరం లో దర్శన మిస్తాడు. ఈ పర్వతాన్ని “ అచలాచయ మేరు” అని కూడ పిలుస్తారు. హిరణ్యకశిపుని తనవాడియైన గోళ్ల తో చీల్చి, చెండాడిన  నరసింహస్వామి ఇక్కడ   కన్పిస్తాడు. ఈస్వామిని సేవిస్తే సకల ప్రయత్నాలు సఫలమౌతాయి. పెళ్లిళ్లు కుదురు తాయి. కార్తీకమాసం లో నేతి దీపాన్ని స్వామి సన్నిథి లో వెలిగించి, ఆరాథిస్తే, సమస్త పాపాలు తొలగి, కీర్తిప్రతిష్టలు లబిస్తాయి. మిగిలిన ఎనిమిది ఆలయాల కన్నా ఈ ఆలయాన్ని చేరు కోవడమే మిక్కిలి శ్రమ తో కూడిన పని. ఇక్కడ “రక్తకుండం “అనే అరుణ వర్ణ పుష్కరిణి ఉంది. ఇందులో నీరు ఎల్లప్పుడూ ఎఱ్ఱగానే ఉంటాయి. కారణం నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత  రక్తసిక్తమైన తన  చేతులను ఈ పుష్కరిణిలోనే కడుక్కున్నాడట. అందువల్ల ఆ నీరు ఎఱ్ఱగా ఉండిపోయింది.

 

 

Information on sri Ahobila nava narasimha kshetram nava narasimha temple in ahobila in india

 

శ్రీ పావన నరసింహస్వామి: ఎగువ అహోబిలానికి 6 కి. దూరం లో పావన నదీతీరాన ఈ స్వామి కొలువు తీరి  ఉన్నాడు.  నవ ఆల యాల్లో   ఈ ప్రదేశం అత్యంత ప్రశాంతమైంది. అందుకే ఈ ప్రదేశాన్ని క్షేత్రరత్నమని పిలుస్తారు. ఈయన కే పాములేటి నరసింహస్వామి అని కూడ పేరు. ఈయనను సేవిస్తే ఈ జన్మలోను, పూర్వజన్మల్లోను తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ  తొలగి పోతాయని చెపుతారు. ఈస్వామి భక్తులు ఇచ్చిన నివేదనను ఖచ్చితంగా సగం స్వీకరించి   మిగతా సగం  ప్రసాదంగా ఇచ్చివేస్తాడని ప్రతీతి.

 

Information on sri Ahobila nava narasimha kshetram nava narasimha temple in ahobila in india

 

 

శ్రీ  కరంజ నరసింహస్వామి : ఎగువ అహోబిలానికి 1 కి మీ దూరం లో ఈస్వామి కొలువై ఉన్నాడు. కరంజ వృక్షం క్రింద కొలువు తీరిన స్వామి కాబట్టి ఈయన కరంజ నరసింహస్వామి అయ్యారు. ఈ స్వామిని మనసా వాచా కర్మణా త్రికరణ శుధ్ధి గా సేవిస్తే జీవితం లో అభివృధ్ధి ని  సాధిస్తారని, కోరిన కోరికలన్నీ తీరుతాయని  చెపుతారు

 

Information on sri Ahobila nava narasimha kshetram nava narasimha temple in ahobila in india

 


