TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
హలో... రాంగ్ నెంబర్.! - 70
ముచ్చర్ల రజనీ శకుంతల
అక్షిత అర్జంటుగా రమ్మని ఫోన్ చేసింది. తనకి పెళ్ళి ఫిక్సయిందిట. ఒక్కక్షణం అతనికి అర్థం కాని ఫీలింగ్ కలిగింది. కారు డ్రైవ్ చేస్తూండగానే మోబిటెల్ రింగయింది.
"హలో" అన్నాడు శ్రీకర్.
"నేను జెన్నిఫర్ ని. నేను యిప్పుడు ఫ్రీ..రాగలరా?" అని అడిగింది.
"సారీ....యింపార్టెంట్ వర్క్ ఒకటుంది" చెప్పాడు శ్రీకర్.
"నో ప్రాబ్లెమ్. రాతి ఎయిట్ కల్లా వచ్చేయండి" చెప్పి ఫోన్ కట్ చేసింది జెన్నిఫర్.
శ్రీకర్ కు ఏం చేయాలో తోచలేదు. తన ముందు రెండు అవకాశాలు వున్నాయి. దేనిని ఉపయోగించుకోవాలో అర్థం కాడవం లేదు.
* * *
కారు అక్షిత యింటి ముందు ఆగింది.
ఇంట్లో అక్షిత తప్ప ఎవ్వరూ లేరు. శ్రీకర్ హాలులో సోఫాలో కూచుని వున్న అక్షిత వంక చూసాడు. ఆమె మొహంలో చిన్న రిలీఫ్ కనిపించింది.
"వచ్చారా..రండి" అంది అతనికి ఎదురెళ్ళి అక్షిత.
ఆమె భుజం చుట్టూ చేయి వేసి "ఏమిటి హుషారుగా వున్నావు. పెళ్ళి ఫిక్సయిందనా?"
"ఇది వరకటి పెళ్ళికొడుకుల్లా కాకుండా, ఇప్పుడొచ్చినతను కట్నం ప్రసక్తి పెద్దగా ఎత్తలేదు. మీ యిష్టం అన్నాడు. కట్నం డిమాండ్ చేసే వాడికన్నా, మీ యిష్టం
అన్నవాడు కొంత బెటర్ కదా"
"అవునవును అసలు కట్నమే వద్దనే వాడైతే యింకా బావుంటుంది కదా" శ్రీకర్ నవ్వుతూ అన్నాడు.
"చిన్న గీత లేదని బాధపడ్డం కన్నా, ఆ పెద్దగీత ముందు ఇంకా పెద్ద గీత గీసి, సంతృప్తి పడ్డమే బెటర్" అంది అక్షిత.
"మీ ఆడవాళ్ళు అడ్జస్ట్ అవ్వడంలో గొప్ప వాళ్ళు కదూ"
"అడ్జస్ట్ అవ్వడానికి ఆడా, మగా తేడా లేదు. అవసరం, పరిస్థితి" అంది అక్షిత.
శ్రీకర్ అక్షిత వంక పరిశీలనగా చూసాడు. తనతో పరిచయం అయినప్పటికీ, ఇప్పటికీ అక్షితలో చాలా మార్పు వచ్చింది. అదే విషయం అక్షితతో చెప్పాడు.
"ఏ విషయంలో? ప్రవర్తనలోనా..పర్సనాలిటీ లోనా?" అడిగింది.
"అన్నింట్లో" చెప్పి, ఆమెను బెడ్రూం వైపు నడిపించాడు.
* * *
"బహుశా ఇది మన చివరి కలయికేనేమో" అంది అక్షిత.
"ఏం..."
"అవును. రేపు నిశ్చితార్థం. రేపట్నుంచీ నేను మరొకరి భార్యకిందే లెక్క. ఆ తర్వాత మీరూ...నేనూ..." ఒక్కక్షణం ఆమె ఉద్వేగంతో కదిలిపోయింది.
"అక్షితా"
"నాకు ఏడుపొచ్చేస్తోంది. నిజంగా ఏడుపొచ్చేస్తోంది. ఓ ఆడపిల్లగా...అదీ సగటు మధ్యతరగతి ఆడపిల్లగా హద్దులు దాటానా? ఏమో నాలో కసి..కట్నం యిచ్చి
అబ్బాయిల్ని కొనుక్కోవాలి..అందుకు సవాలక్ష ప్రశ్నలు ఎంక్వయిరీలు..అవసరమైతే వర్జినితీ టెస్టులూ..ఐ హేటిట్. అందుకే నాలో కసి...రెండో పెల్లివాడు కూడా
చూపులతో గుచ్చి గుచ్చి "నువ్వు వర్జిన్ వా?" అన్నట్టు చూస్తాడు."
