అర్జంట్ విషయం
అర్జంట్ విషయం
.jpg)
పొద్దున మీ నాన్నగారు ఫోన్ చేశారు. అర్జంటగా మాట్లాడాలని చెప్పాడు భర్త అరుణ్.
“పొద్దున ఫోన్ చేస్తే, ఇప్పుడా నాకు చెప్పడం? పైగా అర్జంటని చెప్తున్నావు" కోపంగా
అడిగింది భార్య రాణి.
“ఏం చెయ్యమంటావు? ఇరుగిళ్ళకు, పొరుగిళ్ళకు కబుర్లు చెప్పడానికి వెళ్ళి ఇప్పుడేగా
వచ్చావు మరి....” అన్నాడు అరుణ్.
“ఆఁ..” అని నోరు తెరిచింది భార్య.



