Home » » స్త్రీలలో భావప్రాప్తి

స్త్రీలలో భావప్రాప్తి

కిన్సీ పరిశోధనలో పెళ్లయిన మొదటి 5 సంవత్సరాలలో కన్నా తర్వాత 5 సంవత్సరాలలోనూ, అంతకన్నా ఆ తర్వాత 5 సంవత్సరాలలోనూ స్త్రీలు శృంగారంలో పాల్గొన్న అత్యధిక శాతం సందర్భాలలో భావప్రాప్తి పొందుతారు అని గమనించారు. పెళ్లయిన కొత్తలో మగవాడు శృంగారంలో వారంలో ఎక్కువసార్లు పాల్గొంటాడు. వయసు పెరిగేకొద్దీ మగవాని ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. అయినప్పటికీ పెళ్లయిన తొలి సంవత్సరాలలో కన్నా తదుపరి సంవత్సరాలలోనే స్త్రీలు సుమారు 85 శాతం సందర్బాలలో భావప్రాప్తి పొందగలుగు తారు. ఎక్కువ సందర్భాలలో తృప్తి పొంది ఒకటి రెండు సందర్భాలలో పొందకపోయినా స్త్రీకి నిరాశ కలుగదు. కానీ పెళ్లయి పది సంవత్సరాలయినా ఒక్కసారి కూడా ఆ తృప్తి కలగకపోతే చాలా చిరాకు కలుగుతుంది.

 

 

ఈ చిరాకు వివిధ మార్గాల ద్వారా వ్యక్తం చేస్తారు. సాధారణంగా ప్రత్యక్షంగా శృంగారంలో తృప్తి లేనందువల్లే ఇలా జరిగిందని చెప్పరు. కొందరు వివిధ వ్యాధుల్ని వ్యక్తం చేస్తుంటారు. ఫ్యామిలీ పిజీషియన్ కు చెప్పడానికి కూడా ఇష్టపడరు. అసలు విషయం సెక్స్ కౌన్సిలర్ దగ్గరే చెప్పగలుగుతారు. భావప్రాప్తి విషయంలో స్త్రీలకు మల్టిపుల్ ఆర్గాజమ్స్ కలుగుతుంటాయి. ఫోర్ ప్లే ద్వారా స్త్రీ బాగా ఉద్రేకం చెందితే ఒకసారి భావప్రాప్తి కలిగినవెంటనే మరలా మరలా భావప్రాప్తి కలుగుతుంటుంది. వీటిని మల్టిపుల్ ఆర్గాజమ్స్ అంటారు. ఒకసారి భావప్రాప్తి కలిగాక ప్రేరేపణ కొనసాగితే మల్టిపుల్ ఆర్గాజమ్స్ కలుగుతాయి. అదే మగవారి విషయంలో ఒకసారి భావప్రాప్తి కలిగాక ఇంకొకసారి భావప్రాప్తి కలగడానికి సమయం పడుతుంది. మల్టిపుల్ ఆర్గాజమ్స్ ఎప్పుడూ కలగాలనే నియమం ఏమీ లేదు. కొందరిలో కలగకపోయినా అదేదో లోపమని భావించనక్కర్లేదు. కందర్పయుద్దే ప్రధమేల్ప భావాశ్చిరేణ తృప్తిం వనితాలభంతే శీఘ్రం ద్వితీయే ధృతి భూరి భావాః పుంసః క్రమోయం విపరీత ఉక్తః సంభోగంలో మొదటిసారి స్త్రీకి తృప్తి ఆలస్యంగా కలుగుతుంది. రెండవసారి త్వరగా తృప్తి కలుగుతుంది. కానీ పురుషులలో దీనికి వ్యతిరేకంగా వుంటుంది. అంటే పురుషుడు మొదటిసారి తొందరగా స్ఖలించినా రెండవసారి కొంచెం ఆలస్యంగా స్ఖలిస్తాడు.