శ్రీకర్ ఆమె చెప్పేది వింటున్నాడు. ఆమె మాటల్లోని తీవ్రత అతనికి అర్థమవుతోంది.
"అందుకే నేను డబ్బులిచ్చి మొగుడ్ని కొనుక్కునే ముందు, డబ్బు సంపాదించేందుకు ఓ మొగుడ్ని సెలక్ట్ చేసుకున్నాను. ఇది తప్పా, ఒప్పా అన్న ఆలోచన చేయలేదు.
నన్ను చూడ్డానికి వచ్చిన మగాళ్ళలో చాలామంది పెళ్ళయిన వాళ్ళు. నాకన్నా, నేను కట్నంగా యిచ్చే డబ్బే వాళ్ళకు పవిత్రంగా కనిపిస్తుంది. నేను పవిత్రంగా
లేకపోయినా పర్లేదు.
ఇప్పుడు 'ఎంత కట్నం యిచ్చినా పర్లేదు' అనే మగాడు నన్ను పెళ్ళి చేసుకోవడానికి వచ్చాడు. ఈ రోజుతో పాత అక్షిత పాత్ర ముగిసిపోతుంది. కొత్త అక్షితగా, ఓ భార్యగా
జీవితం మొదలు పెడతాను. ఇన్నాళ్ళూ నన్ను ఆదరించి, నా పెళ్ళికి కావాల్సిన డబ్బును సమకూర్చిన ఈ రోల్..." అంటూ శ్రీకర్ గుండెల్లో తలపెట్టి అంది "ఇక నాకు
గుర్తుండదు"
ఒక చిన్న ప్రకంపనం..ఒక చిన్న షాక్...అతడి మనసుకు తగిలింది.
అక్షిత మంచమ్మీద వెల్లకిలా పడుకుంది.
"ఈరోజు మీది...ఈ అక్షిత ఈరోజంతా మీతోనే వుంటుంది. నాకెంతో సాయం చేసారు. నిజం చెప్పాలంటే పెళ్లయ్యేక కూడా నా భర్త ఇంత అపురూపంగా
చూసుకుంటాడో...లేదో...మీ రుణం ఈ విధంగా, ఈరోజుతో తీర్చేసుకుంటాను." రెండు చేతులు చాచి అతడ్ని ఆహ్వానించింది.
శ్రీకర్ తల విదిల్చాడు. అక్షిత చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు. ఆమె నుదురు మీద ముద్దుపెట్టాడు.
"చాలు అక్షితా...ఇట్స్ ఎనఫ్..విష్ యూ హేపీ మ్యారీడ్ లైఫ్...అడ్వాన్స్ గా" అంటూ బ్రీఫ్ కేసులో వున్న చెక్ బుక్ తీసాడు. చెక్ మీద అమౌంట్ రాసి సంతకం చేసి
అక్షితకు యిచ్చాడు.
"ఇది కూకట్ పల్లిలో నీకోసం తీసుకున్న ఫ్లాట్ ఖరీదు కు చెక్. రేపే వెళ్ళి అమౌంట్ పెచెయ్. ఇది నా గుర్తుగా నీకిస్తున్న గిఫ్ట్. ఎప్పుడైనా నేను జ్ఞాపకం వస్తే ఓ ప్లెజెంట్
ఫీలింగ్ నీకు కలగాలి...బై"
"అదేమిటి...వెళ్ళిపోతున్నారు?"
"వెళ్ళిపోక తప్పదు అక్షితా. గిల్టీ ఫీలింగ్. ఓ విధంగా నేను 'మంచి చెడ్డవాడి'గా నామీద నేనే స్టాంప్ వేసుకున్నాను. నీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు."
అక్షితకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తుదా?
"అక్షితా...చివరిసారిగా...."
"చివరిసారిగా...చెప్పండి...మీకేం కావాలి. మీక్కావాల్సింది ఏదైనా యివ్వడానికి రెడీ" ఆమె మనస్పూర్తిగానే అంది.
"మనం ఫస్ట్ టైం కలుసుకున్నాం చూడు...ఆ రెస్టారెంట్ కు వెళ్దాం. ఫస్ట్ టైం ఏమేం తిన్నామో...అవే తిందాం. ఆ తర్వాత ఫస్ట్ టైమ్ లానే కాఫీ ఒకటి బ్యాలెన్స్ ఉంచేద్దాం.
వెళ్దామా"
అక్షిత అమ్మాయితో పరిచయానికి ఆ విధంగా వీడ్కోలు చెప్పాడు.
* * *
|