నుదిటి మీద బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న అసలు కారణమిదే..!

హిందూ ధర్మంలో పేర్కొన్న ప్రతి విషయం వెనుక బలమైన కారణం ఉంటుంది. పద్దతులు, సంప్రదాయాలను లోతుగా అర్థం చేసుకుంటే హిందూ వ్యవస్థ ఒక గొప్ప జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. హిందువులు నుదుటన బొట్టు పెట్టుకోవడం సహజం. దైవ సంబంధ కార్యకలాపాలు చేసేటప్పుడు, శుభకార్యాలలో, దేవాలయ దర్శనం.. ఇట్లా పలు సందర్బాలలో మగవారు కూడా నుదుటన కుంకుమ ధరిస్తారు. దీని వెనుక ఉన్న కారణాలను తెలుసుకుంటే..
మతపరమైన ప్రాముఖ్యత..
మతపరమైన ప్రాముఖ్యతను పరిశీలిస్తే నుదుటన కుంకుమ లేదా బొట్టు పెట్టుకోవడం దైవ భక్తి, నమ్మకం, గౌరవాన్ని సూచిస్తుంది. గుడికి వెళ్లినప్పుడు, ఏవైనా పూజలు చేస్తున్నప్పుడు, శుభకార్యాల సమయంలో చేసే పని దిగ్విజయం కావడానికి నుదుటన బొట్టు లేదా కుంకుమ ధరించడం జరుగుతుంది.
రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రాంతాన్నిభ్రూమద్యం అని అంటారు. ఇది దృష్టి కేంద్రీకరణకు, ధ్యానానికి ముఖ్య కేంద్రంగా భావిస్తారు. 72వేల నాడులకు కేంద్రబిందువు ఈ స్థానమని యోగా శాస్త్రం పేర్కొంటుంది. అజ్ఞ చక్రం ఉండే స్థానం ఇది. ఈ చక్రం బలంగా ఉంటే మానసిక బలం కూడా మెరుగ్గా ఉంటుంది.
నుదుటన బొట్టు లేదా కుంకుమ పెట్టుకోవడం వల్ల అజ్ఞా చక్రం సక్రియం అవుతుంది. ఇది ఏకాగ్రత, ధ్యానం, మానసిక శక్తిని పెంచుతుంది. ఆధ్యాత్మిక శక్తి సక్రియం అవుతుంది. ఇది వ్యక్తి ఆలోచనలు మెరుగ్గా ఉండేలా సహాయపడుతుంది. శాంతిని కలిగిస్తుంది.
వైష్ణవులు గంధాన్ని అజ్ఞా చక్రం స్థానంలో దరిస్తారు. అలాగే శైవులు బూడిద లేదా భస్మంతో మూడు క్షితిజ సమాంతర గీతలను నుదుటన ధరిస్తారు. దీన్ని త్రిపుండం అని అంటారు.
శక్తి శాఖలో నుదుటిపై ఎర్రటి కుంకుమ లేదా సింధూర తిలకం ధరిస్తారు. ప్రతిది ఆయా దేవతల శక్తితో, సంప్రదాయాలతో ముడిపడి ఉంటుంది.
*రూపశ్రీ.



