హలో... రాంగ్ నెంబర్.! - 79

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 79

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

ప్రియంవద కొనసాగించింది.

"ఈ పందెంలో మనం గెలవాలంటే, తను ఓడిపోవాలంటే అమ్మాయిలతో తనకు ఎఫైర్ వున్న సాక్ష్యం సంపాదించాలి. అందుకే..." ప్రియంవద వాక్యం పూర్తి చేయలేదు.''"నాకు అర్థమైంది మేడమ్. చూద్దాం. ఇంకా మనకు టైం వుందిగా..." అన్నాడు జేమ్స్ బాండ్.

ప్రియంవద ఆలోచనలో పడింది.

*            *          *

ఆరోజే జెన్నిఫర్ స్టేట్స్ కు వెళ్తోంది. ప్రతీ రోజూ ఏదో ఓ కారణంగా జెన్నిఫర్ తో కలయిక వాయిదాపడుతూ వస్తోంది. ఆరోజు అవకాశం ఉపయోగించుకోవాలి అనుకున్నాడు శ్రీకర్.

అతను హోటల్ కు వెళ్లి, జెన్నిఫర్ రూమ్ లోకి వెళ్లే సమయంలో, రూమ్ లో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఇన్స్పెక్టర్, జెన్నిఫర్ మాట్లాడుకుంటున్నారు.

"థాంక్యూ ఇన్స్పెక్టర్. నేను వెళ్లేలోగా నా క్రెడిట్ కార్డు, క్యాషూ తెచ్చిచ్చారు. థాంక్యూ వెరీమచ్." అంటోంది జెన్నిఫర్.

ఇన్స్పెక్టర్ ఏదో మాట్లాడుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. శ్రీకర్ ఏమీ ఎరగనట్టు లోపలికి అడుగుపెట్టాడు. జెన్నిఫర్, శ్రీకర్ ని చూసి తడబడింది. హ్యాండ్ బ్యాగ్ ని డస్ట్ బిన్ లో పడేసింది.

"ప్లీజ్ కమిన్ శ్రీకర్. ఈరోజు వస్తారో రారో అని టెన్షన్ ఫీలయ్యాను. యూ నో ఈరోజే ఆఖరి రోజు" అంది డోర్ వేస్తూ.

శ్రీకర్ జెన్నిఫర్ వంకే చూస్తున్నాడు.

జెన్నిఫర్ పాదాలు కొద్దిగా పైకి లేపి, శ్రీకర్ పెదవులు అందుకునే ప్రయత్నం చేసింది. శ్రీకర్ సున్నితంగా ఆమెను విడిపించుకున్నాడు.

"వాట్ హ్యాపెండ్?" అడిగింది జెన్నిఫర్.

"మన అగ్రిమెంట్ ప్రకారం...మీ క్రెడిట్ కార్డు దొరికింది. సో...మీరు నా కోరికను మన్నించవలసిన పనిలేదు. యామై రైట్."

"మీకెవరు చెప్పారు నా హ్యాండ్ బ్యాగ్ దొరికిందని. అంతా అబద్దం."

"కాదు నిజం! నేను వచ్చేసరికి మీరు, ఇన్స్పెక్టర్ మాట్లాడుకోవడం చూసాను."

"అఫ్ కోర్స్...అగ్రిమెంట్ ని నేనే క్యాన్సిల్ చేస్తున్నాను. చివరి అవకాశం. ఈరోజు తర్వాత మళ్లీ కనిపించను."

"జెన్నిఫర్...మన ఒప్పందం ప్రకారం మీరు నాతో స్పెండ్ చేయవలసిన అవసరం లేదు. ప్లీజ్..డోంట్ బాదర్" శ్రీకర్ వంకే చూస్తూండిపోయింది జెన్నిఫర్.

"థాంక్యూ మై ఫ్రెండ్. మీలాంటి మంచి వ్యక్తికి అబద్దం చెప్పలేను. నేనో కాల్ గాళ్ ని. కాస్ట్ లీ కాల్ గాళ్ ని. ....ఇండియాలో అడుగుపెట్టాక, ఇక్కడి పవిత్రత నా వృత్తిని మరిచిపోయేలా చేసింది. మళ్లీ స్టేట్స్ కు వెళ్లేవరకూ నా వృత్తిని మరిచిపోవాలనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో నా క్రెడిట్ కార్డు, క్యాషూ పోయింది. వ్యభిచారం చేసి ఇక్కడ వుండే కొద్ది రోజులు గడపడం ఇష్టంలేకపోయింది. అందుకే మీతో ఓ ఒప్పందానికి వచ్చాను. మీ సిన్సియార్టీ నాకు నచ్చింది. కేవలం డబ్బుతో, అమ్మాయిలతో గడిపే మనస్తత్వం కాదని, నేను రెండువేలు అడిగినప్పుడు, అంతకన్నా ఎక్కువ ఇస్తానన్నప్పుడే అర్థమైంది. మీలాంటి ఓ మంచి ఫ్రెండ్ తో ఓ గంట స్పెండ్ చేసినా చాలు. అందుకే మీతో అబద్దం చెప్పాను."

"జెన్నిఫర్! అగ్రిమెంట్ సంగతి వదిలేస్తే మనం మంచి ఫ్రెండ్స్ గా వుందాం. ఎప్పుడైనా నేను స్టేట్స్ కు వచ్చినప్పుడు నీ దగ్గరకి వస్తాను." చెప్పాడు శ్రీకర్.

జెన్నిఫర్ శ్రీకర్ చేతిని పెదవులకు ఆన్చుకొని ముద్దు పెట్టింది. జెన్నిఫర్ ని ఏర్ పోర్ట్ లో డ్రాప్ చేసి, ఇంటికి బయల్దేరాడు శ్రీకర్. ఇకపై ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మాయిలను చూసి టెంప్టవకూడదన్న నిర్ణయానికి వచ్చాడు.