సాగుతున్నసృష్టి క్రమం |
ఇలా ఎవరి గుణాలను బట్టి , ఎవరి చర్యలను బట్టి ,ఎవరి స్వభావాన్ని బట్టి వారికి ఆయా విధంగా నివాసాలను ఏర్పరిచారు .దా౦తో ఎవరి స్థావరాలకు వాళ్ళు వెళ్లి అక్కడే ఉండడం ప్రారంభించారు.
అనంతరం బ్రహ్మదేవుడి శరీరం నుండి మరికొ౦తమంది జనించారు . బ్రహ్మదేవుడు ఒడినుండి నారదుడు, బోటనివెలినుండి దక్షుడు , ప్రాణంనుండి వశిష్టుడు , చర్మం నుండి భ్రుగువు , చేతినుండి క్రతువు , నాభి నుండి పులముడు, చెవినుండి పులస్త్యుడు, ముఖం నుండి అంగీరసుడు, కళ్ళ నుండి అత్రి ,మనసు నుండి మరీచి మొదలైన మహర్షులు జన్మించారు.అలాగే రుచి , కర్దముడు, బృహస్పతి, సముద్రాలు, ఛందస్సు, ధర్మం, అధర్మం, కామ, క్రోధ, లోభాలు, ఓంకారం తదితరాలు కూడా అయన శరీరం నుండే పుట్టాయి . |
|
బ్రహ్మ అంశతోనే స్వాయంభువ మనువు కూడా జన్మించాడు. పద్మగంది, శతరూపి అనే కన్యామణుల్ని సృష్టించి మనువు జరుపుతాడు బ్రహ్మదేవుడు . ఈ దంపతులకు అగ్రియుడు, ప్రియవత్రుడు, ఉత్తానపాతుడు అనే ముగ్గురు కుమారులు , రాకూతి ,దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు జన్మిస్తారు.రాకూతికి రుచితోను, దేవహూతికి కర్దమునితోనూ, ప్రసూతికి, దక్షుడితోను పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇక శ్రీశకుడు దాక్షిణాఖ్య అనే ఆమెను వివాహం చేసుకు౦టాడు. వీరికి అర్చిష్మ౦తులనే ఇరవైఐదుమంది సంతానం కలుగుతుంది. దేవహూతికి కర్దముని వాళ్ళ కపిలుడు తదితరులు జన్మిస్తారు .
ప్రసులికి దక్షుని వల్ల అరవైనాలుగు మంది పుత్రికలు జన్మిస్తారు.
ఈ దక్షపుత్రికల్లో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, శాంతి, తుష్టి, పుష్టి, కీర్తి, సిద్ది, బుద్ధి, క్రియ, మేథ, లజ్జ, వసువు, అనే 13 మందిని ధర్ముడనే వాడు వివాహం చేసుకున్నాడు.
అలాగే ఖ్యాతి, సతి, సంభుతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నుతి, అనురూప, ఊర్జ, స్వాహ, స్వధ, అనే 11 మందిని భ్రుగువు ఉద్వాహమడతాడు.
ఇక సతీదేవిని పరమేశ్వరుడు కళ్యాణం చేసుకుంటాడు. మరీచి సంభూతిని, అంగీరసుడు స్మృతిని, పులస్త్యుడు ప్రీతిని పెళ్లిచేసుకోగా, క్రతువు పులముడు, అత్రి , వశిష్టుడు, అగ్నిపితరులు వీరంతా కూడా దక్షపుత్రికలను వివాహం చేసుకుంటాడు. అలా అయన సంతాన్నాని వీళ్ళ౦తా వివాహాలు చేసుకుని హాయిగా ఎవరిచోట వారు ప్రణయ జివన్నాని సాగిస్తుంటారు. వీరి ప్రణయ జీవితం కారణంగా ఈ సృష్టిలో ఎన్నో జీవరాసులు ఉత్పన్నమయ్యాయి.
“అలా ఈ సృష్టి మొదలైంది” అని సూతమహర్షి శౌనకాది మహర్షులకు వివరంగా చెప్పాడు.
ఇదంతా వివరంగా విన్న శౌనకాది మహర్షులు సూతునితో మళ్ళా ఇలా అంటారు. “ మహానుభావా! ని వల్ల మాలో కలిగిన సందియాలన్ని కూడా తీరుతున్నాయి. ఇంత విశదంగా సందేహాల్ని తీరుస్తూ పురాణాన్ని వివరించగలిగే శక్తి మీకంటే వేరేవారికీ లేదు” అంటూ “మహర్షి! దక్షనకు అరవైనాలుగు మంది సంతానం అని చెపుతారు. ఈ అరవైనాలుగు మందే కాక ఇంకా ఆయనకు అరవైమంది బిడ్డలున్నారని అంటారు. వాళ్ళంతాఎవరు? వాళ్ళు ఎవర్ని వివాహం చేసుకున్నారు? ఇత్యాది విషయాలన్నీ కూడా మాకు వివరంగా విశదీకరించి మా అనుమానాల్ని నివృతి చేయండి “అంటూ ప్రార్ధిస్తారు. |
ఇంకా ఉంది..... |
|