హనుమాన్ చాలీసాను రోజుకు ఎన్నిసార్లు పఠించాలి?

హనుమాన్ చాలీసా.. హనుమంతునికి అంకితం చేసిన 40 లైన్ల పవిత్ర భక్తి గీతం. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహం, బలం, రక్షణ లభిస్తుందనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. అందుకే ఈ స్తోత్రాన్ని చాలా మంది  పఠిస్తారు. కానీ, మనం రోజుకు ఎన్నిసార్లు హనుమాన్ చాలీసా చదవాలో తెలుసా..? హనుమాన్ చాలీసా కాకుండా ఏ శక్తివంతమైన ఆంజనేయ స్వామి మంత్రాన్ని జపించవచ్చు..?

హనుమాన్ చాలీసాను రోజుకు ఎన్నిసార్లు చదవాలి?

హనుమాన్ చాలీసాలోని 38వ అధ్యాయంలో వ్రాసినట్లుగా- 'ఎవరు వందసార్లు పఠిస్తారో వారు అపారమైన ఆనందాన్ని పొందుతారని పేర్కొంది'. అంటే శాస్త్రాల ప్రకారం హనుమాన్ చాలీసా 100 సార్లు చదవాలి. మీరు దీన్ని 100 సార్లు పఠించలేకపోతే, కనీసం 7, 11 లేదా 21 సార్లు ఈ వచనాన్ని పఠించడం వల్ల దాని శుభ ఫలితాలు పొందవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బజరంగబలిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతిరోజూ ఉదయం,  సాయంత్రం స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసా చదవాలి.

హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి:

ఆసనం మీద కూర్చొని జపించడం:

 శాస్త్రాల ప్రకారం, హనుమాన్ చాలీసాను ఖాళీ నేలపై కూర్చోని చదవకూడదు. ఇలా పారాయణ చేస్తున్నప్పుడు మీరు ఒక ఆసనం వేసి దానిపై కూర్చోవాలి. ఆసనం తీసుకోకుండా పూజ చేయడం అశుభం. సూర్యోదయం, సాయంత్రం ఈ పాఠం చేయడం ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

హనుమాన్ చాలీసా పఠించే ముందు ఇలా చేయండి:

హనుమాన్ చాలీసా పఠించే ముందు గణపతి పూజ చేయాలి. గణేశుని పేరు తీసుకున్న తర్వాత, శ్రీరాముడిని పూజించి, హనుమాన్ చాలీసాను పఠించడం ప్రారంభించాలి. ఇది హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది.

హనుమంతుని ఇతర మంత్రాలు:
మంత్రం: ఓం హనుమతే నమః
మీరు జీవితంలో విజయం సాధించాలంటే, ఈ మంత్రాన్ని ప్రతిరోజూ ఒక జపమాల పూర్తయ్యే వరకు జపించాలి. ఇలా చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా మంత్రం యొక్క ప్రయోజనాలను పొందుతారు.

పనిలో పురోగతిని అందించే మంత్రం:
మంత్రం: ఓం నమో భగవతే హనుమతే నమః
ఈ మంత్రాన్ని పఠించడం వల్ల భూతగదాలు, కోర్టు వివాదాలు, ఆర్థిక సమస్యలు  లేదా ఏదైనా పనిలో మీకు ఆటంకం కలిగించే సమస్యలు తొలగిపోతాయి. హనుమంతుడిని ఈ మంత్రంతో పూజించడం మంచి ఫలితాలు పొందుతారు.


More Hanuman