Rating:             Avg Rating:       918 Ratings (Avg 3.02)

హలో... రాంగ్ నెంబర్.! - 75

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 75

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

"థాంక్యూ...థాంక్యూ వెరీమచ్...వండర్ ఫుల్ లంచ్...మీ ఆతిథ్యాన్ని ఎప్పుడూ మరిచిపోనూ. నిజం చెప్పాలంటే మీతో మాట్లాడుతోంటే టైం తెలియడం లేదు. మీలో ఏదో ఆకర్షణ వుంది. అది మీ మాటల్లోనా? మీలోనా? అనండి తెలియడం లేదు" లంచ్ పూర్తయ్యేక సిన్సియర్ గా చెప్పింది స్టెలీనా.

"మీకు అభ్యంతరం లేకపోతే డిన్నర్ ఇవ్వడానిక్కూడా నాకభ్యంతరం లేదు. నిజం చెప్పనా? మొదటి పరిచయంలోనే ఇలా మాట్లాడుతున్నాడేమిటని మీరు అనుకోకపోతే, డెడ్ బాడీని సైతం బెడ్ మీదికి రప్పించే స్ట్రక్చర్ మీది."

స్టెలీనాకు కోపం రాలేదు. సిగ్గేసింది. ఆమె మొహం సిగ్గుతో ఎర్రబడింది. కించిత్ గర్వం కూడా కలిగింది. ఇష్టమైన వ్యక్తి తన అందాన్ని పొగిడినప్పుడు కలిగే గర్వం అది. కానీ ఒకే ఒక పరిచయంలో ఇదంతా ఎలా సాధ్యం?

"మనం మళ్ళీ కలుద్దామా?" అడిగాడు శ్రీకర్.

"వైనాట్ ...ష్యూర్" అంది స్టెలీనా.

*            *           *

కేవలం మూడ్రోజుల పరిచయమే. ఆదివారం శ్రీకర్ ని ఇంటికి ఇన్వయిట్ చేసింది. శనివారం రాత్రి స్టెలీనాకు నిద్రలేదు.

ఓ అపరిచిత వ్యక్తిని కేవలం మూడు రోజుల పరిచయంలోనే ఇంటికి ఆహ్వానించడమేమిటి? తను తప్పు చేస్తోందా? చిన్న గిల్టీ ఫీలింగ్. వెంటనే తనను తాను సర్దుకుంది.

ఏడేళ్ళ ప్రేమ, ఏడేళ్ళ పెళ్ళి జీవితం...అంతా విషాదమేనని తన జీవితమే తనకు గుణపాఠం నేర్పలేదా? అలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఆరోజు గడిపింది.

*            *          *

మొట్టమొదటిసారిగా యిష్టంగా ఎన్నో రకాల ఐటమ్స్ ప్రిపేర్ చేసింది. డైనింగ్ టేబుల్ ని నీట్ గా సర్దింది. శ్రీకర్ కోసం హాలును శుభ్రంగా వుంచేసింది. కర్టెన్స్ మార్చింది.

మధ్యాహ్నం పన్నెండు దాటింది. ఈ మూడ్రోజుల్లో ఓ విషయం స్పష్టంగా గమనించింది. పంక్చువాల్టీ. చెప్పిన టైమ్ కు ఒక సెకన్ ముందే వుంటాడు.

పన్నెండున్నరకు వస్తానని చెప్పాడు. పింక్ కలర్ నైటీలో వుంది స్టెలీనా. ఇంకా ముప్పయి నిమిషాలే వుంది. ఆ ముప్పయి నిమిషాల ఆలస్యాన్ని భరించలేకపోతూంది. పాత మేగజైన్ ఒకటి తీసుకుంది. ఒకప్పుడు మేగజైన్స్ విపరీతంగా చదివేది.

మేగజైన్ ని తిరగేస్తుంటే కామెడీ కథ ఒకటి కనిపించింది. మొదటి వాక్యం చదవగానే నవ్వొచ్చింది. 'కొందరికేమో గోపాలం..అందరికీ మాత్రం గోపాలంగాడు...వాడొట్టి బద్దకిస్టు. అయినా ఐడియాల పేస్టుతో పళ్ళు తోముకొంటాడు...ఆమెకు ఆ నేరేషన్ చదువుతోంటే నవ్వొస్తోంది. ఆ కథకు వేసిన బొమ్మలు కూడా అలానే వున్నాయి. ఏ కథను టీవీ సీరియల్స్ తీస్తే బావుణ్డు ఏడుపుగొట్టు సీరియల్స్ మధ్య ఇది డిఫరెంట్ గా వుంటుంది.' అనుకుంది స్టెలీనా.

"హలో...ఏంటీ మీలో మీరే నవ్వుకుంటున్నారు?"

ఆ మాటలతో ఉలిక్కిపడే మేగజైన్ లో నుంచి తలెత్తి చూసింది. తర్వాత గోడ గడియారం వంక చూసింది. పన్నెండూ నలభై...అంటే నలభై నిమిషాలుగా...

"ఏదైనా ప్లాష్ బ్యాక్ లోకి వెళ్ళారా? కామన్ గా సినిమాల్లోనూ, కథల్లోనూ హీరోనో, మరే క్యారెక్టరో ప్లాష్  బ్యాక్ లోకి వెళ్తుంది కదా...అలా మీరు గానీ..."

"లేదు...లేదు...మీ కోసమే వెయిట్ చేసి బోర కొడుతూంటే, పాత మేగజైన్ తిరగేసాను..ఇందులో ఓ కామెడీ కథ చదువుతూండిపోయేను."

"అంత కామెడీగా వుందా?"

"అవును..కథ పేరే కామెడీగా వుంది. చదవడం అలవాటు పోయి చాలా కాలమైందిగా..."

"మనం లంచ్ చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు"

స్టెలీనా డైనింగ్ టేబుల్ టేబుల్ దగ్గరకి నడిచింది.

*              *            *

ఊహించని విధంగా జరిగిన పరిచయం, వాళ్ళ మధ్య సాన్నిహిత్యాన్నికి దారితీయడానికి పట్టిన సమయం కేవలం తొంభై ఆరు గంటలే. ఆ రాత్రే తన మనసు విప్పి చెప్పింది స్టెలీనా. ప్రేమించానని చెప్పిన వ్యక్తి, పెళ్ళి చేసుకొని కొన్నాళ్ళు కాపురం చేసిన వ్యక్తి ఏ తప్పూ చేయకున్నా, స్టెలీనాని అనుమానించి, అనుమానాన్ని కారణంగా చూపించి విడాకులు తీసుకున్నాడు. పెళ్ళంటే, ప్రేమంటే, నమ్మకం కోల్పోయిన స్టెలీనా శ్రీకర్లోని సిన్సియార్టీ ముందు తలవంచింది. తనను తాను అర్పించుకుంది.

ఇప్పుడామె మనసులో నిత్యం శ్రీకర్ ఆలోచనలే. శ్రీకర్ తో ఆమె ప్రయాణం ఎక్కడ వరకూ వెళ్తుందో...?