చిలిపి జోక్స్

చిలిపి జోక్స్

" మన ప్రేమ సాక్షిగా నాకేమిస్తావు డార్లింగ్ ? " అని కొంటెగా చూస్తూ అడిగింది రాధ.

" నా ప్రెండ్ మోహన్ కి నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తాను డియర్ " అని చిలిపిగా నవ్వుతూ

చెప్పాడు కృష్ణ.

**********

" మన అమ్మాయికి అన్నీ నీ బుద్ధులే వచ్చాయి ! " అని కోపంగా భార్యతో అన్నాడు భర్త.

" మరేమనుకున్నారు ? అది నా కూతురు." అని గర్వంగా చెప్పింది భార్య.

" అదే చెబుతున్నాను...పక్కింట్లోని అబ్బాయికి అదే పనిగా కన్నుకొడుతున్నది " అని

చిలిపిగా కన్ను కొడుతూ చెప్పాడు అ భర్త.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది భార్య.

***********

“ ఏరా...భార్య పోయిన రెండవ రోజునే పెళ్లి చేసుకున్నావా?”కొంచెం ఆశ్చర్యంగా

అడిగాడు సుధాకర్.

“ ఆవునురా..సంతోషాన్ని ఎక్కువకాలం దాచుకునే మనస్తత్వం కాదు నాది "అని

నవ్వుతూ అన్నాడు రమేష్.

***********

“ ఇంతకు ముందు సినిమాకి తీసుకెళ్ళినప్పుడల్లా బాల్కాని టికెట్ ని కొనేవారు.ఇప్పుడు

సెకండ్ క్లాస్ టిక్కెట్లు ఎందుకు కొన్నారు ?”అడిగింది రాధ.

“ ఇప్పుడు మనకు పెళ్లి అయ్యింది కదా "అని చిలిపిగా కన్నుగీటుతూ అన్నాడు మోహన్.

*******

“నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను జీవితంలో చేసిన తప్పు "కోపంగా భార్యతో అన్నాడు భర్త.

“నా మనస్సులోని మాటా కూడా అదే "అని గబుక్కున నాలిక్కరుచుకుంది భార్య.