Home » » భావప్రాప్తి

భావప్రాప్తి

భావప్రాప్తి, సుఖప్రాప్తి, క్లైమాక్స్, శృంగారంలో పతాకవస్థ ఇలా అనేక పేర్లున్న ఈ భావప్రాప్తి శృంగారంలో ఓ ముఖ్యమైన ఘట్టం. చాలామంది స్త్రీలు అది అంటే ఏంటో తెలియకుండానే పిల్లల్ని కనేశారు. మగవాళ్లు కూడా వాళ్ళ తృప్తి వాళ్లు చూసుకునేవారు. మారుతున్నకాలంలో భావప్రాప్తి తప్పనిసరిగా పొందాలనే కోరిక ఆడవాళ్ళలో కలుగుతోంది. ఈ మార్పు మగవాళ్లలో అనేక సమస్యలకు దారి తీస్తోందికూడా. భావప్రాప్తి గూర్చి, దీన్ని పొందేవిధానం గూర్చి విపులంగా కామసూత్రాలలో వాత్స్యాయనుడు వర్ణించాడు. స్త్రీల గూర్చి అంత వివరంగా వివరించిన ఘనత వాత్స్యాయనుడిదే.

 

భావప్రాప్తిపై మొదటి అంతర్జాతీయ సదస్సు ఢిల్లీలో జరిగింది. భావప్రాప్తి గూర్చి అనేక నవలల్లో వర్ణనలు చేస్తున్నారు. అనేక కథలు కూడా వస్తున్నాయి. ఆ కల్పనిక నవలల్లో భావప్రాప్తి గూర్చిన అతిశయోక్తులు ఉండడంతో దాన్ని గూర్చిన అపోహలు కూడా పెరుగుతున్నాయి. శృంగారంలో పాల్గొన్న ప్రతిసారీ తప్పనిసరిగా తృప్తి కలగాలి అన్న ఆలోచనతోనే స్త్రీ శృంగారంలో పాల్గొంటే కొన్ని కొన్ని సందర్భాలలో తృప్తి పొందకపోవచ్చు. క్లైమాక్స్ కు చేరుకోవాలంటే ఆనందాన్నిచ్చే సెన్షేషన్స్ చాలా అవసరం. తృప్తినే గోల్ గా పెట్టుకుని శృంగారంలో పాల్గొంటే శరీరంలో ఆనందదాయక సెన్సేషన్స్ పెరగక తృప్తి పొందలేరు.

 

అందువలనే శృంగారం సమయంలో భావప్రాప్తిపైనా ధ్యాస వుంచుకుని కొందరు ఆడవాళ్ళు మధురమైన శృంగారక్షణాల్లో ఇంట్లో అయిపోయిన వస్తువులగూర్చో, తెచ్చుకోవలసిన వస్తువులు గూర్చో లేదా పనికిరాని అనేక ఇతర విషయాలనో భర్తతో మాట్లాడతారు కూడా. ఇవన్నీ భావప్రాప్తి పొందడానికి ప్రతి బంధకాలే. శృంగారంలో ఇద్దరూ ఒకేసారి తృప్తి చెందడం అత్యంత ఆనందాన్నిచ్చే విషయం . కానీ తప్పనిసరిగా ప్రతిసారీ ఇద్దరూ ఒకేసారి తృప్తి చెందాలనే నియమం లేదు. భార్య భర్తకంటే ముందే తృప్తి చెందినట్లయితే మగవాడికి శృంగారంలో చాలా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అత్యంత ఆనందం కూడా కలుగుతుంది. ఇద్దరూ విడివిడిగా తృప్తి చెందుతున్నట్లయితే ఒకళ్ళు క్లైమాక్స్ల్ లో వుండగా రెండోవాళ్లు చూడగలుగుతారు. క్రైమాక్స్ సమయంలో శరీరంలోనూ, ముఖంలోనూ కండరాలు బిగుసుకోవడం జరుగుతుంది. కొందరు మగవారు ఆ సమయంలో భార్య ముఖకవళికల్లో వచ్చిన మార్పు అందాన్ని తగ్గించింది అని భావిస్తారు. వెలుతురు వుండి శృంగారాన్ని కొందరు ఇష్టపడతారు. వెలుతురు లేకుండా వుండడాన్ని కొందరు ఇష్టపడతారు. సమాజం విధించిన అనేక విధి నిషేధాల వలన స్త్రీలు శృంగారంలో చురుగ్గా పాల్గోలేరు.

