ఇంద్రకీలాద్రి ఫై దేవీ నవరాత్రులు
కనకదుర్గ గుడి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం లో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరం లో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. విజయవాడ పేరు చెప్పగానే కనక దుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. విగ్రహానికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలం తో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమ లో ఉంటుంది.
విషయ సూచిక
పేరువెనుక చరిత్ర
కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపసు ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఉంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపసు చేసి శువుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయుంది.
క్షేత్ర పురాణం
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉన్నది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కెన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమవి ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు.
2013 దసరా ఉత్సవాల్లో రోజువారీ అమ్మవారి అవతారాలు :
శనివారం - శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ... పాడ్యమి
ఆదివారం - శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి ... విదియ
సోమవారం - శ్రీ అన్నపూర్ణాదేవి ... తదియ
మంగళవారం - శ్రీ గాయత్రీదేవి ... చవితి
బుధవారం - శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ... పంచమి
గురువారం - శ్రీ సరస్వతీదేవి ... షష్ఠి
శుక్రవారం - శ్రీ మహాలక్ష్మీదేవి ... సప్తమి
శనివారం - శ్రీ దుర్గాదేవి మరియు మహిషాసురమర్ధిని దేవి ... అష్టమి/నవమి
ఆదివారం - శ్రీ రాజరాజేశ్వరీ దేవి ... దశమి
ఇంద్రకీలాద్రి ఫై దేవీ నవరాత్రులు
శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వ హించేందుకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. రాష్ట్రంలోని రెండవ అతి పెద్ద ఆలయం శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నేటినుంచి ఈ నెల13 వరకు ఈ దసరా మహోత్సవాలు జరుగుతాయి. ఈ పది రోజులు శ్రీ అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తుంది. శనివారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలతో దసరా ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. స్నపనాభిషేకం అనంతరం ఉదయం శ్రీఅమ్మవార్ని భక్తులు దర్శించు కునే అవకాశం ఉంది. ఆ తరువాత ప్రతి రోజు తెల్లవారుజా మున 3గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవార్ని భక్తులు దర్శించుకునే సౌకర్యం ఉంటుంది. తెప్పోత్సవంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి. భవానీ దీక్షలు తీసుకున్న భక్తుల రద్దీ ఎక్కువగా వుండటంతో దసరా ఉత్సవాలు ముగిసిన తరువాత కూడా మరోక మూడు రోజులు పాటు ఉత్సవ ఏర్పాట్లును కొనసా గించాలని అధికారులు నిర్ణయించారు.
రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు భక్తులు శ్రీ అమ్మవార్ని దర్శించుకోవడానికి వస్తారని అధికా రులు అంచనాలు వేస్తున్నారు. భక్తు లకు కావాల్సిన సౌకర్యాలను అధికారులు కల్పించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఇం ద్రకీలాద్రి విద్యుత్ కాంతులతో ధగధగలాడుతోంది. ప్రత్యేకంగా విద్యుత్‌దీపాలను అలంకరించారు. వివిధ దేవతా మూర్తుల కటౌట్లను ఇంద్రకీలాద్రిపై ఈ ఏడాది ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. కొండదిగువనే ఉన్న కనకదుర్గా నగర్‌లో భక్తులకు కావాల్సిన లడ్డూ,పులిహోర ప్రసాదాలను విక్రయించే కౌంటర్లు ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగులు, వి.వి.ఐ.పి.లు వెళ్లేందుకు 17వ్యాన్స్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. కృష్ణానది ఒడ్డున నాలుగు స్నానఘట్టాలను ఏర్పాటు చేశారు. అక్కడ భక్తులు స్నానాలు చేసేందుకు సౌకర్యాలు కల్పించారు. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు నదిలోకి దిగలేకపోయే అవకాశం ఉన్నందున వారికోసం ప్రత్యేకంగా షవర్స్(జల్లుస్నాన ఘట్టాలు) ఏర్పాటు చేశారు. ఒకేసారి 150 మంది భక్తులు స్నానం చేసే విధంగా ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం తరుఫున దేవాదాయశాఖమంత్రి శ్రీఅమ్మవారికి పట్టుచీర, పసుపు,కుంకుమ, పూలు సమర్పించడం ఆనవా యితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా దేవాదాయశాఖమంత్రి శ్రీఅమ్మవారికి వట్టు వస్త్రాలను సమర్పి స్తారు. 13న సాయంత్రం కృష్ణానదిపై దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా శ్రీ అమ్మవారు నదీవిహారం ఉంటుంది. ప్రత్యేకంగా తయారు చేసిన హంస వాహనంపై శ్రీఅమ్మవారు నదీ విహారం చేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. తెప్పోత్సవంగా పిలిచే ఈ కార్యక్రమాన్ని లక్షలాది మంది భక్తులు వీక్షిస్తారు. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చకచకసాగిపోతున్నాయి.