నేనూ - వచన కవిత్వం - 3

Listen Audio File :

Mallik Audio Telugu Short Stories: Latest Collection of  Telugu Short Stories Comedy Three in One by Teluguone

 

- మల్లిక్

 

నేనూ - వచన కవిత్వం - 3

 

చిన్న పెంకుటిల్లు అది

ఫెన్సింగ్  గేటు తోసుకుని లోపలి వెళ్లి కాలింగ్ బెల్  నొక్కాను. కొన్ని క్షణ తరువాత తలుపు

తెరుచుకుంది.
జులపాల జుట్టుతో శాలువా కప్పుకుని ఉన్న ఆయన తల బయటకి పెట్టి

" ఎవరు కావాలి
కావాలి ఎవరు
ఎవరో  ఒకరంటావా ఆ ఎవరు ఎవరో చెప్పాలి" అన్నాడు. నేను ఠారెత్తిపోయాను  గబగబా 

పరుగెత్తి ప్రక్కకి వెళ్లి ఇంటి నంబర్ చూశాను. చంచల్రావ్ ఇచ్చిన నెంబర్ అదే.

" ఏమిటో  కంగారు చెప్పవా నా బంగారు " గబగబ నా వెనకాలే అతను అతను కూడా

వచ్చి అన్నాడు.
" పిచ్చుమణిగారి ఇల్లు ఇదేనండీ?" కాస్త వణుకుతూ అడిగాను,
" నా కవిత్వ మణి
   కవుల్లో నేను మణి"
ఇంతకీ ఏమిటి నీ పని నా పేరు పిచ్చుమణి " అన్నాడు పిచ్చుమణివచన కవిత్వం చదివే

స్టయిల్లో.
" మీతో పని వుంది నసిగాను.
" లోపలికి రండి.... రండి... రండి లోపలి"

ఇద్దరం వరండాలో కుర్చీలలో కూర్చున్నాం.
" ఏం పని నా పేరు పిచ్చుమణి . ఏంపని నా పేరు పిచ్చుమణి . అన్నాడు పిచ్చుమణి

శాలువా సవరించుకుంటూ ..
నేను చంచాల్రావ్ ఆయనకు రాసిన ఉత్తరం ఇచ్చాను. పిచ్చుమణి ఉత్తరం అంతా చదివాడు.
" ఉత్తరం చూశారు కదండీ... మరీ మీ సహాయం..."" ముందుకు వంగుతూ

కుతూహలంగా అడిగాను.
"ఉండుండు చదవనీ మరోసారి ఉత్తరం, ఉండుండు చదవనీ మరోసారి ఉత్తరం "
" ఎందుకండీ మీరు ఒక్కో వాక్యాన్నీ రెండ్రెండుసార్లు అంటారు?"
" వచన కవులు అంటే నాయన. ఒక్కో వాక్యాన్నీ రెండుసార్లు అంటారు. కవి సమ్మేళనాల్లో

పాల్గొనీ పాల్గొనీ అలా అలవాటైపోతుంది నాయనా"
అలా అని నోటి మీద చెయ్యిపెట్టి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసి గబుక్కున క్రిందకి

వంగి ఎదో తీసుకుని పక్కకి తిరిగి నోట్లో పెట్టుకుని " హిహిహి " అన్నాడు.
బావుండదని నేను మర్యాదకి హిహిహి అన్నాను.
చంచల్రావ్ రాసిన ఉత్తరం మళ్ళీ చదివి హటాత్తుగా కిందపడిపోయాడు పిచ్చుమణి. నాకు

కంగారు పుట్టి క్రిందకి వంగి  చూసి  తేలికగా ఊపిరి పీల్చుకున్నాను.
పిచ్చుమణి గుక్కపట్టి నవుకున్నాడు. అలా ఒక రెండు నిముషాలపాటు నవ్వి గుండెల

మీద చెయ్యి వేసుకున్నాడు. " హబ్బా హమ్మా..భలే జోకేసవయ్యా. కవిత్వ రాయడం

ఒకరు చెప్పాలయ్యా? తోచింది రాసేయడమే "
" ఏదో మీకు అనుభవం ఉంది కదా? కాస్త మెళకువలు నేర్పుతారనీ "
"  అలాగే చెప్తా... అలాగే చెప్తా హ హ హ ...." అని గబుక్కున  క్రిందకి వంగి  ఏదో తీసి

నోట్లో పెట్టుకున్నాడు.
"ఊ... ఇప్పుడు చెప్పు కవిత్వం రాయడం నేర్పాలంటావ్?  రాయడం నేర్పాలాంటావ్?"

" అవునండీ..అవునండీ..."

" చూశావా..చూశావా నా ఎదురుగా కూర్చుంటే నీక్కూడా నా కవిత్వ ధోరణి వచ్చేస్తుంది. హాహాహా...."
" హిహిహి..." నాకు కవిత్వం వస్తుంది అన్న సంతోషంతో నవ్వాను.

" దీన్ని సిగ తరగ.." క్రిందకి వంగి కుర్చీ  క్రింద నుండి ఏదో తీసి నోట్లో పెట్టుకున్నాడు పిచ్చుమణి.

ఏమిటబ్బా ఇతను ఇందాకట్నుంచి క్రింద నుండి ఏదో తీసి నోట్లో పెట్టుకుంటున్నారు. బఠానీల, శనగల..?

" ఏమిటండి ఇందాకట్నుంచి క్రిందనుండి ఏదో తీసి నోట్లో పెట్టుకుంటున్నారు? బఠాణీల ?"   కుతూహలం

పట్టలేక అడిగాను. బఠాణీలు అల క్రింద చల్లి ఏరుకుని తింటే కవులకి మూడ్ వస్తుందేమో తెల్సుకోవద్దు.