పాతాళేశ్వర్ మహాదేవ్ శివాలయం
హిమాచల్ ప్రదేశలోని సిర్ మౌర్ జిల్లా,పత్ లియో గ్రామంలో వున్న పాతాళేశ్వరస్వామి వారి ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది.ఈ ఆలయంలో వున్న శివలింగం కనీసం పన్నెండు అడుగుల పొడవని చెప్తారు. ఇది భూతలం పైన అయిదు అడుగులుండగా , మిగిలింది భూస్థాపితమైంది . భూమి కోత ఏర్పడగా, అందులో నుండి ఈ లింగం స్వాభావికంగా వెలసిందట. ఇక్కడ స్వామిని భక్తులు పాతాళేశ్వరడని పిలుస్తారు. ఈ ఆలయంలోని శివలింగం దట్టమైన అడవుల మద్య వెలసింది . పంచపాండవులు తమ ఆజ్ఞాతవాస కాలంలో తపస్సు చేసుకుంటూ, అడవుల్లో సంచరిస్తూ ఈ శివలింగానికి పూజలు చేసినట్లు ఐతిహ్యం. ఇక్కడ స్వామివారికి దీపం వెలిగించడం, కొబ్బరికాయ సమర్పిచడానికి బదులు కేవలం ఆయా కాలల్లో లభించే జొన్నలు,బెల్లం ,గోధుమలు నివేదించి , స్వామి వారికి వీటితో అభిషేకం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.