అతనే పండితుడు

 

 

యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః |

జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః ||

 

ఎవరి కర్మలైతే కోరిక, సంకల్పాలకు అతీతంగా ఉంటాయో... ఎవరి కర్మలైతే జ్ఞానం అనే అగ్నిలో దహించుకుపోయి ఉంటాయో... వారినే పండితులు అంటారు.

 

జీవి అన్నవాడు కర్మ చేయక తప్పదు. కానీ ఆ కర్మ తిరిగి అతడిని సంసార చక్రంలోకి దింపుతుంది కదా! కోరికను అనుసరించి కర్మ, కర్మను అనుసరించి కోరిక అనే విషవలయంలోకి లాగుతుంది కదా! మరి సంసారంలో ఉంటూనే, జీవనానికి ఆధారమైన కర్మలను సాగిస్తూనే... అది తన ఆత్మకు అంటకుండా ఉండాలంటే ఎలాంటి ప్రజ్ఞ ఉండాలో గీతాకారుడు ఇక్కడ సూచిస్తున్నాడు. కర్మ చేయాలి కానీ అది ఏదో పొందితీరాలన్న కాంక్షతో కూడదు. తన ఇంద్రియాలను తృప్తి పరచుకోవాలన్నే తపనతో సాగకూడదు. ఒక పక్క అలాంటి కర్మలు చేస్తూనే మరోపక్క భగవంతుని పాదపద్మాల చెంత తన మనసుని నిశ్చలం చేసుకున్నప్పుడు పూర్వజన్మ వాసనలు సైతం దహించుకుపోతాయి. అతనే నిజమైన పండితునిగా భావింపబడతాడు.

 

...Nirjara


More Good Word Of The Day