TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ఆహా నగర్ కాలనీ
సూరేపల్లి విజయ
9 వ భాగం
నిరంతరాన్వేషి, ప్రపంచాన్ని చదివాడు, మనుష్యుల్ని చదివాడు, లౌక్యం తెలుసుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. రైల్వేస్టేషన్ లో పంపుకింద నీళ్ళు తాగే దశ నుంచి, తనకంటూ ఓ గుర్తింపు వచ్చే "దిశ" ను తనకు నిర్దేశకంగా మార్చుకున్నాడు. అదీ సాకేత్ కు సంబంధించిన వ్యక్తిగత విషయాలు.
* * *
అలా ఎడిటర్ ప్రోద్బలంతో ఆహానగర్ కాలనీలోకి వచ్చాడు. హోటల్ కసకసలో ఉన్న సాకేత్ ప్లాష్ బ్యాక్ లో నుంచి బయటకొచ్చాడు. లోపల ఆకలి పేగులు సామూహికంగా అల్లరి చేస్తున్నాయి.
రిసెప్షనిష్టు మాదురీ కులకర్ణీ దగ్గరికి వచ్చాడు.
"ఇక్కడ తినడానికి దగ్గర్లో ఏదైనా హోటల్ ఉందా?" అని అడిగాడు రిసెప్షనిస్టుని.
"ఈ హోటల్ లోనే "రారా" రెస్టారెంట్ ఉంది.
"రారా రెస్టారెంటా?" ఆశ్చర్యంగా అడిగాడు.
"అవును అది పూర్తిగా వెజిటేరియన్ సెక్షన్. నాన్ వెజ్ కావాలంటే దాని ఎదురుగానే "పోరా" రెస్టారెంట్ ఉంది" చెప్పింది రిసెప్షనిస్టు.
"రారా...పోరా...భలే గమ్మత్తయిన పేర్లు..." అనుకొని మరి "ఏరా:లేదా?" అనడిగాడు వ్యంగ్యంగా.
"అది బార్...రారాకు, పోరాకు మధ్య ఉంటుంది. వోన్లి రాత్రుళ్ళు మాత్రమే పనిచేస్తుంది." నెత్తిమీద జుట్టు పీక్కోవాలనిపించింద
ఎంట్రీలోనే ఈ ఆహానగర్ ఇంత షాకిచ్చిందేమిటి అనుకున్నాడు.
"ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా?" అడిగింది రిసెప్షనిస్టు.
"కావాలి...అది పర్సనల్" అన్నాడు
"పర్సనలా? అయితే అయిదు రూపాయలు చార్జీ అవుతుంది. అదీ లంచ్ టైమ్ లో...హాలులో వెయిట్ చేయాలి. ఆఫీస్ అవర్స్ లో పర్సనల్ విషయాలు మాట్లాడను" అంది.
* * *
రెస్టారెంట్ నుంచి అలా రోడ్డుమీదికి వచ్చాడు. అలా ఓసారి రౌండ్ వేసొద్దాం అని నిర్ణయించుకున్నాడు ముందు ఓ ఇల్లు అద్దెకు తీసుకోవాలి.
బ్రోకర్ ని కలవాలి. లేదా తనే రంగంలోకి దిగాలి. ఆ ఆలోచన రావడంతో రోడ్డున పడి అద్దె ఇళ్ళ వేట మొదలెట్టాడు.
|