Home » » మధ్యవయస్కులలో సెక్స్ సమస్యలు

మధ్యవయస్కులలో సెక్స్ సమస్యలు

సెక్స్ సమస్యలు అన్ని వయసుల వారిలోను కలుగుతాయి. సెక్స్ సమస్యలంటే కేవలం అంగస్తంభన సమస్యలే కాదు సెక్స్ కోరికలు తగ్గడం, శీఘ్రస్ఖలనం ,శృంగారంలో నొప్పి ఇలా అనేకరకాలుగా వుంటాయి. స్త్రీలకు పెళ్లయిన 10,15 సంవత్సరాల తర్వాత శృంగారం అంటే ఆసక్తి పెరుగుతుంది. పెరిగే పిల్లలు వాళ్లను స్కూళ్లకు పంపడం వీటికోసం గృహిణి పొద్దున్నే లేవాల్సి వుంటుంది. అందరూ కాకపోయినా కొందరయినా సాయంత్రం అలసిపోయి ఇంటికొస్తారు.

 

 

రాత్రి శృంగారంలో పాల్గొనాలని భార్య అనుకోవడం, తెల్లవారుజామున పాల్గొంటే బాగుంటుందని భర్త అనుకోవడం ఇలా శృంగార సమయం విషయంలో సమస్యలు తలెత్తుతూ వుంటాయి. మధ్యాహ్నం శృంగారమన్నది ఇద్దరికి కుదరకపోవచ్చు. ఉద్యోగరీత్యా దూరదూరంగా భార్యభర్తలున్నవాళ్ల లో నెలలో నాలుగుసార్లో, రెండుసార్లో, ఒకసారో కలవడం జరుగుతుంది. పెళ్లయిన కొత్తల్లో సుమారు 30 సంవత్సరాల వరకు ఫరవాలేదు కానీ ఆ తరువాత కొత్తలో లాగా ఒకేరోజు శృంగారంలో ఎక్కువసార్లు మగవాళ్ళు పాల్గొనలేకపోవచ్చు. భార్యనుంచి డిమాండ్ లేకపోయినా వుండే ఒక్కరోజైనా ఎక్కువసార్లు ఎంజాయ్ చేద్దామనే ధోరణి భర్తల్లో వుంటుంది. మనసుపై వున్న ఈ డిమాండ్ ఫలితంగా సెక్స్ సామర్ద్యంపై ప్రభావం కలగవచ్చు.

 

ఎదిగే పిల్లల వలన బెడ్ రూంలో ఏకాంతం కూడా తగ్గవచ్చు. పిల్లల చదువుల్లో రాత్రులు ఎక్కువసేపు మెలకువగా వుండడంతో భర్త గదిలోకి వెళ్లడానికి భార్య సిగ్గుపడవచ్చు. అలాగే సంపాదించే వయసు మధ్య వయస్సే కనుక మగవారి లక్ష్యం సంపాదనపైనే వుంటుంది. అర్దం చేసుకునే భార్య వుంటే ఫరవాలేదు కానీ భార్య అర్దం చేసుకోకుండా డిమాండ్ చేస్తే సమస్య కలగవచ్చు. అదేవిధంగా ప్రౌఢావస్థలో భార్యకు సెక్స్ కూడా ముఖ్యమైంది. భార్యనీ, సెక్స్ ని నిర్లక్ష్యం చేస్తే స్త్రీలలో విసుగు, కోపం కలగడం ఆ కోపాన్ని పిల్లలమీద తీర్చుకోవడం వాళ్లను ఎప్పుడూ కొట్టడం ఇలాంటివి సంభవిస్తాయి.

 

అందువలన స్త్రీని తృప్తి పరిచే మార్గాలు తెలుసుకుని అవలంభించడం మగవానికి అవసరము. కొన్నేళ్ళ సంసారం తర్వాత శృంగారంలో స్తభ్దత కూడా సంభవిస్తుంది. వివిధ ప్రదేశాలలో వివిధ సమయాలలో వివిధ భంగిమలలో, సెక్స్ జరుపుకోవడం భార్య కూడా చురుకుగా సెక్స్లో పాల్గొనడం, కనీసం ఏడాదికొకసారైనా భార్యభర్తల శృంగార విహారయాత్ర, శృంగారంలో స్తబ్దతను తగ్గిస్తుంది. మధ్యవయస్కులలో వ్యాధులు, వ్యాధులకు వాడే మందుల ప్రభావం సెక్స్ పై పడుతుంది. యువకుల్లో సాధారణంగా సెక్స్ సమస్యకు కారణం పెర్ఫామెన్స్ యాంగ్జయిటీ. కానీ మధ్య వయస్కులలో శృంగార సమస్యలు శారీరక కారణాలవల్ల కలుగుతాయి. వివాహేతర సంబంధాలున్నవాళ్ళలో సుఖవ్యాధులు, సెక్స్ సమస్యలు కలగడమే కాకుండా ఇంటి దగ్గర కూడా దాని ప్రభావం పడుతుంది. షుగర్, బి. పి. టెస్ట్ చేయ..ించుకోవడం, హార్మోన్ల పరీక్ష, సెక్స్ కౌన్సిలింగ్, చికిత్స వీటి సహాయంతో మధ్య వయస్కులు సెక్స్ సమస్యలు అధిగమించవచ్చు.

google-banner