అన్ని రంగాలవారికి గణపతి ఆరాధన విశేషఫలాన్ని ఇస్తుందా ?

 

 

The God of Giving Sucess . It is believed that for becoming a successful man and woman Ganapati plays a very vital role

 

 

గణపతి దేవతలకు ఆదిదేవుడు, గణాలకు మహాగణపతి, విఘ్నాలకు నాయకుడు, విద్యలన్నిటికి గురువు, నాట్యాకారులకు నాట్యాచార్యుడు, కవులకు ఆదికవి, పార్వతీదేవి గారాల బిడ్డ, అమ్మ చేతి పసుపు ముద్ద. అటువంటి గణపతిని పరమభక్తితో గణపతిని పూజించడం వలన ఫలాన పని జరుగుతుందన్న ఫలాపేక్ష లేకుండా, నిత్యం ఆరాధించడం వలన త్వరితంగా జ్ఞానం సిద్ధించి తీరుతుంది. ఎటువంటి విద్యనైనా వినగానే నేర్చుకోగలిగిన 'ఏకసంధాగ్రహణ' శక్తి లభిస్తుంది. గణపతిని గురువుగా భావించి పూజిస్తే, స్వయంగా గణపతి మన మనసులో ఉండి మనకు విద్యలను నేర్పిస్తాడు. బుధగ్రహానికి అధిదేవతగా గణపతిని చెప్తారు. గణపతికి గరిక సమర్పించడం వలన మేధస్సు వృద్ధి చెందుతుంది. అన్ని విద్యలకు గురువు కనుక విద్యను ఇట్టే ఇచ్చేస్తాడు.

 

 

The God of Giving Sucess . It is believed that for becoming a successful man and woman Ganapati plays a very vital role

 

 


గణపతి సర్వజనులను వశం చేసుకోగలిగిన వశీకరణ విద్యను ప్రసాదిస్తాడు. కళాకారులు, నటుల ఎదుగుదలకు కావల్సింనది ప్రజల అభిమానం, అందుకోసం ప్రజలందరిని వశం చేసుకోగలగాలి. ఈ వశీకరణం నిత్యం గణపతిని ఆరాధించేవారికి సహజంగానే ప్రాప్తిస్తుంది. గణపతి ఆరాధన సృజనాత్మకతను వృద్ధి చేస్తుంది. సినిమారంగంలో ఉన్నవారు, యానిమేషన్ రంగంలో ఉన్నవారికి అవసరమైనది సృజనాత్మకత(క్రియేటివిటి). గణపతిని నిత్యం భక్తితో కలిచేవారికి సృజనాత్మకత సహజంగానే సిద్ధిస్తుంది. జ్యోత్సిష్యులకు వాక్కు ప్రధానం. జ్యోతిష్యం సక్రమంగా చెప్పాలంటే గణపతి అనుగ్రహం ఉండాలి. యోగులకు తమ శరీరంలో ఉన్న కుండలిని శక్తిని జాగృతమవ్వాలి. గణపతి మూలాధారచక్రంలో ఉంటాడు. మూలాధరానికి అధిష్టాతయై కుండలిని శక్తికి రక్షకుడిగా ఉంటాడు. వాస్తు శాస్త్రంలో గణపతి వాస్తు పురుషుడు.

 

 

The God of Giving Sucess . It is believed that for becoming a successful man and woman Ganapati plays a very vital role

 

 


గణపతిని ఈశాన్యంలో కానీ, లేక మనకు అనుకూలంగా ఉన్న ఏ దిక్కులోనైనా నెలకొల్పి, రోజు ఒక చిన్న బెల్లం ముక్క నైవేధ్యం పెట్టి, దీపారాధన చేస్తే, ఇంట్లో ఉన్న వాస్తుదోషాల పాలిట కాలుడై సర్వదోషాలను హరిస్తాడు వినాయకుడు. గణపతి లీలావైభవం ఎంతని చెప్పుకోగలం.

ఓం ఏకదంతాయ విద్మహే
వక్రతుండాయ ధీమహి
తన్నో దంతిః ప్రచోదయాత్ ||


ఏకదంతుడు, వక్రతుండుడైన గణపతిని మన మనసును ప్రభావితం చేయుగాకా. మనలని మంచి మార్గంలో నడిపించిగాకా.


More Enduku-Emiti