Home » » లూబ్రికేషన్

లూబ్రికేషన్

పురుషునికి అంగస్తంభనం సెక్స్ కి సిద్దమైనట్లు తెలియజేస్తుంది. అదేవిధంగా స్త్రీకి లూబ్రికేషన్ శృంగారంలో మొదటి అంశం. కామోద్రేకం కలిగిన స్త్రీ యోనిలో కలిగే మొదటి మార్పు స్రావాలు ఊరడం, తరువాత జరిగేది దాని పొడవు వైశాల్యం పెరగడం, ఏ విధమైన కామోద్రేకం కలగనప్పటికీ 10 నుంచి 30 సెకన్లలో యోని గోడలు స్రావాలు స్రవించడం మొదలు పెడతాయి. మొదట్లో నుదుటిమీద పట్టే చెమట బిందువులన్నీ కలిసి మెరిసే ఒక పొరలాగా యోని గోడలపై కనబడతాయి. ఈ లూబ్రికేషన్ వలన అంగప్రవేశం తేలికగా అవ్వడం, అంగం కదలికల వలన ఇద్దరికీ ఏవిధమైన ఇబ్బందీ లేకపోవడం సంభవిస్తుంది. యోనిలో స్రావాల పరిమాణం ఒక స్త్రీ నుంచి ఇంకో స్త్రీకి మారుతూ వుంటుంది. ఒకే స్త్రీలో కూడా వివిధ సమయాలలో అనేక రకాలుగా వుంటుంది. యుక్తవయసు వచ్చిన స్త్రీలో చిన్నప్పటికన్నా ఈస్ట్రోజెన్ పరిమాణం 8 నుంచి 10 రెట్లు అవుతుంది. దానివలన యోనిలో స్రావాలు ఎక్కువవుతాయి. యోనిని సహజంగా శుభ్రం చేసే ప్రక్రియ ఇది. కొందరిలో యుక్తవయసులో సెక్స్ ఆలోచనలు కలిగినప్పుడు యోనిలో స్రావాలు ఊరతాయి. ఋతుచక్రంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ పరిమాణం మారుతూ వుంటుంది.

 

ఈ హెచ్చుతగ్గులవలన ఋతుచక్రంలోవివిధ సమయాలలో యోనిలో స్రావాలు వివిధ రకాలుగా వుంటాయి. అలాగే గర్భనిరోధక మాత్రలవలన కూడా లూబ్రికేషన్ తక్కువవుతుంది. ప్రసవం తర్వాత కొంతమందిలో లూబ్రికేషన్ తగ్గుతుంది. పాలిచ్చే తల్లులలో కూడా లూబ్రికేషన్ తక్కువవుతుంది. అండాలు రెండూ గర్బసంచితో పాటు తొలగించినవారిలో కూడా లూబ్రికేషన్ తగ్గుతుంది. ముట్లుడిగినవారిలో కూడా ఈస్ట్రోజెన్ లోపం వలన లూబ్రికేషన్ తగ్గుతుంది. ఆడవారిలో మధుమేహ వ్యాధి వున్నవారిలో లూబ్రికేషన్ తగ్గుతుంది. యోనిలో ఇన్ ఫెక్షన్ లున్నప్పుడు యోనిలో స్రావాలు తగ్గుతాయి. స్త్రీకి తగినంత ప్రేరేపణ కలగకపోతే యోనిలో స్రావాలు తగ్గుతాయి. లూబ్రికేషన్ తక్కువగా వున్నవారిలో అత్యధికులలో ఇదే ముఖ్యకారణం.

 

లూబ్రికేషన్ (యోనిలో స్రావాలు) తక్కువగా వుండడానికి ముఖ్యకారణం స్త్రీకి తగినంత కామోద్రేకం కలగకపోవడం. అంగప్రవేశానికి ముందు స్త్రీని తగినంత ప్రేరేపించడం అత్యవసరం. క్లిటోరిస్, చనుమొనలపై ప్రేరేపణ పెంచడం, శరీరంలోని వివిధ భాగాలపై వివిధ రకాలుగా ప్రేరేపించడం, శృంగారానికి సంబంధించిన సంభాషణలు జరపడం, అవసరమైతే పుస్తకాలు చదవడం ఇలాంటివాటి ద్వారా యోని స్రావాలు పెంచవచ్చు. ఫోర్ ప్లే ఎంతసేపు చేసినా లూబ్రికేషన్ కలగనివారు గైనకాలజిస్ట్ తో పరీక్ష చేయించుకుని సెక్స్ కౌన్సిలర్ ని భార్యాభర్తలిద్దరూ కలిస్తే మంచిది.

