కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే పాపాలన్నీ తొలిగిపోతాయ్

మహాశివరాత్రి తర్వాత శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి. ఇదే రోజున శివుడు త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసుల్ని సంహరించాడు. అందుకే.. కార్తీక పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ రోజు దేవాలయాల్లో జ్వాలా తోరణాలను వెలిగిస్తారు. ఆ తోరణాలు చూస్తే సమస్త పాపాలు కాలిపోతాయని భక్తుల నమ్మకం. దేవాలయాల్లోనూ, తులసి కోట దగ్గర... ఇదే రోజున కార్తీక దీపాలు వెలిగిస్తారు. ఏడాదికి 365 రోజులు కబట్టి... 365 వత్తుల దీపాలు వెలిగించే వాళ్లు కొందరైతే.. ఏడాదిలో రాత్రి, పగలు కలుపుకొని 730 వత్తులు వెలిగించేవారు కొందరు. ఈ రోజు దీపాలను వెలిగిస్తే.. ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. ఇంకా మరిన్ని విశేషాలు తెలిసుకోవాలంటే.. ఈ వీడియో చూడండి.


More Karthikamasa Vaibhavam