శివుడికి ఇష్టమైన సంఖ్య ఏది.. రోజూ శివలింగానికి నీటితో అభిషేకం చేస్తే ఏమవుతుంది!
శివుడిని పరమేశ్వరుడు, ఈశ్వరుడు, శంకరుడు అంటూ చాలా పేర్లతో పిలుస్తుంటాం. వారంలో సోమవారం శివుడికి ప్రీతికరమైనది. ఇక మిగిలిన రోజుల్లో కూడా శివపూజ చేయడం పరిపాటి. అయితే శివుడికి ఇష్టమైన సంఖ్య ఏది? శివ లింగానికి రోజూ నీటితో అభిషేకం చేస్తే ఏమవుతుంది అనే విషయం చాలా మందికి తెలియదు. దేవతలకు అందరికీ కూడా దేవుడు కాబట్టి ఈయనను మహదేవుడు అని అన్నారు.
శివుడికి ఇష్టమైన సంఖ్య 1. ఏ నెలలో అయినా 1 సంఖ్య వచ్చేలా ఉన్న వ్యక్తులు శివుడి ఆరాధన చేస్తే మంచిదట. 1 తేదీ పుట్టిన వారు, 10 వ తేదీ అంటే ఒకటిని సున్నతో కూడితే ఒకటే వస్తుంది. అలాగే 19 తేదీన పుట్టిన వారు .. అంటే ఒకటిని తొమ్మిదితో కూడితే పది అవుతుంది. ఆ పదిని మళ్లీ కూడితే 1 వస్తుంది. అలాగే 28 తేదీ కూడా అలాగే అవుతుంది. ఏ సంఖ్యను అయితే కూడితే మూల సంఖ్య 1 వస్తుంది. ఈ మూల సంఖ్య కలిగి ఉన్న వ్యక్తులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా బాగుంటాయి. క్రమశిక్షణతో ఉండటానికి ఇష్టపడతారు.
ప్రతి రోజూ శివ లింగానికి నీటితో అభిషేకం చేసేవారికి జీవితంలో ఏ విషయంలో కొరత ఉండదట. తన భక్తులకు ఏం కావలో దాన్ని ఆ శివయ్య తప్పక ఇస్తాడట. జీవితంలో చాలా సమస్యలు తొలగిపోతాయట. జీవితంలో ఆనందం, శాంతి, ప్రశాంతత చేకూరతాయని అంటారు.
ప్రతి రోజూ శివలింగానికి నీరు సమర్పించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరతాయి.శివుడిని పూజించే వారికి, శివారాధన చేసేవారికి, శివాబిషేకం చేసేవారికి మానసిక ప్రశాంతత ఎప్పటికీ తగ్గకుండా ఉంటుంది. ప్రతి రోజూ శివాభిషేకం చేసే వారు ఏ పని తలపెట్టినా ఆ పనులలో విజయం తప్పక సాధిస్తారు. వాయిదా పడిన పనులు కూడా తిరిగి ప్రారంభమవుతాయి.
భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉన్నా.. ప్రతి రోజూ శివ లింగానికి నీటితో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగుతాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. శివ లింగానికి నీటితో అభిషేకం చేసేటప్పుడు రుద్రం చదవాలి. అది రాని వారు కనీసం ఓం నమఃశివాయ లేదా.. శివాయ నమః అనే మంత్రాన్ని కానీ చదువుతూ అభిషేకం చేయాలి.
*రూపశ్రీ.
