TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
హలో... రాంగ్ నెంబర్.! - 67
ముచ్చర్ల రజనీ శకుంతల
ఒక్కక్షణం శ్రీకర్ చెప్పింది అర్థం కాలేదు లూసీకి.
"ఏంటి సార్..." మరోసారి రెట్టించి అడిగింది.
"ఓ అమ్మాయితో అపాయింట్ మెంట్..రాత్రి ఎనిమిది గంటలకు. కలవాల్సిన వ్యక్తి పేరు జెన్నిఫర్...పర్పస్..." అని ఒక్కక్షణం లూసీ వంక చూసి చెప్పాడు శ్రీకర్" పర్సనల్"
లూసీకి అర్థమైంది. ఆ తర్వాత మరేమీ మాట్లాడలేదు.
"జెలసీ ఫీలవుతున్నావా లూసీ" అడిగాడు శ్రీకర్.
"జేలసీనా? ఎందుకు?"
"ఓ అమ్మాయిని కలవడానికి వెళ్తున్నానని..."
"అది మీ పర్సనల్ మ్యాటర్. ప్రపంచంలో ఎంతోమంది పర్సనల్ లైఫ్ మెయింటెయిన్ చేస్తారు. వాళ్ళందరి గురించి నేనెందుకు జెలసీ ఫీలవుతున్నాను?"
"అంటే..ప్రపంచంలోని ఎంతోమందిలో నేను ఒకడినా?"
లూసీకి ఉక్రోషంలో తనేం మాట్లాడిందో అర్థమైంది.
"నా వుద్దేశం...ఒకరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని..."
"అందరి విషయాల్లో అని నేనడం లేదు. నా విషయంలో..." ఆమె వుద్దేశం అర్థమైందా అన్నాడు శ్రీకర్.
"ప్రతీ మనిషికి ఒక సొంత ప్రపంచం వుంటుంది. ఆ ప్రపంచానికి ఎవ్వరూ ప్రవేశించకూడదు...ఎంత గొప్ప రిలేషన్ వున్నప్పటికీ ..."
శ్రీకర్ కు ఆమె వుద్దేశం అర్థమైంది. అతనికి నచ్చింది.
"అందుకే నువ్వంటే నాకిష్టం లూసీ" చెప్పాడు శ్రీకర్ సిన్సియర్ గానే.
దాన్ని ఓ కాంప్లిమెంట్ గా మాత్రమే స్వీకరించి "థాంక్యూ" అంది లూసీ.
* * *
ఎనిమిది గంటలకు జెన్నిఫర్ ని కలుసుకున్నాడు శ్రీకర్.
ఆమె ఒంటి నుంచి వచ్చే యింపోర్టెడ్ పెర్ ఫ్యూమ్ అతడ్ని వివశుడ్ని చేస్తోంది.
"కరెక్ట్ టైమ్ కు వచ్చారు" అంది జెన్నిఫర్.
"నేనెప్పుడూ అంతే..ముఖ్యంగా అమ్మాయిల విషయంలో" చెప్పాడు శ్రీకర్.
జెన్నిఫర్ షార్ట్స్ లో వుంది. చాలా టెంప్టింగా వుంది. ఆమె కాలు మీద కాలు వేసుకుని కూచునే విధానం, రెండు చేతులనూ ఒకేసారి పైకి లేపుతూ, ఒళ్ళు విరుచుకునే పద్ధతి చాలా ప్రావోకేటింగ్ గా వుంది.
"వైన్ తీసుకుంటారా?" అడిగింది జెన్నిఫర్.
"నాకు అలవాటు లేదు" చెప్పాడు శ్రీకర్.
"వ్వాట్..వైన్ అలవాటు లేదా...అది ఆల్కహాల్ కాదు"
"అది ఏదైనా సరే...నేను తీసుకోను"
"బీర్ కూడా...?"
"బీర్ వాసన కూడా పీల్చను" చెప్పాడు శ్రీకర్.
"స్టేట్స్ లో ఓ ఇండియన్ ఫ్రెండ్ పరిచయం అయింది. తనోసారి నా ప్లాట్ కి వచ్చింది. నాకు విస్కీ, రమ్ లాంటివి టేస్ట్ చేయాలని వుంది. మా ఆయన తాగుతున్నప్పుడు నాకూ తాగాలని అనిపిస్తోంది. కానీ, నేనూ తాగుతానని అంటే, ఆయన అపార్థం చేసుకుంటాడని, మరోలా అనుకుంటాడని భయం అంది."
"అలాగా....అయితే ఆ తర్వాతేమైంది"
"కొద్దిగా టేస్ట్ చేయమన్నాను. తను మహా మొహమాటపడింది."
"చివరికేమైంది?"
"ఫ్రిజ్ లో పెట్టిన బీర్ బాటిల్స్ మాయం అవ్వడం మొదలయ్యాయి. వారం రోజుల్లో రెగ్యులర్ గా తాగే నన్నే మించిపోయింది. తాగినప్పుడు వాళ్ళాయన్ని తెగ తిట్టిపోసేది...ఇండియా వెళ్ళేక, ఆయన ఆఫీసుకు వెళ్ళేక అప్పుడప్పుడు తాగుతానని చెప్పింది"
"ఇప్పుడా ఫ్రెండ్ ఎక్కడుంది"
"ఏం మీరు లైన్ లో పెడతారా?"
"ఛ...ఛ...నా వుద్దేశం అది కాదు. నాకు మా ఆవిడ గుర్తొచ్చింది. అప్పుడప్పుడు 'ఏమండీ కలసి మందుకొడితే భలే థ్రిల్ గా వుంటుంది' అని అంటుంది. ఆ విషయం గుర్తొచ్చింది."
జెన్నిఫర్ అతని పక్కన కూచుంది. ఆమె స్లీవ్ స్ లో వుంది. ఆమె భుజాల నునుపు అతని భుజాలకు తగులుతోంది.
|