అక్కడ కార్తీక పౌర్ణమి దీపాన్ని చూడటానికి స్వయంగా శివుడే వస్తాడట
తిరువణ్ణామలై.. శివుని పవిత్ర పుణ్యక్షేత్రం. బ్రహ్మ, విష్ణువులను పరీక్షించడానికి ఈశ్వరుడు అగ్ని రూపం దాల్చాడు. అలా ఆయన అగ్నిగా మారిన ప్రదేశమే తిరువన్ణామలై. ఇక్కడున్న కొండనే.. అగ్నిగా మారిన శివ స్వరూపంగా భావిస్తారు భక్తులు. దానికి తగ్గట్టే.. ఆ కొండ ఎదరుపురంగులో ఉండటం విశేషం. తిరువణ్ణామలైలో కార్తీక మాసంలో వచ్చే బ్రహ్మోత్సవాలు చాలా విశేషం కలవి. కార్తీక పౌర్ణమికి ముందే మొదలై.. సరిగ్గా కార్తీక పౌర్ణమి నాడు అవి ముగుస్తాయ్. ఈ వేడుకల్లో తిరువణ్ణామలై శిఖరంపై భక్తలు అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఆ జ్యోతి కొన్ని కిలోమీటర్ల మేర కనిపించడం విశేషం.. ఆ అఖండ దీపాన్ని చూడటానికి శివుడే వస్తాడని అక్కడి నమ్మకం. ఈ ఆచారం క్రీస్తు పూర్వం నుంచి ఇక్కడుంది. తిరుమల బ్రహ్మోత్సవాల స్థాయిలో ఇక్కడ కార్తీక బ్రహ్మోత్సవాలు సాగుతాయ్. అయితే.. తమిళ పంచాంగం ప్రకారం.. అక్కడ కార్తీకమాసం ఇంకా మొదలవ్వలేదు. డిసెంబర్ లో అక్కడ కార్తీక పౌర్ణమి వస్తుంది.. ఆ రోజు భక్తులు ఆచరించాల్సిన నియమాలేంటి? అనేవి తెలియాలంటే.. ఈ వీడియో చూడండి. చూసి తరించండి.