Rating:             Avg Rating:       842 Ratings (Avg 3.01)

హలో... రాంగ్ నెంబర్.! - 76

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 76

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

స్టెలీనా ఎదురుచూస్తోంది. శ్రీకర్ కచ్చితంగా వస్తాడని ఆమె నమ్మకం. అతనితో స్పెండ్ చేయడం ఆమెకు చాలా యిష్టమైన విషయం ఆమె శరీరంలో ప్రకంపనలు. ఆమె పెదవుల మీద విరహపు స్వేదం. హ్యాండ్ బ్యాగ్ లోని సెల్ తీసి మరోసారి ఫోన్ చేసింది శ్రీకర్ కు.

*            *           *

బబ్లూ దీక్షగా సీరియల్స్ చూస్తున్నాడు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మరాఠీ లాంటి అన్ని భాషల టీవీ ఛానల్స్ ని భాషాభేదం లేకుండా, సర్వమానవ సౌభ్రాతృత్వం పాటించే రేంజ్ లో చూస్తున్నాడు.

ఏడుపు, నవ్వు, కోపం లాంటి రకరకాల ఫీలింగ్స్ వాడికి కలుగుతున్నాయి. అతనిలో రకరకాల ఐడియాలు, వికవికాల ఆలోచనలు...టీవీ సీరియల్స్ లో నటించే ఆర్టిస్టుల ఫేసులను గుర్తుతేచ్చుకున్నాడు.

అతనికిప్పుడు జీడిపాకం అంటే ఏమిటో తెలిసింది. ప్రేక్షకులను ఏడుపు సీరియల్స్ తీసి ఎలా నవ్వించొచ్చో, కామెడీ సీరియల్స్ తీసి ఎలా ఏడిపించొచ్చో, హారర్ సీరియల్స్ తో అబ్బబ్బబ్బ...అని ఎలా అనిపించవచ్చో అర్థమైంది.

అప్పుడే చాకులాంటి ఐడియా ప్లాషయింది. చిన్న బ్రెయిన్ లో కొత్త ప్యూజు పుట్టుకొచ్చింది. దాని ఫలితమే వాడో నిర్ణయానికి వచ్చేలా చేసింది.

బాబ్లూకు హఠాత్తుగా ఓ కోరిక పుట్టింది. అలాంటిలాంటి కోరిక కాదు. తను...తను...తను...అది తలుచుకుంటుంటేనే అతనికి ఉద్వేగం తన్నుకొచ్చేస్తోంది. తను సీరియల్ రైటర్ అయిపోవాలి. అట్టాంటిట్టాంటి రైటర్ కాదు.

మెగా మెగా మెగా ఎపిసోడ్ల డైరెక్టర్ అయిపోవాలి. మహాభారతం, రామాయణం మించిపోయే అంత పే...ద్ద సీరియల్ రాయాలి.

బాబ్లూకు ఇప్పుడు పిచ్చ హేపీగా ఉంది. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, పాటలు, వీలైతే సంగీతం దర్శకత్వం, నటన అన్నీ కూడా బుల్లితెర మీద పదిలైన్లకు తగ్గకుండా టైటిల్ కార్డు లేదా కార్ద్సు వేయించుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసాడు.

*              *             *

ఎంత కాన్ సెంట్రేషన్ గా డ్రైవ్ చేస్తున్నప్పటికీ డిస్టర్బ్ అవుతున్నాడు శ్రీకర్. తనకు పరిచయం అయిన ఒక్కో అమ్మాయి గుర్తొస్తూంది. శ్వేత, మీనా, వాసంతి, అక్షిత...షాలిని...ఇలా ఎంతమంది పరిచయం అయ్యేరు.

తనని మొదటి చూపులోనే ఎట్రాక్ట్ చేసిన వాళ్ళు కొందరైతే, తన వైపు ఎట్రాక్ట్ అయినవాళ్లు మరికొందరు. ఎన్ని పరిచయాలు, ఈని సాయంత్రాలు వాళ్ళతో స్పెండ్ చేయలేదు. ఎన్ని రాత్రిళ్ళు వాళ్ళ అందమైన శరీరాలను తను శృతి చేయలేదు.

అయినా అతనిలో ఏదో ఫీలింగ్. ఈ ఫీలింగ్ కలగడానికి కారణమేమిటి? ప్రియంవదతో పందెమా? అతనికా క్షణం ప్రియంవద గుర్తొచ్చింది. ఆమె మాటలూ  గుర్తొచ్చాయి.

