Rating:             Avg Rating:       985 Ratings (Avg 2.99)

హలో... రాంగ్ నెంబర్.! - 77

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 77

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

స్టెలీనా యింటికి వెళ్ళేసరికి ఆ యింటిముందు మరొక కారు కనిపించింది. ఆ కారు ఎవరిదో అర్థంకాలేదు. ఓ పక్కగా కారుని పార్క్ చేసి గుమ్మం దగ్గరకి వచ్చి, ఒక్కక్షణం ఆగిపోయాడు.

లోపల్నుంచి మాటలు వినిపిస్తున్నాయి.

స్టెలీనా గొంతుతోపాటు మరో పురుషుడు గొంతూ వుంది. మెల్లిగా కిటికీ డోర్ ని కొద్దిగా పక్కకు జరిపాడు.

లోపల ఎవరితోనో ఆర్గ్యూ చేస్తోంది.

వాళ్ళ సంభాషణని బట్టి అతను స్టెలీనా మాజీ భర్త అని అర్థమైంది.

"ప్లీజ్ స్టెలీనా...నన్ను అర్థం చేసుకో. ఒకప్పుడు నేను క్రూడ్ గా ప్రవర్తించాను. నీ విషయంలో చాలా తప్పులు చేసాను. అది నా తప్పే. ప్లీజ్ ఫర్ గివ్ మీ....ఇప్పుడు మారాను...నన్ను నమ్ము. డబ్బుకోసం నా రెండో భార్య నన్ను మోసం చేసింది. నా ప్రాపర్టీస్ మొత్తం తన పేరు మీద ట్రాన్స్ ఫర్ చేసుకుంది" అతను స్టెలీనాను ప్రాధేయపడుతున్నాడు.

"ప్రాపర్టీస్ పోయాయని నీకిప్పుడు ఆ రెండో భార్య లేదని నిన్ను మళ్ళీ పెళ్ళి చేసుకోవాలా?" స్టెలీనా గొంతులో అసహనం.

"ప్లీజ్ స్టెలీనా...మనం హేపీగా వుందాం."

"కానీ నేను నీతో హేపీగా వుండలేను. ఒక్కసారి తెగిపోయిన మన బంధాన్ని మళ్ళీమళ్ళీ అతికించుకోవాలనే ప్రయత్నం వద్దు. నేనందుకు ప్రిపెర్డ్ గా లేను. ప్లీజ్ లీవ్ మీ ఎలోన్..."

"స్టెలీనా! నువ్వు నన్ను కాదంటే చచ్చిపోతాను" అతను మరింతగా ప్రాధేయపడుతున్నాడు.

స్టెలీనా కన్విన్స్ కాలేకపోతూంది.

అతను చివరకి ఓ మెట్టు కిందికి దిగి, ఆమె కాళ్ళ మీద పడి ప్రాధేయపడడానికి సిద్ధపడ్డాడు.

శ్రీకర్ కు తాను అక్కడ ఉండవలసిన అవసరం లేదనిపించింది. నిశ్శబ్దంగా బయటకు వచ్చాడు. కారు బయటకు తీసాడు.

సరిగ్గా పావుగంట తర్వాత అతనికి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కాల స్టెలీనాది.

"హలో..." అన్నాడు సెండ్ బటన్ నొక్కి.

"మీకోసం ఎదుర్చూస్తే రాలేదేమిటి...ఆన్ ద వేలో వున్నారా? ట్రాఫిక్ జామా?" అటువైపు నుంచి స్టెలీనా అడిగింది. "కాదు...నీ లైఫ్ ని జామ్ చేయడం యిష్టం లేకపోయింది స్టెలీనా"

"వ్వా...ట్"

"అవును. నేను ఇరవై నిమిషాల క్రితమే మీ యింటికి వచ్చాను"

"వ...చ్చా..రా..." స్టెలీనా గొంతులో చిన్నపాటి వణుకు."

వచ్చాను స్టెలీనా...అనుకోకుండా, నీ అనుమతి లేకుండా మీ సంభాషణ విన్నాను"

"అది నిజమని...ఆ మనిషి మారాడని, అతను మాట్లాడాడని నేను నా మనస్సును ఎప్పుడు పడితే అప్పుడు మార్చుకొని అతనితో వుండిపోవాలంటారా?"

"ఆ విషయంలో నేను ఏ విధమైన సలహా ఇవ్వలేను. అది పూర్తిగా నీ వ్యక్తిగత విషయం."

"అంటే?"

"నాకు ఒక్కటే అనిపిస్తోంది. నువ్వు నీ మాజీ భర్తతో వుండాలో, వద్దో, నేను చెప్పను కానీ ఎవరో ఒకరు నీకు తోడుగా వుండాయి. ఆ తోడు నీకు సెక్యూర్డ్ ఫీలింగ్ ని కలుగజేయాలి"

"అందుకని...అందుకని నన్ను ఏం చేయమంటారు?"