• Prev
  • Next
  • నేను - యాక్సిడెంటూ - 3

    Listen Audio File :

    సందేహం తీరక మళ్ళీ ముందుకి వంగి వాసన చూశాడు అయొడిన్ వాసన వేస్తుందో లేదోనని. సరిగ్గా అప్పుడే మా అకౌంటెంటు తలుపు తోసుకుని గదిలోకి వచ్చాడు. ఆఫీసరు కంగారుగా తలెత్తి చూశాడు.

    “అబ్బే! కాళ్ళు మొక్కడం లేదు.... నాకేం అవసరం ఇతని కాళ్ళు మొక్కడానికి. ఇతనేమైనా మినిస్టరు క్యాండిడేటా?... కాలుకున్న బ్యాండేజీ వాసన చూస్తున్నా.... హిహిహి.... అవును కదోయ్.....” అన్నాడు నావంక చూస్తూ.

    “అవునండీ....”

    “నువ్వుకూడా వాసన్జూడు" అన్నాడు పైకి లేస్తూ అకౌంటెంటుతో.

    “అబ్బే.... ఎందుకులెండి.. నిజంగానే దెబ్బలు తగిలినట్టున్నాయ్” అన్నాడు అకౌంటెంటు మొహమాటంతో.

    ఆఫీసరు గుర్రుగా చూశారు. “ఊ....” అంటూ నావైపుకి తిరిగాడు ఆఫీసర్. ఇంతకీ నీకు యాక్సిడెంటు ఎలా జరిగిందోయ్?”

    “నేను నాకు జరిగిన యాక్సిడెంటు గురించి వివరంగా చెప్పసాగాను. వాళ్ళు కళ్ళు ఇంతింత చేస్కుని వింటూ మధ్య మధ్యలో గుండెల మీద చేయ్యేస్కుని “అమ్మో.. భలే ప్రమాదం తప్పిందే.... ప్రాణం పోవాల్సిందేనన్న మాట..... బాగా తప్పించుకున్నావే....” అంటున్నారు. వాళ్ళు అలా వింటుంటే నాకు చాలా మూడ్ వచ్చింది. బాగా వర్ణించి చెప్పాను. తరువాత నా సెక్షను కి వెళ్ళి సీట్లో కూర్చున్నాను. సెక్షన్లోని జనంమొత్తం నా కట్టు చూశారు. వాళ్ళు ఏమైందని అడిగారు.

    నేను హీరో ఫోజుపెట్టి నేను స్పీడుగా స్కూటర్ మీద వెళ్తుంటే ఎద్దు ఏ విధంగా అడ్డు వచ్చిందీ, నేను స్కూటర్ మీంచి ఎలా దూకింది తరువాత లారీ మీదికి వస్తే ఎలా జంప్ చేసింది. ఆ తరువాత నా మెళుకువలన్నీ ఉపయోగించి ఆటోకి అందకుండా ఎలా దూకింది, చివరికి ఎద్దు పొడవడానికొస్తే మెరుపులా నా నడుం వెనక్కివంచి పోటునుండి ఎలా తప్పించుకుంది వాళ్ళకి చెప్పాను, నేను కాబట్టి అలా తప్పించుకున్నానుగానీ, వేరే వాళ్ళయితే లారీకో, ఆటోకో, ఎద్దు కొమ్ముకో బలయిపోయి ఉండేవారని చెప్పాను.

    వాళ్ళు నేను చెప్పేది అలా నోళ్ళు తెరుచుకుని వింటుంటే నాకు సరదాగా అనిపించింది. ఆరోజు మొత్తం ఆఫీసులో స్టాఫ్ కి నాకు జరిగిన యాక్సిడెంటు గురించి చెప్పడంతో సరిపోయింది. ఆఫీసునుండి బయటకు వచ్చాను. బస్ స్టాపులో జనం నా చేతులకీ కాళ్ళకీ ఉన్న కట్లుచూసి ఏమైందని అడిగారు. వాళ్ళకీ చెప్పాను. బస్సు ఎక్కిన తరువార బస్సులో పరిచయం ఉన్న ఒకతని దృష్టిలో నాకట్లు కనబడ్డాయి. ఆయనకీ చెప్పాను. మా కాలనీలో బస్ స్టాపులో దిగగానే అక్కడ ఒకళ్ళిద్దరు నన్ను చూసి ఏమైందని అడిగారు. వాళ్ళకీ చెప్పేసరికి నాకు కాస్త సహనం వచ్చింది,

    బస్ స్టాపు నుండి ఇంటికి వెళ్ళేదార్లో నలుగురైదుగురికి యాక్సిడెంటు గురించి చెప్పాల్సి వచ్చింది. అందరికీ ఇలా చెప్పుకుంటూ వచ్చేసరికి దవడలు పీకుతున్నాయ్. మర్నాడు మళ్ళీ అందరూ అడగడడం మొదలైంది. ఇంటినుండి బస్ స్టాండుకి వెళ్ళేదాకా అడిగిన వాళ్ళకి, బస్ స్టాండులో దిడిగిన వాళ్ళకి, బస్సులో అడిగిన వాళ్ళకి, మళ్ళీ అక్కడ బస్సు ఆగి ఆఫీసుకెళ్ళే దార్లో అడిగిన వాళ్ళకి అందరికీ యాక్సిడెంటు గురించి చెప్పాల్సి వచ్చింది.

  • Prev
  • Next