దైవానికి నమస్కరించే పద్ధతి ఎలా ఉండాలి ?

 

 

What is the correct method of doing Namaskar to hindu Gods?

 

 

దేవుడి విగ్రహానికి కుడివైపున పూజారి ఉంది పూజాలు నిర్వహిస్తూ ఉంటాడు. ప్రదక్షిణ విధానంగా దేవుని పూజా ద్రవ్యాలు సమర్పిస్తూ హారతి పడతాడు. ఈ కార్యక్రమం పూజారి దేవునికి కుడివైపున ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఈ స్థితిలో భక్తులు దేవుడికి ఎదుట ఎడమ ప్రక్కన ఉండాలి అలా ఉన్నప్పుడు దైవమూ, అర్చనా కార్యక్రమాలు స్పష్టంగా కనబడతాయి. అర్చన సందర్భంలో భక్తులు అధికంగా ఉంటే ఈ పద్ధతి కుదరదు. దైవానికి కుడి, ఎడమ ప్రక్కల భక్తులు చేరిపోవలసి వస్తుంది. దానిని దోషంగా పరిగణించకూడదు. అవసరసమయంలో అనుకూలతను అనుసరించుమని చెప్పారు పెద్దలు.

 

 

What is the correct method of doing Namaskar to hindu Gods?

 

 

ఇక్కడ మరొక విషయాన్ని కూడా గమనించాలి. దైవవిగ్రహం మన దృష్టి మార్గాన్ని కంటే ఎత్తయిన పీఠం మీద నెలకొల్పబడి ఉంటే ఎట్టఎదుట నిలబడి నమస్కరించడంలో ఆ దోషం లేదు. ఎత్తయిన పీఠంపై దేవుడు ఉన్నప్పుడు మనం ఎట్ట ఎదుట నిలబడితే ఆయన పాదాల మీద మన దృష్టి పడుతుంది. అలా మనం ఎదుట నిలబడి నమస్కరించడమంటే దేవుని పాదాలకు నమస్కరించినట్లవుతుంది అలా దేవుని చరణారావిందాలకు వందనములు చేసినట్లే! దైవ విగ్రహం ఆపాదమస్తకం (పాదాలనుండి తల వరకూ) లేకపోయినా పాదాల స్థానం మారదన్నది స్పష్టం.


More Enduku-Emiti