Home » » ఆడవారిలో టెస్టోస్టిరాన్

ఆడవారిలో టెస్టోస్టిరాన్

మగవారిలోనూ, ఆడవారిలోనూ సెక్స్ కోర్కెలు కలగడానికి ముఖ్యమైంది టెస్టోస్టిరాన్. మగవారిలో అయితే ఇది తక్కువ ఉన్నవాళ్ళకి దీన్ని మాత్రలు లేదా ఇంజెక్షన్ ల రూపంలో ఇస్తారు. చాలామంది పరీక్ష చేయకుండానే ఈ ఇంజెక్షన్ ఇస్తారు కూడా. మరి ఆడవారిలో ఈ హార్మోన్ వాడితే ఎలా వుంటుంది?
ఒక స్త్రీకి చిన్న వయసులో గర్భసంచి తొలగించారు. కండరాల నొప్పితో బాధపడుతూంటే డాక్టర్ టెస్టోస్టిరాన్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమెలో సెక్స్ కోర్కెలు ఎక్కువయ్యాయి. ఎప్పుడూ సెక్స్ గూర్చిన ఆలోచనే. ఆమెను తృప్తి పరచడం భర్తకి కష్టమయింది కూడా. సెక్స్ లోనే కాక శరీరంలో కూడా ఆమెలో మార్పులు మొదలయ్యాయి. కొంచెం లావవ్వడం, పై పెదవిపై వెంట్రుకలు పెరగడం లాంటివి. దానితో ఆమె టెస్టోస్టిరాన్ తీసుకోవడం ఆపివేసింది. సెక్స్ కోర్కెలు అసలు లేనివాళ్ళకి లేదా తక్కువ ఉన్నవాళ్ళకి దీని వాడకం విషయంలో తర్జన భర్జనలు అవుతున్నాయి.
 

 

ఆడవారిలో టెస్టోస్టిరాన్ వాడడానికి చాలామంది డాక్టర్ లు ఎందుకు ఇష్టపడరు? అని అంటే తెలియక, భయంతో అని సమాధానం చెప్తారు న్యూయార్క్ కి చెందిన ఎండోక్రైనాలజిస్ట్ డా.లారెన్స్ సోంకిన్. ఒక పరిశీలనలో ఎక్కువకాలం ఈస్ట్రోజెన్ హార్మోన్ వాడిన ఒక లక్షా ఇరవైవేల మందిని పరిశీలించగా వారిలో ఈస్ట్రోజన్ వాడనివారిలో కన్నా వక్షోజాల కేన్సర్ వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా వున్నట్లు చూశారు. ఇలాంటి రిపోర్ట్స్ రావడంతో హార్మోన్స్ ఇవ్వడానికి డాక్టర్లు సందే హిస్తున్నారు. టెస్టోస్టిరాన్ తో ఉన్న మరొక చిన్నడౌట్ దాని డోస్. ఎంత పరిమాణంలో ఇస్తే సెక్స్ కోర్కెలు పెరిగి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కలగవు అన్నది ఖచ్చితంగా నిర్ణయించాలి. అలాగే ప్రతిసారీ ఈస్ట్రోజన్ తో కలిపి మాత్రమే టెస్టోస్టిరాన్ వాడాలి. ఆడవారిలో టెస్టోస్టిరాన్ ఇచ్చేప్పుడు కలిగే ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్స్ - పై పెదవిపై వెంట్రుకల పెరుగుదల, బరువు పెరగడం, సెక్స్ కోర్కెలు అధిక మవ్వడం, గొంతులో మార్పు, లోడెన్సిటీ లిపిడ్స్ పెరగడం లాంటివి, అయినా కొందరు స్త్రీలు టెస్టోస్టిరాన్ తీసుకోవడానికి ఇష్టపడతారు.
శరీరంలో అనేక ముఖ్యకార్యాలు హార్మోన్లు నిర్వర్తిస్తాయి. వీటి పరిమాణాలు రక్తంలో అతి తక్కువగా ఉన్నా (ఇవి నానోగ్రామ్స్ పరిమాణంలో ఉంటాయి) అవిచేసే పనులు మాత్రం చాలా ముఖ్యమైనవి.
స్త్రీలలో అండాలనుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది లేకపోతే స్త్రీ పుష్పవతి అవ్వలేదు, అండం విడుదలవ్వదు, వక్షోజాల పరిమాణం కూడా పెరగదు. యోనిలో స్రావాలు ఉండవు. మగవారిలో బీజాలనుంచి ఎడ్రినల్ నుంచి టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. మగవాళ్ళ మగతనానికి ఇది అత్యంత ముఖ్యమైనది. ఇది లేకపోతే మీసాలు గడ్డాలు పెరగవు, గొంతులో మార్పు రాదు. సెక్స్ లోపం కూడా సంభవిస్తుంది. ఆడవారిలో కూడా టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉంటుంది. కాకపోతే పురుషులలో కన్నా బాగా తక్కువగా ఉంటుంది. ఆడవారిలో ఎడ్రినల్ గ్రంధులనుంచి టెస్టోస్టిరాన్ ఉత్పత్తి అవుతుంది. మగవారిలో ప్రతి మిల్లీలీటర్ రక్తంలో 3 నానోగ్రాముల నుంచి 10 నానోగ్రాములదాకా టెస్టోస్టిరాన్ ఉంటుంది. ఆడవారిలో ప్రతి మిల్లీలీటర్ రక్తంలో 0.1 నుంచి 0.9 నానోగ్రాముల పరిమాణంలో టెస్టోస్టిరాన్ ఉంటుంది. ముట్లుడిగాక హార్మోన్ లోపం వలన స్త్రీలలో సమస్యలు అధికమవుతాయి. అండాలు రెండూ తొలగించినవారిలోనూ, గర్భసంచి తొలగించినవారిలోనూ సెక్స్ సమస్యలు కలగవచ్చును.
 