 

మల్టిపుల్ ఆర్గాజమ్స్ లానే కొందరు స్త్రీలలో ఫేక్ ఆర్గాజమ్స్ కూడా వుంటాయి. తృప్తి కలగకపోతే భర్తకు అసంతృప్తి కలగడం, ఆత్మవిశ్వాసం దెబ్బతినడం సంభవిస్తాయి. శృంగారంలో కొందరు శృంగారం జరుపుతున్నంతసేపు ఆ తర్వాత భార్యను తృప్తి కలిగిందా అని అదే పనిగా అడుగు bతుంటారు. అది స్త్రీలకు కొంత చిరాకు కలిగిస్తుంది. ఆ బాధ భరించలేక కొందరు భావప్రాప్తి కలగకపోయినా కలిగినట్లు నటిస్తారు. ఈ నటించడం కొంతకాలం అయితే ఫర్వాలేదు. ఎప్పుడూ నటించడం కూడా కష్టమే.

 

 

తృప్తి కలిగిందా అని పదే పదే అడిగే బదులు ఎలాచేస్తే తృప్తి కలుగుతుంది అన్నది మగవాడు గుర్తించాలి. ఈ గుర్తించడంలో ఒకరోజులో జరిగేది కాదు. ఎలా చేస్తే స్త్రీకి కామోద్రేకం కలుగుతుంది. ఎలాంటివి కామోద్రేకాన్ని చల్లారుస్తాయి. అన్నది తెలుసుకోవాలి. దీనికి కొంతకాలం పడుతుంది. మంచి కమ్యూనికేషన్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. శృంగారం పూర్తిగా వ్యక్తిగతమైనది. పార్టనర్ ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలంటే ముఖ్యమైనది తమకు ఇష్టమైనవాటిని, ఇష్టంలేనివాటిని వ్యక్తం చేస్తే మంచిది. శృంగార సమయంలో వ్యక్తం చెయ్యడం వలన మగవాడికి మూడ్ ఆఫ్ అవ్వచ్చు.

 

ఫోర్ ప్లే ఎక్కువసేపు చెయ్యడం వలన స్త్రీకి ఉద్రేకాన్ని కలిగించే అంశాలు గూర్చి తెలుసుకునే అవకాశం మగవానికి కలుగుతుంది. వాత్స్యాయన కామసూత్రాలలో వర్ణించిన చుంబన ఆలింగనాదులన్నీ స్త్రీకి అత్యంత కామోద్రేకాన్ని కలిగించేవి. స్త్రీకి సంబంధిత సెక్స్ విషయాలు ఇంత వివరంగా ఆ రోజుల్లోనే పుస్తకం వ్రాయడం గొప్ప విషయం. ఆ పుస్తకాన్ని స్త్రీలు తప్పనిసరిగా చదవాలని ఆయనే వ్రాశాడు. ఇవన్నీ చూస్తే వాత్స్యాయనుడు స్త్రీనా అన్న సందేహం కూడా కలుగుతుంది. అదే విషయాన్ని అమెరికాలో ప్రచురించిన ఒక పుస్తకంలో మేము వ్రాశాము. శృంగారానికి ముందు స్నానం చెయ్యడం, సుగంధ ద్రవ్యాలు వాడడం, శృంగారం తప్ప ఇతర ఆలోచనలు ఆ సమయంలో చెయ్యకపోవడం లాంటివి శృంగారంలో తృప్తికి అవసరం. శనివారం రాత్రి ఎక్కువసేపు శృంగారంలో పాల్గొన్నప్పుడు ఒకలాంటి తృప్తి కలుగుతుంది. అదే సోమవారం ఉదయమో, మరో బిజీ రోజో మూడ్ వచ్చి ఒక్క 5- 10 నిముషాలు శృంగారంలో పాల్గొన్నా అదో థ్రిల్లింగ్ తృప్తినిస్తుంది. కనుక ఎంతసేపు శృంగారంలో పాల్గొన్నారన్నది ముఖ్యమైంది కాదు. ఎక్కువసేపు శృంగారంలో పాల్గొంటే ఒక్కొక్కసారి విసుగు కూడా కలగవచ్చు.

google-banner