శ్రీ గురు దత్తాత్రేయ ఆలయం

(మాహుర్,  మహారాష్ట్ర)

!!జై గురుదత్త! శ్రీ గురుదత్త!!

శ్రీ గురు  దత్తాత్రేయ ఆలయం,  మాహుర్  మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా లో వుంది."శ్రీ గురు దత్తాత్రేయ  చరిత్ర"లో మాహుర్ గురించి దాని ప్రాముఖ్యత గురించి విపులంగా చెప్పారు. దత్త పారాయణ చేసే భక్తులకు  ఈ క్షేత్ర మహిమ గురించి ఎక్కువగా తెలుస్తుంది. వారికోసం   మాహుర్ శ్రీ దత్తాత్రేయ ఆలయవిశేషాలు....

 



దత్తావతారం :

త్రిమూర్తు లైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి అవతరించిన దత్తాత్రేయుడు మాహుర్ ఘడ్ లో నిద్రించే వాడని ప్రసిద్ది.   అత్రి, అనసూయల కుమారుడు  దత్తత్రెయుడు దత్త అంటే దత్తత వెళ్ళడం. అత్త్రేయ అంటే అత్రి మహర్షి.


దత్తాత్రేయ అంటే అత్రి, అనసూయ మాతలకు దత్త పుత్రుడు . త్రిమూర్తులు ఈ దంపతులకు పుత్రుడి రూపం లో  తమని తాము సమర్పించుకున్నారు కాబట్టి దత్తత్రేయుడయ్యాడు.   అనసూయా మాత పాతివ్రత్యానికి మెచ్చి త్రిమూర్తులు ఇచ్చిన  కోరిక ప్రకారము త్రిమూర్తులు వారికి    దుర్వాసుడు, చంద్రుడు, దత్తాత్రేయుడు అనే ముగ్గురు పుత్రులుగా జన్మిస్తారు.. దత్తాత్రేయుడు అంటే విష్ణు మూర్తి అవతారంగా భావిస్తారు.  కొంత కాలం  ముగ్గురూ అత్రి దంపతుల వద్ద పెరిగిన అనంతరం బ్రహ్మ అవతారమైన చంద్రుడు, శివుని అవతారమైన దూర్వాసుడు తమ అంశాలను దత్తునిలో లీనం చేసి దుర్వాసుడు తపస్సుకు, చంద్రుడు తన స్తానానికి వెడలినపుడు దత్తాత్రేయుడు ఆ ముగ్గురి అంశాలతో దత్తాత్రేయుడు భాసిల్లాడు.

మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయులు అవతరించిన రొజు. దీనిని దత్త జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజునే కొన్ని చోట్ల కోర్ల పండగ అని, కుక్కల పండగ అని జరుపుకుంటారు. దేవ్దేస్వర్ (Devdeswar) ఆలయం మాహుర్  లో వుంది. ఇది దత్తుడు నిద్రించే  ప్రదేశం.

దత్తుని దినచర్య :


శ్రీ గురు దత్తాత్రేయుడు కాశీలోని గంగ లో స్నానం చేసి,  కొల్హాపూర్ లో బిక్ష స్వీకరించి, మాహుర్ లో నిద్రించే వాడుట. ఇప్పటికీ దత్తుడు ప్రతి రోజు ఇక్కడికి వచ్చ నిద్ర చేస్తాడని భక్తుల విశ్వాసం.  మాతృ తీర్ధం లో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.

మరికొంత మంది దత్తాత్రేయుడు కొల్హాపురి లో బిక్ష తీసుకుని పంచలేశ్వర్ లో భోజనం చేసేవాడని, మాహుర్ లో విశ్రాంతి తీసుకునే వాడని  కూడా అంటారు. ఈ పంచలేస్వర్ పర్లి వైద్యనాధ్ జ్యోతిర్లింగాల దగ్గర వుంది.  ఔరంగాబాద్ కి వెళ్ళే దారిలో  శనేశ్వర్  ఆలయానికీ దగ్గరలో వుంది ఈ పంచలేశ్వర్  ఆలయం.

మాహుర్ లో చూడవలసిన ప్రదేశాలు :


* అలాగే ఇక్కడ వున్న మాతృ తీర్థం, సర్వ తీర్థం ఒకటే  నని కొందరు అంటారు. దత్తాత్రేయుడు ఈ తీర్థాన్ని సృష్టించాడని,  పరశురాముడు తన తల్లితండ్రులైన   జమదగ్ని, రేణుకల  కర్మ కాండలు ఇక్కడ నిర్వహించాడని పురాణాలు చెబుతున్నాయి.

* మాహుర్ మాతృ పట్టణం, మయూర క్షేత్రం గా ప్రసిద్ది చెందింది. మాహుర్ పర్వత శ్రేణులలో మూడు కొండలపై మూడు అలయాలున్నాయి.  

* రేణుకా దేవి ఆలయం ఒక కొండ మీద, దత్తాత్రేయుని ఆలయం ఒక కొండ మీద, అత్రి, అనసూయ మాతల ఆలయం ఒక కొండ మీద వున్నాయి. ప్రైవేట్ వాహనాలు  దత్తాత్రేయుని ఆలయం వరకు వెళ్ళచ్చు.  రేణుకాదేవి ఆలయానికి,  అనసూయ మాత ఆలయానికి మాత్రం కొండ ఎక్కాల్సిందే! 


* మాహుర్ లో పెన్ గంగా నది ప్రవహిస్తుంటుంది.  మాహుర్ లో చూడవలసినవి రేణుకాదేవి ఆలయం , పరుశురామ ఆలయం, మాహుర్ కోట, మ్యుజియం,   మాహుర్ తీర్థం,  ముఖ్యమైనవి.

* మాహుర్ పట్టణానికి 19 కిలోమీటర్ల  దగ్గరలో శక్తిపిఠమ్ గా చెప్పబడే ఏకవీరా దేవి కుడా వుంది. ఇక్కడ సతీ దేవి కుడి భుజం పడినట్లు గా అక్కడి స్థలపురాణం చెబుతోంది. ఎక్కువగా భక్తులు రేణుకా దేవి ఆలయానికి వస్తుంటారు.

* మాహుర్ కోట చాల పెద్దది. రేణుకా మాత ఆలయానికి ఎదురుగా ఉన్న కొండ మీద 15వ శతాబ్దం లో నిర్మించారు.

ఇక్కడికి చేరుకోవాలంటే...:


మహారాష్ట్ర ప్రభుత్వం నాందేడ్, కిన్వత్, యావత్మల్,నుంచి మాహుర్ కి బస్సు లు నడుపుతోంది. నాందేడ్ వరకు రైల్ మార్గం కుడా వుంది. అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారానే మాహుర్ లోని ఆలయాలు చేరుకోవాలి.  ఆలయానికి 7 కిలోమీటర్ల దూరం లో వున్న మాహుర్ పట్టణం లో వసతి సదుపాయం వుంది.

మాహుర్ దత్తాత్రేయ ఆలయంలో   దత్త పూర్ణిమ నాడు విశేష మైన పూజలు చెస్తారు. మహా ప్రసాదం అందరికి పంచుతారు. దట్టమైన అడవులలో కొండ మీద నెలకొన్న ఈ ఆలయ దర్శనానికి భక్తులు ఎక్కువగానే వస్తుంటారు. మహారాష్ట్ర నుంచి అంధ్రా నుంచి భక్తులు వస్తుంటారు.



manikopalle


More Punya Kshetralu