Home » » తాంత్రిక సెక్స్ :జీ - స్పాట్

తాంత్రిక సెక్స్ :జీ - స్పాట్

శృంగారకళ విషయంలో మొదటినుంచీ భారతీయులదే అగ్రస్థానం. సుసంపనన్నమైన దేశం అవడం, సస్యశ్యామలమైన నదులు, సహజ సంపదలు వున్న కారణంగా సాహిత్యం, సంగీతం, శిల్పకళ, చక్కటి వస్త్రాలు , సుగంధ ద్రవ్యాలు వీటన్నిటితో భారతీయులుగా బాగా ఆనందంగా గడిపేవారు. వాత్స్యాయన కామసూత్రాలు, కళ్యాణమల్లుని అనంగరంగం, రతిరహస్యం లాంటి పుస్తకాలు విరివిగా చదవ బడ్డాయి. కొత్తగా పెళ్లి చేసుకోబోయేవాళ్ళకి వివాహమైన వారికి శృంగార పద్దతులు వివరించే గ్రంధంగా జగత్ర్పసిద్ది చెందిన గ్రంధం కామసూత్రాలు. తాంత్రికులు కూడా అనేక శృంగార పద్దతుల్ని ఆవిష్కరించారు. విడివిడిగా స్త్రీ పురుషులిద్దరూ అసంపూర్ణాలు. స్త్రీ పురుష బీజాలు కలిసి శరీరంలో స్థితమైనప్పుడే సంపూర్ణత సిద్దిస్తుంది. మద్యం, మాంసం, మీనం, ముద్ర, మైధునం వీటిని ఎక్కువగా తాంత్రికులు అవలంభించారు.

 

శృంగారంలో స్త్రీని ముందు తృప్తి పడేట్టు చేసి వచ్చిన స్త్రీ బీజాన్ని (ఆధునిక భాషలో మనం వాడే స్త్రీ బీజం అంటే ఓవమ్ కాదు. ఏ పదార్దమన్నది విలరించలేము) పురుషుడు తన అంగం ద్వారా పైకి పీల్చుకుని శుక్ర ధాతువుతో కలిపి ఆ రెండింటిని శరీరంలో స్థితమయ్యేట్టు చేసుకుంటే దీర్ఘాయుష్షు లభిస్తుందని తాంత్రికుల విశ్వాసం. స్త్రీ స్ఖలనం అయ్యేట్టు చేయడం పురుషుడు స్ఖలనం కాకుండా వుండేట్లు చేసే అనేక తాంత్రిక ప్రక్రియలు తాంత్రికులు అవలంభించారు. ఆయుర్వేదంలో, కామశాస్త్ర గ్రంధాలలో తాంత్రికుల ఆవిష్కరణలు కొన్ని మనకు వివరించారు. అనంగరంగంలో స్త్రీ యోనిలో స్పర్శ వలన కామజలం స్ఖలనమయ్యే నాడిని కామాతపత్రనాడి అన్నపేరుతో వివరించారు. స్పర్శతో దీనినుండి ఆనందం లభిస్తుంది. యోనిలో కొద్దిదూరంలోనే కామదేవుని మదజలంతో నిండిన పూర్ణచంద్రనాడి వుంటుంది. దాని స్పర్శ ద్వారా స్త్రీ స్ఖలిస్తుంది. స్త్రీ యోనిలో అత్యంత ఆనందాన్నిచ్చే పూర్ణచంద్రనాడి, సస్పందనాడుల వర్ణన ఆధునిక యుగంలో జీ - స్పాట్ పేరుతో చేశారు.

 

భావప్రాప్తి పొందని స్త్రీలలో చికిత్సనిమిత్తం ఎ ఎఫ్ ఐ జోన్ ప్రేరణని మరేషియాకు చెందిన డా. చొచీ అన్ కనిపెట్టారు. అత్యంత అరుదైన జీ- స్పాట్ ఫోటో ఆయన ఇచ్చింది ఈ పస్తకంలో వుంది. స్త్రీ సర్వశరీరము కామకేంద్రమే. ఆమె శరీరం ఒక సంగీత సాధనం లాటింది. ఎక్కడ ముట్టుకున్నా రాగాలు పలుకుతాయి అంటారు కొందరు. సర్వశరీరంపై స్పర్శ వుద్రేకాన్నిస్తుంది. కొన్నిప్రదేశాలపై ప్రేరేపణ మరింత ఉద్రేకాన్ని తృప్తిని ఇస్తుంది. అలాంటి కామకేంద్రాలలో యోని ఒకటి. యోనిలో కూడా కొన్ని ప్రదేశాలు అత్యంత సున్నితంగా వుండి ఆ ప్రదేశం పై స్పర్శ భావప్రాప్తి కలిగిస్తుంది. అలాంటి ప్రదేశాలలో ఒకటి జీస్పాట్. గ్రాఫెన్ బర్గ్ స్పాట్ అనే ప్రదేశం యోని గోడలలో వుంటుంది. యోని గోడలలో ముందువైపు దాదాపు మధ్యభాగంలో 12 డిగ్రీల క్లాక్ పొజిషన్ లో ఇది వుంటుంది. మామూలు సమయంలో దీన్ని గుర్తించడం కష్టం.