శ్రీ లక్ష్మీ నరసింహస్వామి: ఈ తొమ్మిది రూపాలు కాక దిగువ అహోబిలం లో ప్రహ్లాదవరదుడైన లక్ష్మీనరసింహుడు శాంతరూపుడై, భక్తులను రక్షిస్తున్నాడు . ఇది మూడు ప్రాకారాలు కలిగిన దివ్యాలయము. శ్రీరాజ్యలక్ష్మీ దేవి, శ్రీఆండాళ్. ఆళ్వారుల సన్నిథి  కూడ ఉపాలయాలు గా మనకు దర్శనమిస్తాయి. నవ గ్రహాలకు ఈ నవ నారసింహ రూపాలకు  గల సంబంధాన్ని కూడ భక్తులు  విశ్లేషించుకుంటున్నారు.
చారిత్రకప్రాధాన్యం : దిగువ అహోబిలం లోని శ్రీ లక్ష్మీనృసింహ ఆలయ మంతా విజయనగర శిల్ప సంప్రదాయం తో అలరారుతుంటుంది.  ముఖ మండపం , రంగ మండపాలు చిత్ర విచిత్ర శిల్పాకృతులతో  నయన మనోహరంగా కన్పిస్తాయి. ఎక్కువ  స్థంభాలమీద చెంచులక్ష్మీ నరసింహుల  విలాసాలు మనకు కన్పిస్తాయి. పట్టాభి రాముడు, దశావతారాలు ,వివిథ దేవతాకృతులు,  నర్తకీమణుల నాట్యభంగిమలు ఆలయమండప స్థంభాలపై కొలువుతీరి  కనువిందు చేస్తాయి.

 

Information on sri Ahobila nava narasimha kshetram nava narasimha temple in ahobila in india

 


ఈ శిల్పాకృతు లను చూస్తుంటే అహోబలం ! అహోబిలం!! అనడమేకాదు అహోశిల్పం !!! అనాలనిపిస్తుంది.  ఆలయానికి బైట  కూడ చాలా మండపాలు మనకు కన్పిస్తాయి.  ప్రథాన ఆలయానికి వెలుపల విజయనగర చక్రవర్తి   శ్రీకృష్ణదేవరాయలు  దిగ్విజయ యాత్రా చిహ్నం గా వేయించిన జయస్థంభాన్ని మనం గర్వం గా దర్శించవచ్చు . కాకతి శ్రీ ప్రతాపరుద్ర   చక్రవర్తి  దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు నిధులిచ్చినట్లు, మాలోల నరసింహు నకు బంగారు ఉత్సవిగ్రహాన్ని బహూకరించినట్లు చెప్పబడుతోంది.  కాలజ్ఞానవేత్త శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు ఈ ఆలయం లో కూడ కూర్చొని కాలజ్ఞానం వ్రాసినట్లు చెపుతారు. సంకీర్తనాచార్య శ్రీ అన్నమయ్య స్వామి సన్నిధి లో  ఎన్నో కీర్తనలను ఆలాపించి, స్వామికి సమర్పించాడు.

 

Information on sri Ahobila nava narasimha kshetram nava narasimha temple in ahobila in india

 


తిరుమల శ్రీ శ్రీనివాసుడు పద్మావతీ దేవి తో తన కళ్యాణానికి ముందు  లక్ష్మీనరసింహుని ఆశీస్సుల కోసం  అహోబిలం వచ్చినట్లు ఒక ఐతిహ్యం. ఎగువ అహోబిలం లో స్వామి ఉగ్రరూపుడై ఉండటం తో దిగువ అహోబిలం లో ప్రహ్లాద వరదుడైన లక్ష్మీనరసింహుని శాంతమూర్తి గా ఆయనే ప్రతిష్టించినట్లు  చెపుతారు. దీనికి సాక్ష్యంగా ప్రధాన ఆలయానికి దక్షిణం గా శ్రీ వేంకటేశ్వరాలయం మనకు దర్శనమిస్తుంది.

 

Information on sri Ahobila nava narasimha kshetram nava narasimha temple in ahobila in india

 


ఉగ్ర స్థంభం  : ఎగువ అహోబిలానికి ఎగువన 8.కిమీ దూరం లో ఈ ఉగ్రస్థంభం ఉంది. దీనినుండే నృసింహ ఆవిర్భావం జరిగి హిరణ్యకశిపుని సంహరించాడని చెపుతారు. దీనిదర్శనం ,స్పర్శనం సర్వపాపహరమని భక్తుల నమ్మకం. ఈ  ఉగ్రస్థంభమే ప్రజల వాడుక లో కెక్కి ఉక్కు స్థంభమై పోయింది. స్థంభోద్భవ నారసింహుని భక్తులు దీనిలో దర్శిస్తారు. 
         "ఉగ్ర వీరః మహావిష్ణు జ్వాలంతం సర్వతోముఖః !
           నృసింహః భీషణఃభద్రంమృత్యుమృత్యః నమామ్యహః !!"