 

ఎంతో ఫ్రగా శృంగారంలో పాల్గోవాలని వున్నప్పటికీ తమభావాల్ని వ్యక్తం చేస్తే భర్త తనగూర్చి నింఫోమానియాక్ అనో, కామపిశాచి అనో భావిస్తాడని భయపడి శృంగారంలో చాలామంది సిగ్గుని అభినయిస్తారు. అంతేకాకుండా కొందరు మగవారిలో భార్యపట్ల అనుమానం కూడా ఏర్పడుతుంది. మగవాళ్ళని ప్రేరేపించడం కూడా ఆడవాళ్లకి ఎంతో ఆనందాన్నిస్తుంది. స్త్రీలు ఫెలాషియో (పురుషాంగ చూషణ) చేస్తుంటే భర్తకు కలిగే ఆనందంచూసి భార్యకూడా తృప్తి చెందుతుంది. ఇది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఫెలాషియోలో పురుషుడికి తృప్తి కలగడం, అంతులేని ఆనందం కలగడం సహజమే. మరి స్త్రీ ఎట్లా ఆనందాన్ని పొందుతుంది అన్నది వారి సందేహం. ఫాంటసీలు కూడా స్త్రీలకు భావప్రాప్తినిస్తాయి.

 

శరీరంలో ఏభాగాన్ని ముట్టుకోకుండానే ఏ రకమైన సెక్స్ లేకుండానే కేవలం ఊహల ద్వారా కూడా స్త్రీలు తృప్తి చెందుతారు. ఈ విషయాన్ని జీ - స్పాట్ పై అనేక పరిశోధనలు చేసిన డా . బి వర్లీవిపుల్ చెప్తున్నారు. వక్షోజాల ప్రేరేపణ కూడా కొందరి లో భావప్రాప్తిని కలిగిస్తుంది. కేవలం రతికేళి ద్వారానే తృప్తి కలుగుతుందనుకొనేవారు. ఇలా వక్షోజాల ప్రేరేపణ ద్వారా భావప్రాప్తి కలిగినప్పుడు కొంత కంగారు పడతారు. నిజానికి ఈ మార్గం ద్వారా కూడా భావప్రాప్తి కలగడం వాళ్ల అదృష్టంగా భావించాలి. సెక్స్ కన్నా కూడా జీ- స్పాట్ ని, జననావయవాల్లోని ఇతర ప్రాంతాల్ని వ్రేళ్ళతో స్పృశించినప్పుడు తీవ్రమైన భావప్రాప్తి కలుగుతుంది. కానీ చాలామంది ఆడవారు ఇదేదో అసహజ శృంగార ప్రక్రియనుకొని మగవారిని ఈ పనిచేయడానికి అనుమతించరు. భావప్రాప్తి ఏవిధంగా కలిగినా అదొక అధ్బుత ప్రక్రియే. అత్యంత ఆనందాన్నిచ్చేది.

 

అది ఫాంటసీ ద్వారా కలిగినా, వక్షోజాల ద్వారా కలిగినా, క్లిటోరిస్ ప్రేరేపణ ద్వారా కలిగినా, రతికేళివలన కలిగినా, జీ - స్పాట్ స్టిమ్యులేషన్ ఏవిధంగా కలిగినా అది భావప్రాప్తే. పొందిన ప్రతిసారీ కొత్త అనుభూతినిచ్చేది భావప్రాప్తి. చక్కగా తృప్తి చెందితే భర్త తన పనయిపోగానే ప్రక్కకు తిరిగి పడుకున్నా స్త్రీ బాధపడదు. అనే తనకు తృప్తి కలగకుండా మగవాడు తను మాత్రమే తృప్తిపడి వెంటనే ప్రక్కకు తిరిగి పడుకుంటే ఆడవాళ్ళకు అత్యంత చిరాకు కలుగుతుంది. భావప్రాప్తి గూర్చిన పరిజ్ఞానం పెరిగేకొద్దీ కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి భావప్రాప్తి పొందాలి. నాకలా జరగలేదు. మిగతావాళ్ళ పరిస్థితి ఏంటి? అని కొందరు అడుగుతుంటారు. పెళ్లయి ఆరునెలలయింది. ఇంతవరకు నాకు భావప్రాప్తి కలగలేదు. ఆయనలోగానీ నాలోగానీ లోపమేమైనా వుందా? అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటారు.

google-banner