TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
హలో... రాంగ్ నెంబర్.! - 68
ముచ్చర్ల రజనీ శకుంతల
"గొంతు హస్కీగా వుంటుందా...ఏమో విస్కీ ఎక్కువగా తీసుకుంటానుగా...అందుకే హస్కీగా వుంటుందేమొ?" అంది జెన్నిఫర్.
శ్రీకర్ కు ఫైర్ ప్లేస్ పక్కనే కూచున్న ఫీలింగ్ కలిగింది.
సరిగ్గా అదే సమయంలో .........
* * *
జేమ్స్ బాండ్ జెన్నీఫర్ రూమ్ వెనుక వైపు వచ్చాడు. అటువైపు విండో గ్లాసు వున్నాయి. ఎలాగైనా శ్రీకర్ ని రెడ్ హ్యాండ్ డ్ గా పట్టుకోవాలన్న పంతంలో వున్నాడు. విండో గ్లాసు నుంచి లోపలికి చూడలేకపోతున్నాడు. విండోగ్లాసెస్ లోపలి వైపు కర్టెన్ వుండడమే అందమైన కారణం. అతని కోటు జేబులో కెమెరా వుంది. మెడలో క్యులర్స్ వున్నాయి. అయినా అవి తనకి ప్రస్తుతానికి ఉపయోగపడ్డం లేదు.
శ్రీకర్ జెన్నిఫర్ భుజమ్మీద చేయి వేయబోయి ఆగాడు. గ్లాసు విండోస్ నుంచి అతనికి నీడ స్పష్టంగా కనిపిస్తూంది. జెన్నిఫర్ కు అనుమానం రాకుండా యధాలాపంగా వెళ్ళినట్టు లేచి అటువైపు వెళ్ళాడు.
జెన్నిఫర్ "వాట్ హ్యాపెండ్?" అని అడిగింది.
"నథింగ్...ఏమీ లేదు" అంటూ కర్టెన్ లాగాడు. అప్పుడు ఓ నీడ పక్కకు తప్పుకుంది.
శ్రీకర్ లో చిన్న అనుమానం. ఒక్కసారి అనుమానం అంటూ వచ్చేక దాన్ని క్లారిఫై చేసుకోవాలన్నది శ్రీకర్ తత్వం.
వెంటనే జెన్నిఫర్ వైపు తిరిగి "వన్ సెకన్" అంటూ బయటకు నడిచాడు.
* * *
జెన్నిఫర్ రూమ్ కు కాస్త దూరంగా ఓ వ్యక్తి తననే అబ్జర్వ్ చేస్తూ వుండడం గమనించాడు.
అతడ్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది. కానీ ఎక్కడ చూసాడో గుర్తుకు రావడం లేదు. అతని గెటప్ కూడా వింతగా వుంది.
శ్రీకర్ అతని వైపు చూస్తూనే జెన్నిఫర్ రూమ్ లోకి వెళ్ళాడు. వెళ్ళినట్టే వెళ్ళి, వెంటనే బయటకు వచ్చాడు.
శ్రీకర్ వెంటనే బయటకు వస్తాడని తెలియని జేమ్స్ బాండ్ రూమ్ దగ్గరకి వెళ్ళాడు. శ్రీకర్ వెంటనే బయటకు రావడంతో గిరుక్కున వెనక్కి తిరిగాడు.
* * *
"ఏమైంది ఏమిటా కంగారు?" అడిగింది జెన్నిఫర్. శ్రీకర్ పదే పదే చుట్టూ చూద్దాం, బయటకు వెళ్ళి రావడం గమనించి
"ఏం లేదు..." చెప్పాడు శ్రీకర్.
"సరే...లైట్ ఆఫ్ చేయనా?" అంది జెన్నిఫర్.
"నో...నో..నాట్ నౌ" అన్నాడు శ్రీకర్. అతని మూడ్ డిస్టర్బ్ అయింది. తననెవరో వాచ్ చేస్తున్నారని అర్థమైంది.
"ఏమైందసలు మీకు...ఆర్యూ ఆల్ రైట్" అడిగింది జెన్నిఫర్.
"అయామ్ ఆల్ రైట్..కొద్దిగా హెడ్డేక్. రేపు కలుద్దాం! గుడ్ నైట్" చెప్పి బయటకు వచ్చాడు.
కారులో యింటికి వెళ్తోంటే. తన కారుని ఇందాక హోటల్ లో కనిపించిన వ్యక్తి బైక్ మీద ఫాలో చేయడం గమనించాడు.
అతనికి ఓ విషయం అర్థమైంది. అతను ఖచ్చితంగా తనని ఫాలో చేస్తున్నాడు. తన అంచనా తప్పు కాకపోతే, ఆ వ్యక్తి ప్రియంవద నియమించిన డిటెక్టివ్ కావచ్చు.
శ్రీకర్ యింటికి వచ్చేసరికి ప్రియంవద హాలులో కూచుని వుంది.
శ్రీకర్ లోపలికి రాగానే "ఎక్కడ్నుంచి వస్తున్నారు?" అని అడిగింది.
శ్రీకర్ ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పబోయేలోగా ప్రియంవద మోబిటెల్ మోగింది.
ప్రియంవద డిస్ ప్లేలో ఆ నెంబర్ చూసి కంగారు పడిపోయింది. ఆ నెంబర్ జేమ్స్ బాండ్ ది.
"ఆ...ఏమిటి కమలా...ఎలా వున్నావు..నేనే...ఇప్పుడే మా వారొచ్చారు. తర్వాత చేయవే" అంటూ ఫోన్ కాల్ కట్ చేసింది.
శ్రీకర్ బెడ్ రూమ్ వైపు నడిచాడు.
* * *
|