హనుమాన్ జయంతి రోజు ఈ స్తోత్రాలు చదివితే శని దోషం పోతుందట..!

 హనుమంతుడు హిందూ దేవతలలో పూజించదగిన ముఖ్యమైన దేవుడు. నిజానికి ఈయన చిరంజీవుడు. అంటే వీరికి మరణమే లేదని అర్థం.  హనుమంతుడిని రామ భక్తుడు, రామ బంటు అని చెబితేనే ఆయన ఎక్కువ సంతోషిస్తాడు.  ప్రతి ఏడాది చైత్ర మాసంలో పూర్ణిమ రోజున  హనుమంతుడి జయంతిని జరుపుకుంటారు.  హనుమాన్ జయంతి సందర్భంగా కొన్ని స్తోత్రాలు చెప్పుకుంటే శని దోషం పోతుందని పండితులు చెబుతున్నారు.  దీని గురించి తెలుసుకుంటే..

హనుమాన్ జయంతి రోజున భక్తులు హనుమంతుడిని భక్తితో పూజిస్తే శని దోషం, అప్పుల బాధలు, జీవితంలోని అన్ని అడ్డంకుల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. హనుమంతుడిని బలం, జ్ఞానం,  భక్తికి చిహ్నంగా భావిస్తారు.  ఈయనను వాక్య కోవిదుడు అని అంటారు.  అలాగే   సంకటమోచనుడు అని కూడా పిలుస్తారు.


హనుమాన్ జయంతి రోజు ఋణమోచన మంగళ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ స్తోత్ర పారాయణ వల్ల ఆర్థిక సమస్యల నుండి బయటపడటమే కాకుండా మానసిక ఒత్తిడి,  అప్పుల బాధలు కూడా తీరతాయట. జీవితంలో స్థిరత్వం,  శ్రేయస్సు,  కష్టాల నుండి విముక్తి మొదలైనవి కూడా ఈ స్తోత్ర పఠనం వల్ల కలుగుతాయి. హనుమాన్ జయంతి రోజు  ఉపవాసం ఉండి, హనుమంతుడిని ఆరాధించి ఋణమోచన మంగళ స్తోత్రం పఠిస్తే చాలా మంచి ఫలితం ఉంటుందట.

                                     *రూపశ్రీ

 


More Hanuman