పూజలో తప్పకుండా ఇవి వాడుతారు ఎందుకో తెలుసా..?
సాధారణముగా ఏ దైవానికి పూజ చేయాలని అనుకున్నా సాకార పూజ అనేది తేలికగా మనసు నిలిపే తొలి మెట్టు అని అందరు అంగీకరించిందే.
అయినా దైవాన్ని మన వద్ద ఉన్న మూర్తి లోకో, నారికేళం లోకో ఆవాహన చేసేటప్పుడు అక్కడే మనకు కనిపించకుండా ఉన్న సూక్ష్మ రాక్షస శక్తులను పారద్రోలి దైవ శక్తికి ఆహ్వానం పలకడం కొరకు గంట వాయించడం అనే చక్కని సంప్రదాయం వస్తూ ఉంది. అందుకే దేవతార్చన ప్రారంభించే ముందు...
"ఆగమార్థం తు దేవానాం
గమనార్థం తు రాక్షసాం
కురు ఘంటారావం
తత్ర దేవతాహ్వాన లాంఛనం"
అని శ్లోకం చెప్పి ప్రారంభిస్తారు.
ఇక నరుడి ద్రుష్టి కి నల్లరాయి పగులుతుంది అని పెద్దలంటారు. భగవంతునికి కూడా అందుకే హారతి ఇస్తూ ఆ ద్రుష్టి దోషం తగలకుండా చూస్తూ ఉంటారు.
ఏ దేవాలయం లో అయినా సరే మంత్రపూరితంగా ప్రాణ ప్రతిష్ట చేయబడిన స్వామిని కానీ, దేవిని కానీ హారతి వెలుగులో లేదా దీపారాధన వెలుగులో మాత్రమే చూడాలి.అందుకే ఆ సమయములో అంటే హారతి ఇచ్చే సమయములో ఘంటానాదం చేస్తే అందరు ఆ సమయములో అక్కడకు చేరుకొని ఆయా దేవీ, దేవతలను సంప్రదాయానుసారంగా దర్శించి,తరించవచ్చు అని కూడా ఇలా చేస్తూ ఉంటారు.
అలాగే ఆయా దేవీ, దేవతలకు హారతి ఇచ్చే సమయములో మంగళకరముగా ఉండేలా ఘంటానాదం చేస్తూ ఉంటారు. ఆ ఘంటానాదం నుంచి వచ్చిన శబ్ద తరంగాలు మనలో భక్తి, చైతన్యం, శ్రద్ధ మరింత పెరిగేలా చేసి మన మనస్సులో మరింత ఆధ్యాత్మిక శక్తి నింపుతాయి. అందుకే ఇలా ఘంటానాదం చేస్తారు. https://www.youtube.com/watch?v=2CtkXrV8l2I