మొగలి పువ్వును,ఆవును శివుడు శపించాడా?

 

Brief Story of cursed by Lord Shiva for bearing false witness of Lord Brahma and Lord Vishnu

 

 

పూర్వం బ్రహ్మ విష్ణువులు,తమలో తము "నేను గొప్ప అంటే నేను గొప్ప" అని వాదించుకున్నారు.ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది. అది మరింతగా పెరిగి యుద్దానికి దారితీసింది. ఈ యుద్దానికి లోకాలన్నీ తల్లడిల్లాయి.దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకొన్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కలికంగా సద్దుమణిగింది. ఆ మహా లింగం మొదలు, తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసా రూపం దరించి లింగం అగ్ర బాగాన్ని చూడడానికి, విష్ణువు వరాహ రుపమలో అదిని కనుక్కోవడానికి బయలు దేరాడు .బ్రహ్మకు ఎంతకు లింగం అగ్ర భాగం కాని మొదలు కాని కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం(మొగలి పువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని అపి తనకు, బ్రహ్మకు, విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి, సహాయం చేయమని అడిగాడు. ఆవు కనపడితే అదే విధంగా చెప్పి ,ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా, విష్ణువుతో చెప్పేటప్పుడుఅది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాదేయపడ్డాడు. సాక్షాత్తు సృష్టి కర్తయే తనని బ్రతిమాలేసారికి కాదనలేక సరేనంటాను. రెండు,కిందకు దిగి వచ్చే సారికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్ర భాగాన్ని చూశానని, కావాలంటే అవును, మొగలి పువ్వును అడగమని చెప్పాడు. నిజమే అంది మొగలి పువ్వు, బ్రహ్మదేవుడి మాటను కాదనలేక అయన లింగం అగ్ర భాగాన్ని చూసాడని ఆవు తలతో చెబుతుంది కాని, అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది. బ్రహ్మ దేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రతయ్యక్షమయ్యాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం అబద్దపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుతో భక్తులెవ్వరు తనను పూజించరాదని, తెల్లవారి లేచి ఆవు ముఖం చూడటం కుడా పాప కారణం అని శపించాడు. ఆవు అభ్యర్దన మేరకు తోకతో నిజం చెప్పింది కాబట్టి వృష్టభాగం పవిత్రమైనది, తోక భాగాన్ని పూజించిన వారికీ పుణ్య ఫలాలు కలుగుతాయని వరాన్ని అనుగ్రహించాడు మహేశ్వరుడు.


More Enduku-Emiti