స్త్రీలలో టెస్టోస్టిరాన్ పాత్ర పై 1930 వరకు పరిశోధనలు జరగలేదనే చెప్పవచ్చు. 1930 లలో జార్జ్ పాపనికోలావూ (పాప్ స్మియర్ టెస్ట్ ని కనిపెట్టింది ఈయనే.) ముట్లుడిగిన స్త్రీలకు టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజెన్ కలిపి ఇవ్వడం మొదలుపెట్టాడు. 1938లో ప్రచురించిన పరిశోధన, ఆయన, ఆయన సహచరులు ముట్లుడిగిన స్త్రీలలో టెస్టోస్టిరాన్ ఇచ్చినప్పుడు క్లిటోరిస్ పెద్దదవడం, గొంతులో మార్పు, సెక్స్ కోర్కెలు పెరగడం లాంటి మార్పులు వస్తాయని వ్రాశారు. మగవారిలో సెక్స్ కోర్కెలు తక్కువ ఉన్నాయంటే టెస్టోస్టిరాన్ ఇచ్చే డాక్టర్లు ఆడవారి విషయానికి వచ్చేసరికి నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక పరిశీలనలో కేన్సర్ కాకుండా ఇతర కారణాలకోసం అండాలు, గర్భాశయం లేదా రెండూ తొలగించినవారికి ఈస్ట్రోజన్ టెస్టోస్టిరాన్, ప్లాసిబో (ఏ మందు కానిది) ఇచ్చి చూశారు. ఈస్ట్రోజన్ ఒకటే వాడేవారిలో కన్నా ఈస్ట్రోజన్ టెస్టోస్టిరాన్ వాడినప్పుడు మంచి ఫలితాలు కలిగినట్లు గమనించారు. మళ్ళీ ప్లాసిబో ఇచ్చినప్పుడు సెక్స్ కోర్కెలు తగ్గడం గమనించారు.
న్యూయార్క్ కి చెందిన ఎండోక్రైనాలజిస్ట్ డా. లారెన్స్ సోంకిన్ వారానికి పదినుంచి ఇరవై మిల్లీగ్రాముల ప్రమాణంలో ఇచ్చి చూశారు. ఇది ఇచ్చినవారిలో సెక్స్ కోర్కెలు పెరగడం గమనించారు. కొందరు భర్తలు ఈ మార్పును తట్టుకోలేకపోయినట్లు, కొందరు ఈ మార్పువలన చాలా ఆనందించినట్లు చెప్పారు.

google-banner