ఫీజు 300రూ... బాగవ్వకపోతే 1000రూ


ఫీజు 300రూ... బాగవ్వకపోతే 1000రూ

 

 

ఒక డాక్టర్ కి ఉద్యోగం దొరక్క ఒక క్లినిక్
మొదలు పెట్టాడు.
జనాల్ని attract చెయ్యడానికి
బయట ఈ విధంగా బోర్డ్ పెట్టాడు.

*ట్రీట్ మెంట్ ఫీజు 300రూ, బాగవ్వకపోతే 1000రూ వాపస్ ఇవ్వబడును*

ఒక పేషెంట్ ఈ బోర్డు చూసి తనకు 1000 రూపాయలు సంపాదించే అవకాశం వచ్చిందని సంబరపడుతూ ఆ క్లినిక్ లోకి వెళ్ళాడు.

పేషేంట్:- డాక్టర్ గారు నా నాలుక రుచి కోల్పోయింది.

డాక్టర్:- నర్స్ బాక్స్ No-22 లో ఉన్న మందు తీసుకొచ్చి మూడు చుక్కలు పేషంట్ నోట్లో వెయ్.

పేషంట్:- చీ ఇది పెట్రోల్ కదా డాక్టర్,

డాక్టర్:- కంగ్రాట్స్ నీ నాలుకకు రుచి తెలుస్తుంది. 300రూ ఫీజు ఇచ్చి వెళ్ళండి. పేషెంట్ కి కోపం వచ్చింది. 300రూ ఫీజు ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

కొన్నిరోజులకి తను పోగొట్టుకున్న డబ్బులు తిరిగి సంపాదించుకుందామని మళ్ళీ వెళ్ళాడు.

ఈ సారి పేషంట్:- డాక్టర్ ఈ మద్య నాకు ఏదీ గుర్తుండటంలేదు,

డాక్టర్:- నర్స్ బాక్స్ no-22 లో ఉన్న మందు తీసుకొచ్చి మూడు చుక్కలు పేషంట్ నోట్లో వెయ్యి,

పేషంట్:- డాక్టర్ అది నాలుకకి రుచి తెప్పించే మందు కదా???

డాక్టర్:- కంగ్రాట్స్ నీ మతిమరుపు పోయింది. 300రూ ఫీజు ఇచ్చి కదులు.

పేషెంట్ కి మరింత కోపం పట్టుదల పెరిగి కొన్ని రోజుల తరువాత మళ్ళీ వచ్చాడు.

పేషంట్:- డాక్టర్ నా కళ్ళు ఈ మద్య సరిగా కనపడటం లేదు

డాక్టర్:- హో నా దగ్గర దీనికి మందు లేదు. ఈ 1000 రూపాయలు తీసుకో......

పేషంట్:- కానీ ఇది 10 రూపాయల నోట్ కదా????

డాక్టర్:- వావ్ కంగ్రాట్స్ నీ చూపు తిరిగొచ్చింది. 300రూ ఫీజు ఇచ్చి కదులు.

🙄🤥🤗😳😜👏🤒 🙄🤥🤗😳😜👏🤒 🙄🤥🤗😳😜👏🤒 🙄🤥🤗😳😜👏🤒