 

వయసు మళ్లినవారిలో, ప్రసవం తర్వాత పాలిచ్చే తల్లులు, మధుమేహం వున్నవారు, గర్బనిరోధక మాత్రలు వాడేవారు, లూబ్రికెంట్స్ వాడితే మంచిది. లూబ్పికెంట్స్ లో రెండు రకాలు వుంటాయి. వాటర్ బేస్ డ్ జెల్లీలో కే. వై జెల్లీ ముఖ్యమైనది. ఆయిల్ బెస్డ్ జెల్లీలలో వాజలిన్ (వైట్ పెట్రోలియం జెల్లీ), ఆయిల్స్ ముఖ్యమైనవి. కండోమ్ పైన రాయడానికి , మామూలుగా లూబ్పికేషన్ తక్కువ వున్న వాళ్ళు కే- వై జెల్లీ వాడితే మంచిది. కానీ కే- వై జెల్లీ వీర్యకణాల కదలికను తగ్గిస్తాయి. కనుక పిల్లలు కావాలనుకునేవారు ఆయిల్ బేస్డ్ జెల్లీలు వాడితే మంచిది. కండోమ్ పైన ఆయిల్ బేస్డ్ జెల్లీ వాడకూడదు. వాడితే కండోమ్ కు చిల్లులు పడతాయి. వాటర్ బేస్డ్ జెల్లీలలో నానోగ్జినాల్ - 9 కలిసినవి అమెరికాలో దొరుకుతున్నాయి. ఇవి స్పెర్మిసైడ్ గా, లూబ్రికెంట్ గానే కాక వైరస్ ని చంపడం ద్వారా సుఖవ్యాధుల వ్యాప్తి నిరోధిస్తాయి. కండోమ్ పైన వాడడానికి కూడా మంచివి.

 

ఇలాంటివి మనదేశంలో దొరికితే మంచిది. లూబ్రికేషన్ తక్కువ వున్నవాళ్లకు కొందరు ఈస్ట్రోజన్ కలిసిన జెల్లీలు వాడమని సలహా ఇస్తారు. ఈస్ట్రోజన్ కలిసిన జెల్లీ రతికి ముందు పూసుకున్న వారి పార్టనర్ లకు అంగం చర్మం ద్వారా ఈస్ట్రోజన్ శరీరంలోకి ప్రవేశించి వక్షోజాలు పెరగడం లాంటివి సంభవిస్తాయి. అలాంటివి వాడేవారు రతికి ముందు కాకుండా మరో సమయంలో పూసుకోవాలి. అంతకంటే ఈస్ట్రోజెన్ తక్కువగా వున్నవాళ్ళు డాక్టర్ సలహాతో ఈస్ట్రోజన్ పిల్ వాడాలి. దాంతోపాటు కే- వై జెల్లీ వాడితే మంచిది. ఆరోగ్యవంతులైన స్త్రీలలో కొందరిలో సహజంగానే యోనిలో స్రావాలు అధికంగా వుంటాయి. లూబ్రికేషన్ ఎక్కువైనందువల్ల తగినంత ఒరిపిడి లేక ఇద్దరికీ ఇబ్బందిగా వుండవచ్చు. యోనిలో ఇన్ ఫెక్షన్లలో, బార్తోలిన్ గ్రంధి, వాపు, స్కీనీస్ గ్రంధివాపు, గర్భాశయం ముఖద్వారానికి చెందిన వ్యాధులలో యోని స్రావాలు పెరుగుతాయి. ఇలాంటివారు గైనకాలజిస్ట్ కి చూపించుకుని చికిత్స తీసుకోవాలి. ఆ తర్వాత వ్యాధులు లేనివారిలో గుడ్డతో లేదా దూదితో అంగప్రవేశానికి ముందు తుడుచుకుంటే మంచిది. లేదా మధ్యమధ్యలో అంగాన్నిబయటకు తీసి తుడుచుకోవాలి. అంగప్రవేశానికి ముందే మొత్తం యోనిని తుడుచుకుంటే స్రావాలు బొత్తిగా తగ్గి రతిలో ఇద్దరికీ అసౌకర్యంగా వుంటుంది.

google-banner