అంతర్గత బలాన్ని పెంచుకోవడానికి శ్రీకృష్ణుడు చెప్పిన మార్గాలు..!
కలియుగానికి గొప్ప గురువు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీకృష్ణుడే.. నాటి కాలం నుండి నేటి కాలానికి కూడా శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలు ప్రజలకు ఎంతో గొప్ప సందేశాన్ని ఇస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత సారం యుగయుగాలకు గొప్ప పాఠంగానే కొనసాగుతుంది. ఇక ప్రతి వ్యక్తి అంతర్గతంగా బలాన్ని పెంచుకుంటేనే నేటి సమాజంలో అన్ని విధాలా దృఢంగా ఉండగలుగుతారు. కానీ దురదృష్ణవశాత్తు నేటి కాలం మానవులకు లోపిస్తున్నది ఈ అంతర్గత బలమే.. ఈ అంతర్గత బలాన్ని పెంచుకోవడానికి శ్రీకృష్ణుడు సూచించిన 5 మార్గాలు తెలుసుకుంటే..
కర్మను అర్థం చేసుకోవడం..
కర్మను అర్థం చేసుకోవాలని శ్రీకృష్ణుడు చెబుతాడు. కర్మయోగ ద్వారా కర్మలను అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ తమ విధులను తాము భక్తితో నెరవేర్చాలి. ఇది వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. దీని సహాయంతో మంచి జీవితాన్ని గడపవచ్చు.
ఆత్మజ్ఞానం..
ఆత్మజ్ఞానాన్ని పొందడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. వ్యక్తి తనను తాను అర్థం చేసుకోవాలన్నా, ప్రతి వ్యక్తి తన స్వభావాన్ని అర్థం చేసుకోవాలి అన్నా, బలాలను, బలహీనతలను అర్థం చేసుకుని జీవతాన్ని మెరుగైన రీతిలో మెరుగుపరుచుకోవాలి అన్నా ఆత్మజ్ఞానం ద్వారా సాధ్యమవుతుంది.
నిస్వార్థం..
స్వార్థం లేకుండా జీవించడం మనిషిని మానసిక ప్రశాంతత వైపు, సంతృప్తి వైపు నడిపిస్తాయి. తద్వారా భయం లేకుండా కష్టాలను ఎదుర్కోగలం. జీవితంలో కష్టాలు ఎదుర్కోవడం సహజమని శ్రీకృష్ణుడు అంటాడు. మనం కష్టాలకు భయపడకూడదు, వాటిని ఎదుర్కోవాలి ఎందుకంటే కష్టాలు మనల్ని బలవంతులను చేస్తాయి, ముందుకు సాగడానికి ప్రేరేపిస్తాయి.
కరుణ, దయ..
మనం ఇతరుల పట్ల కరుణ, దయ కలిగి ఉండాలని, ఈ భావనతో మనం ప్రేమపూర్వక, సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపవచ్చని శ్రీకృష్ణుడు చెబుతాడు.
*రూపశ్రీ.