అని ఉగ్రనరసింహునికి చేతులెత్తి జోతలు సమర్పిస్తారు

 

Information on sri Ahobila nava narasimha kshetram nava narasimha temple in ahobila in india

 


ప్రహ్లాదమెట్టు: ఎగువ అహోబిలానికి ,ఉగ్రస్థంభానికి  మధ్య లోని  ఒక గుహ లో ప్రహ్లాదుని రూపం  దర్శన మిస్తుంది.   ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక అని భక్తగ్రణ్యుడుగా కొని యాడబడు తున్న ప్రహ్లాదుని సేవించడం సకల కల్మష హరం గా భక్తులు భావిస్తారు.

 

Information on sri Ahobila nava narasimha kshetram nava narasimha temple in ahobila in india

 


అహోబిలమఠం: ఆథ్యాత్మిక వికాసం కోసం ,వైష్ణవ సంప్రదాయ పరిరక్షణ కోసం, ప్రాచీన మంత్రశాస్త్ర  సముద్ధరణ కోసం ఇచ్చట శ్రీ వైష్ణవ సంప్రదాయజ్ఞులచే ఒకమఠం స్థాపించ బడింది. ఈ మఠాథిపతుల్ని జియ్యరులంటారు. ఈ మఠం చాల పురాతనమైంది. క్రీ.శ 1319 లో కేశవాచార్యులకు ఒక కుమారుడు జన్మించాడు.అతనే శ్రీనివాసాచార్యులు. ఇతను  ప్రహ్లాదునివలెనే, పసితనము నుండి శ్రీహరి ధ్యానమే చేస్తుండేవాడు. ఈయన పుట్టిన ఊరు తిరునారాయణ పురం. ఈ బాలుని భక్తికి ముగ్ధుడైన స్వామి అతనికి ప్రత్యక్షమై, అహోబిలానికి రమ్మని ఆదేశించాడు.అహోబిలం చేరిన ఆ బాలుని భక్తి ప్రపత్తులను ,దీక్షా దక్షతను చూసి సంతోషించిన ఆనాటి అధికారి ముకుందరాయలు  ఆ బాలుని శిష్యుని గా స్వీకరించాడు.

 

Information on sri Ahobila nava narasimha kshetram nava narasimha temple in ahobila in india

 


ఈ బాలుని కి సాక్షాత్తు స్వామియే యోగిరూపం లో వచ్చి,అష్టాక్షరీ మంత్రాన్ని బోధించారు. శిష్యుని గా స్వీకరించారు. ఆనాటి నుండి జియ్యరులు  శఠగోపయతి గా ప్రసిద్ధులయ్యారు. వీరి ఆధ్వర్యం లో వివిధ సేవా,అభివృద్ధి మత ప్రచార ,సంరక్షణ  కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రపంచ వ్వాప్తం గా  ఈ మఠానికి పేరు ప్రఖ్యాతులున్నాయి.

 

Information on sri Ahobila nava narasimha kshetram nava narasimha temple in ahobila in india

 


ప్రత్యేక ఉత్సవాలు: ప్రతిసంవత్సరం ఫాల్గుమ మాసం లో బ్రహ్మోత్సవాలు, ప్రతినెల స్వాతి నక్షత్ర పర్వదినాన 108 కలశాల తో తిరుమంజన సేవ,గ్రామోత్సవం జరుగుతాయి. ఈ రోజుల్లో వేలాది మంది భక్తులు ఈ వేడుకలకు హాజరై, స్వామిని సేవించుకుంటారు. నృసింహ జయంతి ఇచ్చట జరుగు గొప్పఉత్సవం గా పేర్కోనవచ్చు.
ఇచ్చటి గిరిజనులు ఛెంచులక్ష్మిని తమ ఆడపడుచు గా భావించి చెంచులక్ష్మీ నరసింహుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో  వారి సంప్రదాయాలే కొనసాగటం చూడముచ్చట గా ఉంటుంది.


More Punya Kshetralu