దేవునికి కులమేంటి?
ఎంతటిపుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ
మంతన మెట్టిదో యుడుత మైనిక రాగ్ర నఖాంకురంబులన్
సంతసమందఁ జేసితివి సత్కులజన్మము లేమి లెక్క వే
దాంతముగాదె నీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ!
ఓ దాశరథీ! ఆనాడు శబరి కొరికి ఇచ్చిన ఎంగిలి పళ్లను తిన్నావు. రామసేతువుని నిర్మించే సమయంలో ఉడతలు చేసిన సాయానికి ప్రతిఫలంగా వాటిని నిమిరావు. ఆలోచిస్తే జాతి, కులం, వయసు, వర్గంలాంటి బేధాలేవీ నిన్ను అంటి ఉండవేమో అనిపిస్తోంది. వేదాంత జ్ఞానంచేత మాత్రమే తెలుసుకోదగిన నీ మహాత్యాన్ని అజ్ఞానినైన నేను ఎలా తెలుసుకోగలను.
...Nirjara