 

యోని గోడలలో వేలిద్వారా గానీ ఇతర పద్దతుల ద్వారా గానీ బాగా ఉద్రేకం కలిగినప్పుడు యోని గోడలలో పైభాగంలో పావలా కాసంత ముడిలాంటిది వస్తుంది. ఇది బయట నుంచి రెండు అంగుళాల దూరంలో వుంటుంది. కొందరిలో ఇంకా లోతుగా వుండవచ్చు. డా. జాన్ ఫెర్రీ, డా. బెవర్లీ విపుల్ ఈ కామకేంద్రానికి గ్రాఫిన్ బర్గ్ స్పాట్ లేదా జీ - స్పాట్ అని పేరు ఇచ్చారు. ఎర్నస్ట్ గ్రాఫిన్ బర్గ్ అన్న జర్మన్ గైనకాలజిస్ట్ ముందువైపు యోని గోడలలో మూత్ర మార్గం నిలువునా వుండే ప్రదేశంలో వున్న కామకేంద్రాన్ని 1944లో వర్ణించాడు. 1950లో ఆయన ఆ ప్రదేశం గురించి వర్ణిస్తూ ముందువైపు నుండే యోనిగోడలో మూత్రమార్గం పొడవునా వుండే ప్రదేశంలో అంగస్తంభనాన్ని కలిగించే కణజాలం లాంటిది వుంటుంది. కామోద్రేకం కలిగినప్పుడు మూత్రమార్గం వుబ్బుతుంది. భావప్రాప్తి సమయంలో ఇది ఇంకా ఉబ్బుతుంది. అంతేకాకుండా ఆ సమయంలో మూత్రమార్గం గుండా మూత్రం కాని ద్రవాన్ని స్త్రీ స్ఖలిస్తుంది. అని ఆయన చెప్పాడు. ఆ తరువాత జీస్పాట్ పై, స్ఖలనం పై అనేక పరిశోధనలు జరిగాయి. యోని గోడలలో వ్రేలితో రుద్దినందువలన బాగా ఉద్రేకం కలగడం, అదే ప్రేరణ కొనసాగితే భావప్రాప్తి కలగడం జరుగుతుంది. జీ - స్పాట్ ని కొన్ని పరిశీలనలో గుర్తించారు.

 

జీస్పాట్ లాంటి దాన్ని చూడకపోయినా యోని గోడలలో వ్రేలితో ప్రేరేపించడం వలన మంచి ఉద్రేకం కలుగుతుందని గుర్తించారు. అమెరికా, కెనడాలలో ఇచ్చిన ప్రశ్నపత్రాన్ని నింపి పంపిన 1245 మంది స్త్రీలలో 788 మంది యోనిగోడలలో ప్రేరేపణ కలిగినప్పుడు ఆనందాన్నిచ్చే ప్రదేశం వున్నట్లు చెప్పారు. వారిలో అధికశాతం అది ముందువైపు 12 డిగ్రీల క్లాక్ పొజిషన్లో వున్నట్లు చెప్పారు. ఏ నిర్మాణాన్ని జీ - స్పాట్ అని పిలవాలి అన్నది నిర్దారించబడలేదు. అలాగే ప్రేరేపించి నప్పుడు ఉబ్బెత్తుగా వుండే ప్రదేశాన్ని అందరూ గుర్తించలేదు. కానీ స్త్రీ యోనిలో కొన్ని భాగాలను వ్రేలితో ప్రేరేపించినప్పుడు స్త్రీకి ఉద్రకం, ఆనందం, తృప్తి కలుగుతాయి. వీటిని గూర్చి తెలుసుకున్నందువలన మగవాడు తన పార్టనర్ కి సెక్స్ లో తృప్తి నివ్వగలుగుతాడు.

 

కామతపత్రనాడి యోని మధ్యేస్తినాడ్యేకా కామాంకుశ సమాహి యా లింగేన క్షోభితాసైవమదవారి నిరంతరం కామాతప్రతాత్ సృజతి సస్యంద ఇతికీర్త్యతే అంగం యొక్క అఘాతంతో యోనిలో నిరంతరం స్రావాలు ఊరతాయి. దీన్ని స్ఖలించడం అంటారు. ఈ నాడిని కామాతపత్రనాడి అంటారు. మన్మధఛత్రం (క్లిటోరిస్) వరంగరంధ్రార్ద్వంతు నాసికాభం యదస్తితత్ మన్మధఛత్రమిత్యాహురాడ్యం మదశిరాచయైః యోని రంధ్రానికి పైన ముక్కులాగా వుండే దాన్ని మన్మధఛత్రం అంటారు. దీనిలో కామాన్ని కలిగించే అనేక సిరలు కుడి వుంటాయి. దీనిపై ప్రేరేపణ స్త్రీలలో కామోత్తేజాన్ని కలిగిస్తుంది. పూర్ణచంద్రనాడి (జీ - స్పాట్) యోనిమద్యే నాతిదూరాత్ పూర్ణచంద్రాస్తినాడికా మనోజవారి సంపూర్ణా స్త్రీణాంతిష్టతి సర్వదా తద్విసర్గే ద్రుతానారీ ప్రోచ్చతేపూర్వసూరిభిః యోని మధ్యలో కొద్దిదూరంలోనే కామదేవుని మదజలంతో నిండిన పూర్ణచంద్రనాడి వుంటుంది. దీనినుంచి కామజలం స్రవిస్తుంది. దాన్ని స్త్రీలో స్ఖలనం అంటారు.

google-banner