TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
హలో... రాంగ్ నెంబర్.! - 37
ముచ్చర్ల రజనీ శకుంతల
ఇంట్లో ఇంకా లైట్లు వెలుగుతూ వుండడం చూసి శ్రీకర్ లో చిన్న అనుమానం హాలులో ప్రియంవదను చూసాక కన్ ఫర్మ్ అయింది.
"ఎక్కడ్నుంచి వస్తున్నారో" అంది దీర్ఘం తీస్తూ ప్రియంవద.
"ఎక్కడ్నుంచి వస్తాను...ఆఫీసు నుంచే అబ్బ! బాగా టైర్డ్ అయ్యాను" అంటూ బెడ్ రూంలోకి నడిచాడు.
బబ్లూ గట్టిగా శ్రీకర్ కు వినిపించేలా "అబద్దములు ఆడరాదు. సత్యమునే పలుకవలెను" అని చదువుతున్నాడు.శ్రీకర్ బబ్లూ వంక చూసి "ఇప్పుడు ఆ మిక్సింగ్ అవసరమా?" అని అడిగాడు.
"ఇవాళ నీ ఫేట్ ఫట్ మణి పగిలేలా వుంది డాడీ" అన్నాడు బబ్లూ.
"అదేమిట్రా...అంత మాట నేసావ్. అవునూ, మమ్మీ ఎందుకు సీరియస్ గా వుందో తెలుసా?" అడిగాడు బాబ్లూని దగ్గరకు తీసుకుని.
"ఏమో మమ్మీ ఇందాకే వచ్చింది"
"ఇందాకే వచ్చిందా...అంటే ఉదయం నుంచి ఇంట్లో లేదా?"
"లేదు"
"మరి నువ్వు?"
"టీవీ సీరియల్స్ చూస్తూ వున్నాను. అందరూ వున్నా ఎవరూ లేని అనాథను. ఎవరూ లేరని, అందరూ వున్నారని అనుకునే అనాథను."
"ఒరేయ్...అన్నిసార్లు తిప్పి తిప్పి చెప్పకు. అసలే టెన్షన్ గా వుంది. నువ్వెళ్లి పడుకో"
"తిప్పి తిప్పి మూడు సార్లు టీవీలో చెప్తారుగా. అయినా పదిన్నర వరకు కాళరాత్రి చూసి పడుకుంటాను" అన్నాడు బబ్లూ.
"ఇవాళ నాకెటూ కాళరాత్రే' మనసులో అనుకుని కొడుకు వైపు చూసి
"అలాంటి హారర్ సీరియల్స్ చిన్నపిల్లలు చూడకూడదు"
"మొన్న మిడ్ నైట్ ట్వెల్వ్ హెచ్ బీఓలో ఈవిల్ డెడ్ చూసాను. నాకేమీ భయం వేయలా. అదేమిటో డాడీ! నాకు ఇంగ్లీష్ లో హారర్ సీరియల్స్ చూసినా, తెలుగులో ఏడుపు సీరియల్స్ చూసినా నవ్వొస్తుంది." నవ్వాపుకుంటూ అన్నాడు బబ్లూ.
కొడుకు టీవీ పరిజ్ఞానం చూసి 'షిట్' అనుకున్నాడు.
* * *
"ఇప్పుడు చెప్పండి...ఏమిటి మీ ఉద్దేశం" అడిగింది అర్థరాత్రి ఒకటిన్నర ప్రాంతంలో.
స్నానం చేసివచ్చి అలసటగా కళ్ళుమూసుకుని అలానే నిద్రలోకి జారుకున్నాడు శ్రీకర్. సరిగ్గా ఒకటి ఇరవై అయిదుకు భర్త మొహం మీద నీళ్లు చల్లి లేపింది.
భర్త కళ్ళు తెరవడంతోనే అడిగింది "ఇప్పుడు చెప్పండి...ఏమిటి మీ ఉద్దేశం" అంటూ.
"ఏ విషయంలో?" ఆవులిస్తూ అన్నాడు . ఓసారి భర్త వంక చూసి "మీ విషయంలోనే" అంది.
"అబ్బ! నీ టీవీ భాష అర్థం కావడం లేదు. రేపొద్దున ఫ్రెష్ గా మాట్లాడుకుందాం" అన్నాడు శ్రీకర్.
"రేపోద్దున్నే మీరెక్కడ దొరుకుతారు. పైగా బబ్లూ వుంటాడు"
"అబ్బ...నీ గోలేమిటే?" విసుక్కున్నాడు శ్రీకర్.
"ఇవాళ ఉదయం నుంచీ ఎక్కడికెళ్లారు" సూటిగా అడిగింది.
ఒక్కక్షణం ఉలిక్కిపడి అంతలోనే ఉలికిపాటును కప్పిపుచ్చుకుంటూ "ఎక్కడికి వెళ్లాను...ఎక్కడికి వెళ్లానబ్బా?"
"యాక్షనొద్దు డైలాగు చెప్పండి" అంది ప్రియంవద.
"వదా...నాకు బోల్డు పనులుంటాయి. అవన్నీ ఎలా గుర్తుంటాయి? అయినా కోట్ల విలువ చేసే స్టాంపుల కుంభకోణంలోనే ఏళ్లు గడిచినా ఇంకా ఇంటరాగేషన్ లోనే వుంది...నువ్వేంటి..."
"మాట మార్చొద్దు"
"సరే..ఇంతకీ నీ గోలేమిటి?"
"మీలో ఈ మధ్య చాలా మార్పు వచ్చింది"
"ఈ మధ్య అంటే..."
|