TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
హలో... రాంగ్ నెంబర్.! - 21
ముచ్చర్ల రజనీ శకుంతల
హాల్లో కూచోని సీరియస్ గా ఆలోచిస్తున్నాడు బబ్లూ. కొడుక్కి పాలు తీసుకువచ్చి ఇస్తూ "హోంవర్క్ పూర్తయిందా?" అని అడిగింది ప్రియంవద.
"మేడమ్స్ హోంవర్క్ ఇవ్వలేదు"
"మేడమ్స్ అంటున్నావు...ఏ మేడమూ ఇవ్వలేదా?"
"ఇవ్వలేదు అనే కదా చెప్పాను" తల్లి వంక సీరియస్ గా చూస్తూ చెప్పాడు బబ్లూ.
"ఏరా...మమ్మీ అంటే భయం లేకుండా పోతోంది." కోపంగా అంది ప్రియంవద.
"నేనింకా నయం...'నిన్నే పెళ్ళాడుతా' సీరియల్ లో సీత తల్లిని నానా బూతులు తిడుతుంది తెలుసా.."
"అంటే ఇప్పుడు నన్ను తిడతావా?" అనుమానంగా అడిగింది ప్రియంవద.
"హు..అంత ధైర్యం మా నాన్నకే లేదు నాకెక్కడిది...అన్నట్టు గుట్కా తింటే బావుంటుందా మమ్మీ..."
ఒక్కక్షణం విస్మయంగా చూసింది కొడుకు వైపు. ఆ తర్వాత అనుమానం, ఆపై కోపం...
"గుట్కానా..."
"నేనేమైనా కూల్ డ్రింక్ అన్నానా? వోన్లీ గుట్కా గురించే కదా అడిగింది. ప్యాకెట్లు చూస్తోంటే భలే ముద్దొస్తున్నాయ్. సీతయితే లొట్టలేసుకుంటూ తింటుంది.." ప్రియంవదకు అర్థమైంది టీవీ సీరియల్స్ ప్రభావం బబ్లూ మీద బాగా పడిందని.
అనునయంగా బబ్లూ భుజం మీద చేయివేసి "తప్పు బబ్లూ...సీరియల్ లో కూడా నిజంగా తినరు. తిన్నట్టు నటిస్తారు" చెప్పింది.
"పిచ్చిమమ్మీ..వాళ్ళు నటిస్తే నాకు తినిచూపించాలని వుంది.."
"పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడకు. వేలెడంత లేవు...అన్నీ పాడు అలవాట్లు" ఓసారి తన వేలిని దగ్గరకి చేర్చి లెక్కబెడుతూ..."వేలెడంత వున్నానుగానీ...అయినా నువ్వేంటి? నీకన్నా డాడీనే నయం...నా డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాడు."
వాళ్ళలా మాట్లాడుతూ వుండగానే శ్రీకర్ వచ్చాడు.
"హలో డాడీ ! నేను స్కూల్ కు వెళ్ళాక లేడీ ఇన్స్పెక్టర్ ఆంటీ నిన్ను స్టేషన్ కు తీసుకెళ్ళిందా?" మొహంలో నవ్వు పలుముకుని అడిగాడు.
గత్తుకుమన్నాడు శ్రీకర్. ప్రియంవద మొగుడి మొహంలోకి చూసింది.
శ్రీకర్ రానున్న ప్రమాదాన్ని ముందుగానే వూహించి మార్నింగ్ జరిగిందంతా చెప్పాడు..రెండు విషయాలను మినహాయించి...
ఒకటి...ఆ లేడీ ఇన్స్పెక్టర్ ని ఎక్కడ చూసాడా? అన్న తన అనుమానం....
అక్షితతో ఆరోజే మొదలైన పరిచయం.
* * *
"డాడీ...మీ తెలివితేటలకో టెస్ట్.." అన్నాడు బబ్లూ.
"బబ్లూ..తెలివితేటల్లో నేను పర్ఫెక్ట్. అడుగు చెబుతాను."
"అడుగడుగు..టెన్త్ లో మూడుసార్లు తప్పి, కంపార్ట్ మెంట్ పరీక్షలు రాసి రాసి పాసయ్యాడు మీ డాడీ..." ప్రియంవద రితార్చిచ్చింది.
బబ్లూ అదేం పట్టించుకోకుండా "ఎ" అనే అక్షరం రాకుండా ఎన్ని పదాలు చెప్పగలరు?" అని అడిగాడు.
ప్రియంవద వెంటనే మెదడుకు పని చెప్పింది.
శ్రీకర్ పెన్నూ, ప్యాడ్ తీసుకుని 'ఎ' అక్షరం రాకుండా పదాలు రాయడం మొదలుపెట్టాడు. 'ఎ' ఫర్ యాపిల్...ఊహు...బ్యాట్...ఊహూ...పోనీ తన పేరు రాస్తే ...అబ్బే ఎ వుంది...ప్రియంవద పేరులోనూ వుంది. బబ్లూ..అబ్బే! లాభం లేదు.
ప్రియంవద నోట్లోనే లెక్కలు వేసుకుంటోంది.
"ఓసి నా పూర్ ఇన్నో సెంట్ పేరెంట్సూ...తొమ్మిది వందల తొంబయి తొమ్మిది పదాలున్నాయి.."
"ఎలా?" ఇద్దరూ ఒకేసారి అడిగారు.
"వన్ నుంచి నైన్ హండ్రెడ్ నైన్ టీ నైన్ వరకూ రాసుకుంటూ వెళ్ళండి..ఎక్కడా 'ఎ' తగలదు."
శ్రీకర్ వెంటనే ఆ పనిచేసి బబ్లూ చెప్పింది నిజమేనని కన్ ఫర్మేషన్ కు వచ్చాడు.
"యూ ఆర్ జీనియస్...లైక్ మీ" అన్నాడు శ్రీకర్.
"మరో ప్రశ్న ...ప్రపంచంలో ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్నదెవరు?"
"ఇలాంటి విషయాలు మీ డాడీ కి బాగా తెలుస్తాయి.." కచ్చగా అంది ప్రియంవద.
"బ్రూనై సుల్తాన్...జంబో జిక్...అరేబియాషేక్ లు..." ఇలా చెప్పుకుంటూపోతున్నాడు శ్రీకర్.
"రాంగ్..." అన్నాడు బబ్లూ.
"ప్రపంచంలో ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకుంది ఎవరబ్బా...అయినా ఈ ఇన్ ఫర్మేషన్ నీకెలా తెలుసు" కొడుకు వంక అనుమానంగా చూస్తూ అన్నాడు.
"సినిమా హీరోలు, హీరోయిన్లు. కొన్ని వందల సినిమాల్లో నటించి, కొన్ని వందల పెళ్ళిళ్ళు వాళ్ళే కదా చేసుకుంటారు..."
"అర్రెర్రె...నేను జనరల్ నాలెడ్జి క్వశ్చననుకున్నాను" నాలిక్కర్చుకున్నాడు శ్రీకర్.
"లాస్ట్ క్వశ్చన్..ఎక్కువగా దెబ్బలు తినేదెవరు?"
ప్రియంవద ఓసారి మొగుడివైపు చూసింది. ఇందాకటి ఆన్సర్ గుర్తించుకుని చెప్పాడు శ్రీకర్.
"సినిమాల్లో విలన్లు...హీరోల చేతుల్లో ఎక్కువగా దెబ్బలు తింటూంటారు."
"ఊహూ కాదు..."
'మరి"
|