కార్తీక మాసం చివరి సోమవారం..ఇలా చేస్తే మీ జీవితంలో అఖండ ధనయోగం..!

మాసాలన్నింటిలోనూ కార్తీక మాసంను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. కార్తీక మాసంలో శిశకేశవులను భక్తితో కొలుస్తారు. ఇప్పటికే నెల రోజులుగా భక్తులంతా అనేక ఆలయాలకు పోటెత్తారు. శివుడికి అభిషేకం చేస్తే చాలా సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. చెంబెడు నీళ్లు వేసి, బిల్వపత్రం పెట్టి శివా...శివా..అంటే ఆయన మనకు దేనికి లోటురానియ్యకుండ  కాపాడుతారని చాలా మంది భక్తులు నమ్ముతుంటారు. అదే విధంగా విష్ణువు కూడా ఆయనకు తులసీ అంటే ఎంతో ప్రీతికరం. అంతే కాదు ఆయనకు కూడా అనేక రకాల పువ్వులతో అలంకరణ చేయించుకోవడం ఇష్టం. అందుకే ఆయనను పూజారులు ప్రత్యేకంగా అలంకరిస్తుంటారు.

కార్తీక మాసాన్ని దేవుళ్లు జరుపుకునే దీపావళి పండుగా భావిస్తుంటారు. ముఖ్యంగా ఈ నెలంతా కూడా దీపారదన, వస్త్రదానం, అన్నదానం వంటివి చేస్తుంటారు. కొందరు పౌర్ణమిరోజు ఏడాదికి ఒకసారి వెలిగించే 365 వత్తులు, 10వేల వత్తులు, లక్షల వత్తులతో దీరాపాధన చేస్తుంటారు. అంతేకాదు పూజలు, వ్రతాలు, నోములు కూడా నోచుకుంటుంటారు. శివుడిని ముఖ్యంగా పాలు, పెరుగు, పంచదార, నెయ్యి, తేనెలతో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తుంటాడు. అందుకే ఈ రోజు కార్తీక మాసం చివరి రోజులు భక్తులు..ఈవిధంగా అభిషేకం చేస్తే శివుడు మన ఇంట్లో లేదు అనేది రాకుండా కాపాడుతారని నమ్ముతుంటారు. అంతేకాదు మనస్సుకు నచ్చిన అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంటుంది.

అంతేకాదు ఈరోజు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తే మంచియోగం కలుగుతుంది. రావిచెట్టు కింద నల్ల చీమలకు చక్కెర పెడితేమంచిది. అంతేకాదు గోవులకు ఏదైనాగ్రాసం తినిపిస్తే అంతా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఏదైనా గ్రహాల దశ బాగాలేకున్నా కూడా పెళ్లికుదరకున్న, ఉద్యోగంలో ప్రమోషన్ లు రాకున్నా కూడా ఈరోజుముఖ్యంగా శివుని ఆలయంలో అభిషేకం విష్ణు ఆలయంలో స్తంభం దగ్గర దీపారధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

 


More Karthikamasa Vaibhavam