TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
హలో... రాంగ్ నెంబర్.! - 19
ముచ్చర్ల రజనీ శకుంతల
"చాలా ఆశ్చర్యంగా వుంది. ఉదయమే పరిచయమైన మీతి ఇలా కాఫీకి రావడం..." సిన్సియర్ గా అంది అక్షిత.
"నాకైతే చాలా ఆనందంగా వుంది...ముందు ఆ లారీ వాడికి థాంక్స్ చెప్పాలి..."
"ఎందుకు?"
"వాడే గనుక నా కారుకు ఎదురుగా వచ్చి వుండకపోతే మీరు చెప్పి వుండే వాళ్ళు కాదు..."
నవ్వి వూర్కుంది అక్షిత.
శ్రీకర్ చోలే బతురా ఆర్డర్ చేసాడు. ఏ.సి. రెస్టారెంట్ లో వేడివేడి చోలే, బతురా తింటూంటే బావుందనిపించింది అక్షితకు.
"ఓన్లీ కాఫీ అని, ఇన్ని ఐటమ్స్ ఆర్డర్ చేస్తున్నారేంటి.." అతను వరుసగా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తోంటే అంది.
"నాకు ఐస్ క్రీమ్స్ ఇష్టం. అందులో వెరైటీ ఐస్ క్రీమ్స్ అంటే ఇంకా ఇష్టం. కసాట, ఫ్రైడ్..మిడ్ నైట్ బ్యూటీ...అంటే ఇంకా చాలా ఇష్టం...మీకో విషయం తెలుసా...ఈ మిడ్ నైట్ బ్యూటీని మీలాంటి బ్యూటీతో తింటూంటే, వర్షాకాలం ఫైర్ ప్లేస్ ముందున్న ఫీలింగ్ కలుగుతుంది..."
అతని పొగడ్తకు ఆమె మొహం ఎర్రబడింది. ఐస్ క్రీమ్స్ మూడ్నాలుగు వెరైటీస్ తినడం పూర్తయ్యాక,
"కాఫీ షాప్ కు వెళ్దామా?" అని అడిగాడు. బిత్తరపోయింది అక్షిత...ఇప్పుడా...వీటితో రెండు రోజులకు సరిపడా కడుపు నిండిపోయింది. అయినా ఐస్ క్రీమ్స్ తిన్నాక, కాఫీ ఏమిటి?
"కాఫీ తాగుదామని చెప్పి, తాగకపోతే మీరు ఫీలవుతారని..."
నవ్వింది అక్షిత..ఆ నవ్వు అతనికి ప్రొవోకేటింగ్ గా వుంది. అమ్మాయిల నవ్వుల్లో అతను రకరకాల అందాలను చూస్తాడు. ఒక్కో నవ్వు ఒక్కోరకమైన 'మత్తు' లా అనిపిస్తుందతనికి.
* * *
రాత్రి ఏడున్నర అయింది.
"ఇక వెళ్దామా..." అంది అక్షిత.
"బోర్ ఫీలయ్యారా?" అడిగాడు శ్రీకర్.
"ప్లజెంట్ ఫీలింగ్. కేవలం కొన్ని గంటల పరిచయంలోనే మీ ప్రజెన్స్ చాలా బావుంది." అంది సిన్సియర్ గా అక్షిత.
"ఓ నిజం చెప్పమంటారా....డెడ్ బాడీని సహితం బెడ్ మీదికి రప్పించే అందమైన స్ట్రక్చర్ మీది."
ఆ కాంప్లిమెంట్ కు ఆమె మొహం మరోసారి ఎర్రబడింది.
"గుడ్ నైట్" చెప్పాడు శ్రీకర్.
"గుడ్ నైట్" అంది తన కెనటిక్ స్టార్ట్ చేస్తూ. ఆమె బండిని స్టార్ట్ చేసాక అడిగాడు శ్రీకర్.
"మీరు నాకు కాఫీ బాకీ వున్నారు...ఆ బాకీ రేపు తీర్చేస్తారా?"
ఒక్కక్షణం అతను మాట్లాడింది అర్థం కాలేదు. అర్థమయ్యేక నవ్వుతూ అంది.
"విత్ ప్లెజర్"
సరిగ్గా అదే సమయంలో 'నో టెన్షన్' డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేస్తోంది ప్రియంవద.
|