అమరనాథ్ గుహలో ఉండే జంట పావురాల రహస్యం..!

 

 

అమర్‌నాథ్ క్షేత్రం పరమ శివుడి పవిత్ర క్షేత్రం.  పూర్వ కాలంలో అమర్‌నాథ్ గుహను అమరేశ్వర్ అనే పేరుతో పిలిచేవారు. మంచుతో  శివలింగం ఏర్పడినందున ఈ పవిత్ర స్థలాన్ని 'బాబా బర్ఫానీ' అని కూడా పిలుస్తారు. ఇక్కడ శివలింగం స్వయంభువుగా వెలశాడు. ఈ ప్రదేశం 51 శక్తిపీఠాలలో ఒకటి. అమర్‌నాథ్ గుహలో  శివలింగాన్ని దర్శించుకున్న వ్యక్తి మరణానంతరం మోక్షాన్ని పొందుతాడని నమ్మకం.  అమర్‌నాథ్ గుహలో శివుడు పార్వతి తల్లికి అమరత్వం పొందిన కథను వివరించాడు. ఒక జత పావురాలు (అమర్‌నాథ్ పావురాలు) కూడా ఉన్నాయి ఈ గుహాలో ఉంటాయి.  చాలా అదృష్టం చేసుకున్న పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే ఈ పావురాలు కనిపించేవట. భక్తులు వాటిని చూసిన తర్వాత తమను  అదృష్టవంతులుగా భావిస్తారు. ఈ పావురాలు సాధారణ పావురాలు కావని,  ఇవి దైవిక పావురాలని అంటారు.  ఈ పావురాల జత  రహస్యం గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియవు..  వాటి  గురించి తెలుసుకుంటే..

పురాణాల ప్రకారం శివుడు ఒకసారి  పార్వతికి మోక్షాన్ని పొందే మార్గాన్ని చూపించాడు.  మోక్షానికి మార్గం తెలుసుకోవాలనే తన ఉత్సుకతను  పార్వతి దేవి పరమేశ్వరుడి ముందు వ్యక్తం చేసింది.  శివుడు పార్వతి మాతకు మోక్షం పొందే మార్గం తెలపే  అమృతజ్ఞాన కథను చెప్పడానికి అమరనాథ్ గుహకు తీసుకెళ్లాడు.  అక్కడ అయితే ఆ కథను మరెవరూ వినలేరనే భావనతో అక్కడికి తీసుకెళ్లాడు. శివుడు పార్వతికి అమృతజ్ఞాన కథను చెబుతున్నప్పుడు, అక్కడ ఉన్న పావురాల జత కూడా అమృతజ్ఞాన కథను విన్నది. కథ విన్న తర్వాత, ఆ పావురాల జతకు మరణం అనేది లేకుండా పోయింది.  ఆ పావురాలు ఇప్పటికీ అమరనాథ్ గుహలో సజీవంగా ఉన్నాయని చెబుతారు. అయితే చాలా మందికి ఆ పావురాల జత కనిపించదు.  శివుడిని స్వచ్చమైన మనసుతో పూజించేవారు,  ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఆ పావురాల జంటను చూడగలరని అంటారు.  అమర్‌నాథ్ గుహలోని శివలింగాన్ని సందర్శించిన తర్వాత, పావురాల జతను చూడటం చాలా శుభప్రదమని నమ్ముతారు.


అమర్‌నాథ్ యాత్ర..

ప్రతి సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో అమర్‌నాథ్ యాత్ర జూన్ 25న ప్రారంభమై ఆగస్టు 9న ముగుస్తుంది. ప్రతి సంవత్సరం శివ భక్తులు ఈ ప్రయాణం ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. ప్రయాణంలో చూడటానికి చాలా అద్భుతమైన దృశ్యాలు ఉంటాయి.  ఎన్నో శైవ క్షేత్రాలను దర్శించుకుంటూ అమర్‌నాథ్ చేరుకుని దర్శనం చేసుకుంటారు.


                                       *రూపశ్రీ
 


More Mysteries - Miracles