ఈ ఒక్క దీపం పెట్టి చూడండి.. జీవితంలో అడ్డంకులు మంత్రించినట్టు తొలగుతాయి..!

ప్రతి వ్యక్తి తమ జీవితం ఎలాంటి కష్టాలు లేకుండా సాఫీగా సాగాలని కోరుకుంటారు. కానీ కష్టాలు లేని జీవితం అంటూ ఎక్కడా కనిపించదు. కోటీశ్వరుడు అయినా, గుడిసెలో పేదవాడు అయినా తప్పనిసరిగా కష్టాల కడలిలో ఈత కొట్టాల్సిందే. జీవితంలో కష్టాలు, సమస్యలు, అడ్డంకులు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అయితే కొందరి జీవితంలో మాత్రం ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంతేకాదు.. జీవితంలో ఒక సమస్య ఇంకా ఎదుర్కుంటున్నప్పుడే మరొక సమస్య వచ్చేస్తుంది. దీని వల్ల ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు. జీవితం మీద విరక్తి తెచ్చుకునేవారు కూడా ఉంటారు. అయితే ఒక్క దీపం పెట్టడం వల్ల జీవితంలో చాలా సానుకూల మార్పులు వస్తాయని, ఎలాంటి అడ్డంకులు, సమస్యలున్నా మెల్లగా తీరిపోతాయని అంటున్నారు. ఇంతకూ ఆ దీపం ఏంటి? ఈ దీపం ప్రత్యేకత ఏంటి? తెలుసుకుంటే..
కుష్మాండ దీపం..
కుష్మాండం అంటే గుమ్మడికాయ. కాలభైరవ అష్టమి రోజున లేదా ప్రతి మాసంలో వచ్చే అష్టమి రోజున కుష్మాండ దీపం వెలిగిస్తే చాలా గొప్ప మార్పులు చోటుచేసుకుంటాయి. కాలభైరవుడికి ఈ కుష్మాండ దీపం చాలా ప్రీతికరమైనదని చెబుతారు. కుష్మాండ దీపాన్ని వెలిగిస్తే ఇంట్లో అశుభాలు, నరదోషాలు, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతాయట. ఇంట్లో శాంతి, రక్షణ ఏర్పడతాయట. అలాగే ఇంట్లో శుభ వాతావరణ నెలకొంటుందట.
కుష్మాండ దీపాన్ని పెట్టడానికి గుమ్మడికాయను రెండు సమానభాగాలు చేసి లోపలి విత్తనాలు తీసేసి దానికి పసుపు రాయాలి. అందులో నువ్వుల నూనె పోయాలి. ఇందులోనే నల్ల నువ్వులు, కావు గింజలు వేయాలి. ఇందులో వత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడంలో ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది.
కాలబైరవ స్వామికి నల్ల నువ్వులు, నల్ల నువ్వుల నూనె జోడించి చేసిన దీపారాధన అంటే చాలా ప్రీతి. ఇది చాలా శక్తివంతమైన దీపారాధన అని పండితులు చెబుతున్నారు. కుష్మాండ దీపం వెలిగించి కాలభైరవ స్తోత్రాలు, మంత్ర జపం చేయడం వల్ల మరింత మంచి ఫలితం ఉంటుంది.
కుష్మాండ దీపాన్ని వెలిగించిన ఇంట్లో భయం, పనులలో అడ్డంకులు, శత్రు సమస్యలు వంటివి తొలగిపోతాయట. కాలభైరవుడి ఆశీర్వాదం రక్షణ కవచంలా వెన్నంటే ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు.. కుష్మాండ దీపం వెలిగించడం వల్ల రాహు, కేతు, శని దోషాలు కూడా పోతాయని చెబుతారు.
*రూపశ్రీ.