తను ఎందరితో స్పెండ్ చేసినా, తన భార్యతో గడిపిన సమయం మాత్రం స్పెషల్ గా అనిపిస్తుంది. ఆ పెదవులు, ఆ బుగ్గలు అమాయకమైన మొహం, అప్పుడప్పుడు కనిపించే సరదాధిక్కారం...అందంగా కనిపించే కళ్ళజోడు, ముఖ్యంగా ఆ టైంలో కోపరేషన్.

ఏమిటి తనకెందుకిలా అనిపిస్తోంది. తనకు హఠాత్తుగా జ్ఞానోదయమైందా? ఛ...ఛ...తనేమిటి ఇలా ఆలోచిస్తున్నాడు?

సరిగ్గా అప్పుడే అతని మోబిటెల్ రింగయింది. డిస్ ప్లేలో నంబర్ చూసాడు. ఆ నెంబర్ ఎవరిదీ? అని ఆలోచిస్తున్నాడు. తనకు తెలిసిన నెంబర్ లానే వుంది. అతని మెమరీ పనిచేయడం ప్రారంభించింది. ఒక్కో పేరు...ఒక్కక్షణంలోనే అతని పెదవుల మీదికి ఆ పేరు వచ్చేసింది.

స్టె...లీ...నా...

అప్పటికే స్టెలీనా చాలా సార్లు ఫోన్ చేసింది. తనే కొన్నిసార్లు ఆఫ్ చేసాడు. మరికొన్ని సార్లు 'ఆన్ ది వే' లో వున్నానని చెప్పాడు. వెంటనే సెండ్ బటన్ నొక్కి "హాయ్ స్టెలీనా! హౌ ఆర్యూ?" అన్నాడు.

"అయామ్ ఫైన్...మీరేమిటి అటెండెన్స్ లేకుండా ఫీల్డ్ అవుట్ లో వునారు?" అటు వైపు నుంచి స్టెలీనా గొంతులో హస్కీనెస్ వినిపిస్తోంది.

"కాస్త బిజీగా వున్నాను...మళ్ళీ కలుద్దామా?"

"ఊహూ...ఇప్పుడే కలుద్దాం...అన్నట్టు నీకోసం బర్త్ డే సూట్ కూడా రెడీ చేసుకున్నాను"

ఆ మాటలు వినగానే అతనిలో చిన్నపాటి ఉద్వేగం కలిగింది. స్టెలీనా చాలా అందంగా వుంటుంది. అంతకన్నా అందంగా ప్రవర్తిస్తుందా సమయంలో. కానీ, తనిప్పుడు జెన్నిఫర్ ని కలవాలి?

"ఏమిటి ఆలోచిస్తున్నారు...ఎలా తప్పించుకోవాలనా?"

"ఊహూ...నీతో ఎలా స్పెండ్ చేయాలా? అని..."

"అయితే ఇంకెందుకు ఆలస్యం...వచ్చేయండి..."

"బట్ స్టెలీనా...చిన్న పని..వెరీ అర్జెంట్..."

"కమాన్ శ్రీ...మీకు అమ్మాయిలతో అస్సయిన్ మెంట్ కన్నా వేరే అర్జంట్ అస్సయిన్ మెంట్ ఏముంటుంది?" స్టెలీనా గొంతులో అదే హస్కీ నెస్.

ఒక్కక్షణం ఒకరకమైన ఫీలింగ్ అతన్ని ఆక్రమించింది. అంటే తనని ఉమనైజర్ లా ట్రీట్ చేస్తోందా స్టెలీనా?

"హలో...నాతో మాట్లాడుతూ మరో అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారా?"

"లేదు..లేదు...సరే, కాసేపట్లో అక్కడ ఉంటాను" చెప్పి ఫోన్ కట చేసాడు.

స్టెలీనామాటలు అతడ్ని ఆత్మ విమర్శకు లోను చేసాయి. ఆమె ఉద్దేశం తనని ఉమనైజర్ అనడం కాకున్నా, నిజంగా తనకు అమ్మాయిల కన్నా ముఖ్యమైన అస్సయిన్ మెంట్ ఏమీ ఉండవు.

అలా ఆలోచిస్తూనే అతను స్టెలీనా ఇంటివైపు బయల్దేరాడు.

*            *           *